guilty
-
ఆ బాధను ఎలా అధిగమించాలి..?
డాక్టరు గారూ! నేనొక ప్రభుత్వ ఉద్యోగినిని. నా పిల్లలిద్దరూ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. 3 నెలల క్రితం 55 సంవత్సరాల నా భర్త సడెన్ హార్ట్ ఎటాక్‌తో మరణించారు. రాత్రి భోజనానికి తనకిష్టమైన కూర వండించుకుని తిన్నారు. ఉదయాన్నే నిద్ర లేచేసరికి పక్కనే విగత జీవిగా కనిపించారు. అప్పటినుంచి నాకు ఇంటికి రావాలంటేనే భయంగా ఉంటోంది. రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదు. అలాగే నిద్రలో ఉలిక్కిపడి లేవడం, గట్టిగా ఏడవడం చేస్తున్నాను. ఉన్నట్టుండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె దడ, విపరీతమైన భయం వేస్తున్నాయి. నాభర్త చనిపోవడానికి నా నిర్లక్ష్యమే కారణమేమోననే వేదన నన్ను కలచి వేస్తోంది. ఎంత సర్ది చెప్పుకుందామన్నా నావల్ల కావడం లేదు. ఈ బాధను అధిగమించే మార్గం చెప్పగలరా?– శాంతిశ్రీ, విజయనగరంమీరు అనుభవిస్తున్న ఈ వేదన, బాధ పూర్తిగా అర్థం చేసుకోగలను. మీ స్థానంలో ఉన్న వారికి ఇలాంటి లక్షణాలు ఉండటం చాలా సహజం. మీకున్న ఈ నిద్రలేమి, గుండెదడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ప్యానిక్ ఎటాక్ని సూచిస్తున్నాయి. ఈ మానసిక స్థితి ఇటువంటి ట్రామాటిక్ సంఘటనకు సహజమైన ప్రతిస్పందన. సైలెంట్ హార్ట్ ఎటాక్స్ని ముందుగా అంచనా వేయడం లేదా పూర్తిగా నివారించడం అసాధ్యం అని మీరు గుర్తించాలి. అందువల్ల మీరు వారిపై చూపించిన ప్రేమ, ఆప్యాయతలను పదే పదే గుర్తు తెచ్చుకోవడం ద్వారా మీలో ఉన్న గిల్ట్ ఫీలింగ్ తగ్గుతుంది. దగ్గరిలోని సైకియాట్రిస్ట్ట్ని సంప్రదించి, మైండ్‌ఫుల్‌నెస్ థెరపీ, కాగ్నిటివ్ థెరపీ తీసుకోవడం వలన మీ బాధ తగ్గడమే కాక మీ ఆలోచనలు మార్చడానికి, కోపింగ్ స్ట్రేటజీస్ పెంచడానికి సహాయపడుతుంది. అలాగే డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ధ్యానం, ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ వంటివి తప్పక సహాయపడతాయి. నిద్ర వచ్చినా రాకపోయినా నిద్ర షెడ్యూల్ పాటించడం చాలా ముఖ్యం. అవసరాన్ని బట్టి కొన్ని రకాల మందులు కూడా మీరు త్వరగా కోలుకోవడానికి సహకరిస్తాయి.డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. (మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com) -
బిల్కిస్ బానో కేసు దోషులకు సుప్రీంకోర్టు షాక్
న్యూఢిల్లీ: బిల్కిస్ బానో కేసులో దోషులు రాధేశైమ్ భగవాన్‌దాస్ షా, రాజుభాయ్ బాబూలాల్ సోనీ సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. రెమిషన్(శిక్ష తగ్గింపు) పిటిషన్‌పై తీర్పు వచ్చేవరకు తమకు బెయిల్ మంజూరు చేయాలన్న వాళ్ల అభ్యర్థనను తిరస్కరించింది. 2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్లో పెద్దఎత్తున మతపరమైన అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఆ అల్లర్లలో బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు హత్యకు గురయ్యారు. ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై దుండగులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 2008లో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే.... 14 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నవారికి 2022లో గుజరాత్ ప్రభుత్వం రెమిషన్ మంజూరు చేసింది. దీంతో 2022 ఆగస్టు 15న వారంతా జైలు నుంచి విడుదలయ్యారు. గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బానో సుప్రీం తలుపుతట్టారు. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ.. వారి విడుదల చెల్లదని ఈ ఏడాది జనవరి 8న సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. దోషుల్ని జైలు అధికారుల వద్ద లొంగిపోవాలని ఆదేశించింది. అయితే తీర్పును సవాలు చేస్తూ భగవాన్‌దాస్, బాబూలాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజా తమ రిమిషన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే వరకు తాత్కాలికంగా తమను విడుదల చేయాలని, ఇందుకోసం బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం.. దీనిని పూర్తిగా తప్పుడు పిటిషన్‌గా పేర్కొంది. కోర్టులోని ఒక బెంచ్ జారీ చేసిన ఆర్డర్‌పై మరొక బెంచ్ ఎలా అప్పీల్ చేస్తారని ప్రశ్నించింది. దీంతో.. ఇద్దరు పిటిషనర్లు తమ పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి అనుమతి కోరగా దానికి బెంచ్ అనుమతించింది. -
హెల్త్‌కేర్ మోసాలకు పాల్పడ్డ భారత సంతతి ఫిజిషియన్
అమెరికాలో భారత సంతతికి చెందిన ఫిజిషియన్ మోనా ఘోష్ హెల్త్ కేర్ మోసానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రసూతికి సంబంధించిన స్త్రీ జననేంద్రియ సేవల్లో నైపుణ్యం కలిగిన ఆమె చికాగోలో ప్రోగ్రెసివ్ ఉమెన్స్ హెల్త్ర్ను నిర్వహిస్తున్నారు. అయితే ఆమె ప్రైవేట్ బీమా సంస్థలకు కూడా లేని సేవలకు బిల్లులు క్లయిమ్ చేసిన మోసాని పాల్పడ్డారు. ఆమె విచారణలో ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన రెండు మోసాలకు పాల్పడినట్లు అంగీకరించారు. ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఘోష్ మోసాపూరితంగా పొందిన రీయింబర్స్‌మెంట్‌లలో దాదాపు రూ.27 కోట్లకు జవాబుదారిగా ఉన్నట్లు ఆరోపించింది. అయితే ఘోష్ తన అభ్యర్థన ఒప్పందంలో రూ. 12 కోట్లకు మాత్రమే జవాబుదారిగా ఉన్నానని పేర్కొంది. ఈ మోసాలకు గానూ అమెరికా జిల్లా న్యాయమూర్తి ఫ్రాంక్లిన్ యు వాల్డెర్రామా అక్టోబర్ 22న శిక్ష ఖరారు చేశారు. ఆమె 2018 నుంచి 2022 వరకు తన ఉద్యోగులు సమర్పించిన మెడిసెడ్, ట్రైకేర్ వంటి వాటికి ఇతర బీమా సంస్థలు కూడా అందించని లేదా వైద్యపరంగా అవసరం లేని సేవలకు కూడా మోసపూరితంగా క్లెయిమ్‌లను సమర్పించారని కోర్టు పేర్కొంది.