పెద్దపెద్ద ఎలక్ట్రానిక్ స్టోర్స్‌లో మసాజ్ చైర్లు కనిపిస్తుంటాయి. ఇక్కడకు షాపింగ్‌కు వచ్చిన వినియోగదారులు ఒక్కోసారి ఇటువంటి చైర్లలో సేదతీరుతుంటారు. అయితే ఈ విధంగా మసాజ్‌చైర్‌లో కూర్చున్న వ్యక్తికి వింత అనుభవం ఎదురయ్యింది. ఈ ఉదంతం జపాన్‌లో చోటుచేసుకుంది. ఒక వినియోగదారు మసాజ్ చైర్‌లో సేద తీరుతూ నిద్రపోయాడు. రాత్రి కావడంతో స్టోర్ బంద్ అయిపోయింది. ఆ వ్యక్తి ఫోనులో ట్వీట్ ద్వారా సాయం అడినప్పుడు ఈ విషయం వెలుగుచూసింది. @_Asphodelus అనే పేరు కలిగిన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఈ వ్యక్తి ట్వీట్ చేశాడు.
చీకటితో కూడిన ఒక ఫొటోను షేర్ చేసిన ఆయన ‘అయ్యయ్యో.. లోపలుండిపోయానే’ అని రాశాడు. కేఎస్ అనే పేరు కలిగిన స్టోర్ బంద్ అయి ఉండటాన్ని ఫోటోలో చూడవచ్చు. కాగా అనంతరం ఆ వ్యక్తి స్టోర్‌లోని అలారం మోగించగా పోలీసులకు ఈ సమాచారం అందింది. వెంటనే వారు స్టోర్ యజమానికి ఈ విషయాన్ని తెలియజేశారు. మొత్తం 10 మంది పోలీసు అధికారులు స్టోర్‌లో నుంచి అతనిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అతనిని దొంగ కాదని నిర్ధారించుకున్నారు.
కాగా స్టోర్‌కు తాళాలు వేసిన సిబ్బంది మసాజ్ చైర్‌లో ఉండిపోయి ఇబ్బందిపడిన వ్యక్తిని క్షమాణలు కోరారు. అయితే ఈ స్టోర్‌లో ఆ వ్యక్తి ఎంతసేపు బందీ అయిపోయారన్న విషయం తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన పోస్టుకు 39 వేలకుపైగా షేర్లు వచ్చాయి. ఈ పోస్టు చూసిన ఒక యూజర్ ‘డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో బంద్‌కావడం అనేది తన చిన్నప్పటి కల అని అన్నారు. మరొక యూజర్ తాను అలా బందీ అయితే ‘ఎస్కేప్ ది రూమ్’ స్టయిల్ గేమ్స్ ఆడుకుంటానని అన్నారు.
ఇది కూడా చదవండి: ‘ఏంట్రా ఇదంతా’..‘ఎవర్రా మీరు’.. ‘ఇదేందిది’.. వీటికి బాప్ ఈ వీడియో!
え…… pic.twitter.com/AalynpL1PB
— こばたつ (@afdc1257) August 15, 2016
Comments
Please login to add a commentAdd a comment