ఇదంతా రోగి అనుమతి లేకుండానే ఆమె ఈ మోసానికి పాల్పడ్డట్లు తెలిపింది. అందుకుగానూ ఆమె ఎంత మొత్తం చెల్లించాల్సిందనేది శిక్షాకాలంలో కోర్టే నిర్ణయిస్తుందని తీర్పులో పేర్కొంది. ఇక ఘోష్ కూడా అధిక రీయింబర్స్మెంట్లు పొందేందుకు టెలిమెడిసిన్ సందర్శనలు ఎక్కువగా చేసినట్లు పేషెంట్ మెడికల్ రికార్డ్లను సృష్టించానని అంగీకరించింది. అలాగే అవసరం లేని బిల్లింగ్ కోడ్లను క్లైయిమ్ చేసినట్లు కూడా ఘోష్ విచారణలో ఒప్పుకుంది.(చదవండి: నాలుగేళ్ల తరువాత ఇంటికి బయలుదేరిన యువతి: విమానంలోనే కన్నుమూత) -
మాస్కో మారణహోమం.. నేరం ఒప్పుకున్న ఉగ్రవాదులు
మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో దాడులకు పాల్పడ్డ నలుగురిలో ముగ్గురు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. దాడులకు పాల్పడ్డ అనుమానితుల్ని అరెస్టు చేసిన అనంతరం ఆదివారం(మార్చి 24) వారిని మాస్కోలోని బాస్మనే జిల్లా కోర్టులో హాజరుపరిచారు. సంగీత కచేరిలో కాల్పులు జరిపింది తామేనని ఈ సందర్భంగా ముగ్గురు ఉగ్రవాదులు ఒప్పుకున్నారు. దీంతో.. మొత్తం నలుగురికీ మే 22 వరకు కోర్టు ప్రి ట్రయల్ కస్టడీ విధించింది. కాల్పులకు పాల్పడిన నలుగురు తజికిస్థాన్‌కు చెందినవారని తేల్చారు. కోర్టుకు తీసుకువచ్చినపుడు నలుగురి శరీరాలు గాయాలమయమై రక్తమోడుతున్నాయి. ముఖాలన్నీ ఉబ్బిపోయాయి. ఒక ఉగ్రవాదికి ఏకంగా ఒక చెవే లేకుండా పోయింది. విచారణ సమయంలో పోలీసులు వీరిని తీవ్రంగా హింసించారని మీడియా కథనాలు వెలువడ్డాయి. నలుగురితో పాటు దాడులతో సంబంధం ఉన్న మరో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మార్చి 22 రాత్రి మాస్కో శివార్లలోని ఓ సంగీత కచేరి కార్యక్రమంలో నలుగురు ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 133 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడులకు తామే కారణమని ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అయితే దాడులకు ఉక్రెయిన్‌కు లింకు ఉందని, దాడి తర్వాత ఉగ్రవాదులు ఉక్రెయిన్‌కు పారిపోయేందుకు ప్రయత్నించారని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపించారు. ఇదీ చదవండి.. ఉక్రెయిన్‌పై రష్యా మిసైళ్ల వర్షం -
అమెరికాలో సెటిలయ్యేందుకు ‘దొంగపెళ్లి’.. చుక్కలు చూపించిన అధికారులు!
అమెరికాలోని ఇల్లినాయిస్లో ఉంటున్న 35 ఏళ్ల భారతీయుడు యూఎస్‌లో స్థిరపడేందుకు, గ్రీన్ కార్డ్ సంపాదించే ఉద్దేశంతో అక్కడి మహిళను వివాహం చేసుకున్నట్టు దొంగ రుజువులు చూపి, మోసానికి పాల్పడ్డాడు. ఈ నేరానికి పాల్పడిన వివేక్ చౌహాన్‌కు ఈ కేసులో నేరం రుజువైతే గరిష్టంగా ఐదేళ్ల జైలుశిక్ష, 250,000 అమెరికన్ డాలర్ల జరిమానా విధిస్తామని యుఎస్ అటార్నీ ట్రిని ఇ రాస్ ప్రకటించారు. 2018, ఏప్రిల్ 2న చౌహాన్ మసాచుసెట్స్‌లోని వోర్సెస్టర్‌కు చెందిన అమెరికా పౌరురాలిని వివాహం చేసుకున్నాడు. అయితే వారి వివాహం నిజం కాదని పోలీసుల దర్యాప్తులో తేలింది. వివేక్ చౌహాన్ దంపతులు ఎప్పుడూ కలిసి నివసించలేదని, గ్రీన్ కార్డ్ పొందేందుకు వివేక్ చౌహాన్ ఆమెను ‘కాంట్రాక్ట్ మ్యారేజ్’ చేసుకున్నాడని కేసును విచారిస్తున్న అసిస్టెంట్ యూఎస్ అటార్నీ జాన్ డీ ఫాబియన్ పేర్కొన్నారు. 2018, జూన్ 1న వివేక్ చౌహాన్ తన భారతీయ పాస్‌పోర్ట్‌ను చూపించి, మారిన తన వైవాహిక స్థితిని పేర్కొంటూ, అమెరికాలో శాశ్వత నివాసాన్ని పొందేందుకు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి దరఖాస్తును సమర్పించాడు. ఈ నేపధ్యంలో 2019 మే నెలలో యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) అతనిని ఇంటర్వ్యూ చేసింది. ఆ సమయంలో వివేక్ చౌహాన్ ‘కాంట్రక్ట్ భార్య’ తాను చౌహాన్‌తో కలిసి ఉంటున్నట్లు అధికారులకు తెలియజేసింది. కాగా వివేక్ చౌహాన్‌ను 2021, నవంబర్‌లో యూఎస్సీఐఎస్ రెండవసారి ఇంటర్వ్యూ చేసింది. ఆ సమయంలో వివేక్ చౌహాన్ తాను తన భార్యతో కలిసి ఉంటున్నట్లు చెప్పాడు. పైగా తన భార్య గర్భవతి అని కూడా వారిని నమ్మబలికాడు. కాగా చౌహాన్‌ను వివాహం చేసుకున్న యూఎస్ మహిళ ఇటువంటి పలు మోసపూరిత వివాహాలకు పాల్పడిందని, యూఎస్సీఐఎస్ ఇంటర్వ్యూలలో అబద్దాలు చెప్పి, అధికారులను తప్పుదారి పట్టించిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. కాగా ఈ ఉదంతంలో చౌహాన్‌కు 2024 జనవరి 26న శిక్ష ఖరారు కానున్నదని సమాచారం. ఇది కూడా చదవండి: ఊహించని పరిస్థితుల్లో నాగసాకిపై అణుబాంబు? -
కెనడాలో భారతీయుడికి ఐదేళ్ల జైలు శిక్ష..
న్యూయార్క్: కెనడాలోని ఒంటారియో నివాసముంటున్న భారతీయుడు సిమ్రాన్ జిత్ షల్లీ సింగ్(40) మానవ అక్రమ రవాణాకు పాల్పడిన కేసులో ఐదేళ్ల జైలు శిక్ష. 250,000 జరిమానా విధించింది అల్బనీలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు. సింగ్ మొదటగా ఆరుగురిని అక్రమ రవాణా చేయగా న్యూయార్క్ లో ఉండగా మరో ముగ్గురిని అక్రమ రవాణా చేసినట్లు అంగీకరించాడు. యూఎస్ అభ్యర్ధన మేరకు సింగ్ ను 2022 జూన్ 28న కెనడాలో అరెస్టు చేశారు. తర్వాత అమెరికా తరలించారు. ఈ ఏడాది మార్చిలో అతడిని విచారణ నిమిత్తం కెనడా నుండి అమెరికా రప్పించారు. విచారణలో మార్చి 2020 నుండి మార్చి 2021 మధ్యలో అతను అనేక మంది భారతీయులను కెనడా నుండి కార్న్ వాల్ ద్వీపం, సెయింట్ లారెన్స్ నదీ ప్రాంతంలోని అక్వెసన్సే భారత రిజర్వ్ మీదుగా అమెరికాకు అక్రమంగా రవాణా చేసినట్టు తేలింది. అతడు మానవ రవాణాకు ఎక్కువగా ఈ మార్గాన్నే ఎంచుకునేవాడని తేలింది. నిందితుడు సెయింట్ లారెన్స్ నదిలో పడవల ద్వారా అమెరికాకు తరలించే వాడని తెలిపారు అల్బనీ పోలీసులు. గతంలో ఇదే నదిలో నలుగురు భారతీయులు, నలుగురు రోమానియన్ల మృతదేహాలను గుర్తించామని, అప్పుడే ఈ ఉదంతం మొత్తం వెలుగులోకి వచ్చినట్లు అల్బనీ పోలీసులు తెలిపారు. కొంతమంది అక్రమ వలసదారులు అమెరికన్ లా ఎన్ఫోర్స్ మెంట్ వారికి సమర్పించిన డాక్యుమెంట్ల ఆధారంగా చూస్తే సింగ్ బాధితుల వద్ద నుండి 5000 నుండి 35000 డాలర్ల వరకు వసూలు చేసేవాడని తేలింది. ఈ నేరారోపణలన్నిటిలోనూ సింగ్ దోషిగా తేలడంతో న్యూయార్క్ అల్బనీలోని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి మెయ్ ఏ.డి. ఆగోష్ఠినో నిందితుడికి మొదట ఐదేళ్ల కారాగార శిక్ష విధిస్తూ దీన్ని 15 ఏళ్ల వరకూ పొడిగించే ఆవకాశముందని అన్నారు. జైలు శిక్ష తోపాటు సింగ్ కు 250,000 యూఎస్ డాలర్ల జరిమానా కూడా విధించారు. జైలు శిక్ష డిసెంబర్ 28, 2023 నుండి అమల్లోకి వస్తుందని తీర్పునిచ్చారు. ఇది కూడా చదవండి: గగుర్పాటు కలిగించే ఘటన.. ఎత్తైన భవనంపై సాహసం.. అంతలోనే పట్టుతప్పి.. -
Umesh Pal kidnapping case: గ్యాంగ్‌స్టర్ అతిక్‌ని దోషిగా తేల్చిన కోర్టు!
2006 ఉమేష్‌పాల్ కిడ్నాప్ కేసులో గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్‌ను ప్రయాగ్‌రాజ్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. అతిక్‌తోపాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు శిక్ష విధించింది. ఈ కేసులో అతిక్ అహ్మద్ సోదరుడు ఖలీద్ అజీమ్ అలియాస్ అష్రఫ్ సహా మరో ఏడుగురిని నిర్ధోషులుగా ప్రకటించింది. 2006లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో కీలక సాక్షి ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో కీలక నిందితులుగా ఉన్న అతిక్, అతని సోదరుడిని నేడు ప్రయాగ్‌రాజ్ కోర్టు ముందు హజరు పరిచారు. కాగా యూపీ పోలీసు కస్టడీలో తన ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆరోపిస్తూ.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిని అత్యున్నత ధర్మాసనం తిరస్కరించింది. ఇది ఈ కోర్టు జోక్యం చేసుకునే కేసు కాదని తేల్చి చెప్పింది. దీనికోసం కావాలంటే హైకోర్టుని ఆశ్రయించమని చెప్పింది. ఈ మేరకు అతిక్ అహ్మద్, అతని సోదరుడిని భారీ భద్రత మధ్య ప్రయాగ్‌రాజ్‌లోని నైని సెంట్రల్ జైలుకు తీసుకువచ్చారు యూపీ పోలీసులు. భారీ బందోబస్తు నడుమ అతిక్ అహ్మద్‌ను ప్రయాగ్‌రాజ్‌లోని కోర్టుకు తరలించారు. ఇదిలా ఉండగా, 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు తానే సాక్షినని ఉమేష్‌పాల్ పోలీసులను ఆశ్రయించాడు. 2006లో ఉమేష్ పాల్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోమంటూ అతిక్ ఒత్తిడి చేశాడు. అందుకు నిరాకరించడంతో కిడ్నాప్ చేసేందుకు యత్నించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఉమేష్. ఐతే అతను కిడ్నాప్ కేసు విచారణ రోజే పట్టపగలే అనూహ్యంగా హత్యకు గురయ్యాడు. దీంతో ఈ కేసు విషయమై అతిక్ అహ్మద్, అతని సోదరుడి తోసహా మరో నలుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. (చదవండి: జైలు నుంచి రాను..ఆ శిక్ష ఏదో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విధించండి) -
సైకిల్ పార్టీ కీలక నేతకు 3 ఏళ్ల జైలు శిక్ష.. ఎమ్మెల్యే పదవికి ఎసరు!
లక్నో: అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ కీలక నేత ఆజాం ఖాన్‌కు షాక్ ఇచ్చింది కోర్టు. ద్వేషపూరిత ప్రసంగం ఆరోపణల కేసులో దోషిగా తేల్చింది. ఈ కేసులో విచారణ చేపట్టిన ఉత్తర్‌ప్రదేశ్ రామ్‌పుర్ కోర్టు ఆజాం ఖాన్‌కు 3 ఏళ్ల పాటు జైలు శిక్ష ఖరారు చేసింది. దాంతో పాటు రూ.25వేల జరిమానా కట్టాలని ఆదేశించింది. 2019లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర్‌ప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్, అప్పటి ఐఏఎస్ అధికారిపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినట్లు ఆజాం ఖాన్‌పై కేసు నమోదైంది. తాజాగా విచారణ జరిపిన కోర్టు దోషిగా తేల్చుతూ తీర్పు వెలువరించింది. ఓ చీటింగ్ కేసులో సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన క్రమంలో ఈ ఏడాది మే నెలలోనే జైలు నుంచి విడుదలయ్యారు ఆజాం ఖాన్. సుమారు రెండేళ్ల పాటు జైలు జీవితం గడిపారు. అయితే, మరోమారు ద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో దోషిగా తేలటం కీలకంగా మారింది. నేరం రుజువైన తర్వాత రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడితే.. అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోతారు. ఆజాం ఖాన్‌కు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించిన క్రమంలో ఆయన తన ఎమ్మెల్యే పదవిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. 2017లో యూపీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆజాం ఖాన్‌పై అవినీత, దోపిడి వంటి 90 రకాల కేసులను నమోదు చేసింది. ఇదీ చదవండి: ‘అదే మా లక్ష్యం’.. పీఓకేపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు! -
ప్రశాంత్ భూషణ్‌కు ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు సుప్రీంకోర్టులోఎదురుదెబ్బ తప్పలేదు. ట్విటర్ వేదికగా ఉన్నత న్యాయస్థానం, న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలతో కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టుగా నిర్ధారించిన కోర్టు ప్రశాంత్ భూషణ్‌ను దోషిగా తేల్చింది. ‘‘తీవ్రమైన" ధిక్కారానికి పాల్పడినట్లుగా తేలిందంటూ సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది. అనంతరం భూషణ్‌కు శిక్షపై విచారణను ఈ నెల 20 తేదీకి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తికి, అంతకుముందు సీజేఐలుగా ఉన్న మరో నలుగురి గౌరవానికి భంగం కలిగించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ఇవి కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని స్పష్టం చేస్తూ దోషిగా తేల్చింది. దీనిపై ప్రశాంత్ భూషణ్‌కు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష లేదా 2000 రూపాయల వరకు జరిమానాతో లేదా రెండింటితో సాధారణ జైలు శిక్ష విధించవచ్చని భావిస్తున్నారు. కాగా కోర్టు ధిక్కరణ ఆరోపణలతో ప్రశాంత్ భూషణ్‌కు జూలై 22న షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుకు సమాధానమిస్తూ, వివరణాత్మక అఫిడవిట్‌ను ప్రశాంత్ దాఖలు చేశారు. దీన్ని ఆగస్టు 5 న విచారించిన కోర్టు తీర్పును రిజర్వు చేసిన సంగతి తెలిసిందే -
గిల్టీ ఫీలింగ్‌తో...
ఏదో నేరం చేసినట్టు గిల్టీగా ఫీల్ అవుతున్నారు కియారా అద్వానీ. అంత తప్పేం చేసిందీ అనుకోవద్దు. కియారా ఏ తప్పూ చేయలేదు. మరి గిల్ట్ ఎందుకు అంటే ‘గిల్టీ’ పేరుతో నెట్‌ఫ్లిక్స్ కోసం ఆమె ఓ సినిమా చేయబోతున్నారు. ఆల్రెడీ ‘లస్ట్ స్టోరీస్’తో డిజిటల్ ప్లాట్ఫామ్లో బోలెడంత క్రేజ్ తెచ్చుకున్నారు కియారా. అందులో చాలా బోల్డ్‌గా నటించారు. మరి.. ‘గిల్టీ’లో ఎలాంటి పాత్రలో కనిపిస్తారో చూడాలి. రుచి నరైన్ దర్శకత్వం వహిస్తారు. కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన కియారా లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. ఇది సరే కానీ కియారా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై మొగ్గు చూపుతున్నారు.. చేతిలో సినిమాలు లేవా? అంటే... అదేం కాదు. ప్రస్తుతం లక్ష్మీబాంబ్, షేర్షా అనే హిందీ చిత్రాల్లో నటిస్తున్నారు కియారా. ఇటు సౌత్‌లోనూ సినిమాలు చేయడానికి సంప్రదింపులు జరుపుతున్నారు. -
జంట హత్యల కేసులో దోషిగా తేలిన రాంపాల్
సాక్షి, న్యూఢిల్లీ : తనకు తాను స్వామీజీగా చెప్పుకునే రాంపాల్ బాబా రెండు హత్య కేసుల్లో దోషిగా తేలారు. హర్యానాలోని హిసార్ కోర్టు గురువారం ఆయనను జంట హత్యల కేసులో దోషిగా నిర్ధారించింది. ఈనెల 16, 17 తేదీల్లో ఆయనకు విధించే శిక్షను కోర్టు ఖరారు చేయనుంది. పెద్ద ఎత్తున శిష్యగణం కలిగిన రాంపాల్ ప్రస్తుతం హిసార్ సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్నారు. తన అనుచరులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురు మరణించడం, పలువరు గాయపడిన ఘటనకు సంబంధించి 2015 నవంబర్‌లో రాంపాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్ధానం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీర్పును వెలువరించింది. తీర్పు నేపథ్యంలో శాంతిభద్రతల పర్యవేక్షణకు హిసార్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 1800 మంది పోలీసులను నియోగించారు. 2017 ఆగస్ట్‌లో డేరా బాబాను దోషిగా తేల్చిన సందర్భంలో పంచ్కులలో చెలరేగిన ఘర్షణలు పునరావృతం కాకుండా పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. రాంపాల్ అనుచరులు హిసార్లోకి ప్రవేశించకుండా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. -
ఆర్మీ మేజర్ గొగోయ్ దోషే
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఓ యువతిలో హోటల్లో పట్టుబడ్డ ఆర్మీ మేజర్ లితుల్ గొగోయ్‌ను ఆర్మీ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ దోషిగా నిర్ధారించింది. స్థానిక యువతితో సన్నిహితంగా ఉండటం, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా విధి నిర్వహణ ప్రాంతానికి దూరంగా వెళ్లి మేజర్ ఆర్మీ నిబంధనలను ఉల్లంఘిం చారంది. ఈ ఏడాది మే 23న శ్రీనగర్‌లోని ఓ హోటల్లో గొగోయ్ ఓ యువతి(18)తో కలసి గదిలోకి వెళ్లేందుకు యత్నించారు. దీంతో హోటల్ యాజమాన్యం ఆయన్ను అడ్డుకుంది. ఈ సందర్భంగా వాగ్వాదం తలెత్తడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గొగోయ్‌ను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో బ్రిగేడియర్ స్థాయి అధికారి నేతృత్వంలో కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి సైన్యం ఆదేశించింది. అయితే తాను రహస్య సమాచార సేకరణ కోసమే యువతితో హోటల్‌కు వెళ్లానని గొగోయ్ చెప్పారు. గొగోయ్ దోషిగా తేలిన నేపథ్యంలో ఆయన కోర్టు మార్షల్ (మిలటరీ చట్టాల ప్రకారం ఆర్మీ కోర్టు విచారణ)ను ఎదుర్కొనే అవకాశముంది. 2017, ఏప్రిల్ 9న శ్రీనగర్ ఉప ఎన్నికల్లో రాళ్లదాడిని తప్పించుకోవడానికి ఫరూఖ్ అహ్మద్ దార్ అనే స్థానిక యువకుడిని జీప్‌కు కట్టేసి మానవకవచంగా గొగోయ్ వాడుకున్నారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. గొగోయ్‌ను కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ దోషిగా తేల్చడంపై మానవకవచం బాధితుడు ఫరూఖ్ అహ్మద్ దార్ స్పందిస్తూ.. తన జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తి దేవుడి ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నాడన్నారు. -
ఏ ర్యాంక్ అధికారి అయినా తప్పుచేస్తే శిక్ష తప్పదు
-
‘సైతాన్ ఆవహించింది.. అందుకే హత్య చేశా’
న్యూయార్క్ : బ్రూక్లీన్‌కు చెందిన ఇద్దరు చిన్నారులను అతి కిరాతంగా పొడిచి.. ఓ చిన్నారి చావుకు కారణమైన కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష విధిస్తూ స్థానిక కోర్టు తీర్పు నిచ్చింది. చిన్నారులను కత్తితో విచక్షణా రహితంగా పొడవడాన్ని అత్యంత హేయమైన చర్యగా కోర్టు అభివర్ణించింది. నిందితుడు డేనియల్ సేయింట్ హాబర్ట్ మాట్లాడుతూ.. తనను సైతాను ఆవహించిందని, ఆ సమయంలో ఏం చేస్తున్నానో తెలియక చేశానని కోర్టు విచారణలో తెలిపాడు. వివరాల్లోకి వెళితే.. 2014 సంవత్సరంలో బ్రూక్లీన్‌కు చెందిన ప్రిన్స్ జోషువా అవిట్టో (6), మికైలా (7) ఇంటి సమీపంలోని ఆట స్థలంలో ఆడుకున్న తర్వాత ఇంటికి బయలు దేరారు. అదే ప్రాంతానికి చెందిన సెయింట్ హాబర్ట్ వారిని వెంబడించాడు. మెట్ల మీదుగా భవంతి పైఅంతస్థులో ఉన్న తమ ఇంటికి వెళుతుండగా.. లిఫ్టులో వెళితే బాగుంటుందని చెప్పి లోపలికి ఎక్కించాడు హాబర్ట్. లిఫ్టు లోపల మాట్లాడుకుంటున్న చిన్నారులను అల్లరి చేయవద్దని హాబర్ట్ వారించాడు. అయినా వాళ్లు వినకపోవడంతో వెంట తెచ్చుకున్న కత్తితో ప్రిన్స్‌ను 16 సార్లు పొడిచాడు. ఆ తర్వాత మికైలాను కూడా 12 సార్లు పొడిచాడు. పిల్లల అరుపులు విని చుట్టుపక్కల వారు అక్కడికి రావడంతో కత్తి అక్కడే పడేసి పరారయ్యాడు. కత్తిపోట్లతో రక్తమోడుతున్న చిన్నారులిద్దరినీ స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో ఉన్న ప్రిన్స్ ప్రాణాలతో పారాడుతూ తొమ్మిది రోజుల తర్వాత ప్రాణాలు విడిచాడు. మికైలా మాత్రం ప్రాణాలతో బయట పడింది. నాలుగు రోజుల తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కత్తి మీద ఉన్న రక్తపు మరకల్లోని డీఎన్ఏ సహాయంతో అతడే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని పోలీసులు నిర్ధారించారు. కోర్టు శిక్ష విధించిన అనంతరం ప్రిన్స్ తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. హాబర్ట్కు జీవితఖైదు విధించడంతో తమ కుమారుడి ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు. -
వెస్ట్‌మినిస్టర్‌లో గిల్ట్ ట్యాక్స్!
లండన్: బ్రిటన్ రాజధాని లండన్‌లో అంతర్భాగమైన వెస్ట్‌మినిస్టర్ ప్రాంతంలో స్థానిక పన్నుల ఆదాయాన్ని పెంచేందుకు ఓ కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. లండన్‌లోనే కాక మొత్తం బ్రిటన్‌లోనే అత్యంత సంపన్న ప్రాంతాల్లో వెస్ట్మినిస్టర్ఒకటి. ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా వెస్ట్‌మినిస్టర్ కౌన్సిల్ అనే నగర పాలక సంస్థ కూడా ఉంది. ప్రజలందరూ సాధారణంగా కట్టే పన్నులకు అదనంగా సంపన్నులు స్వచ్ఛందంగా కూడా విరాళాలు ఇవ్వాలని వెస్ట్‌మినిస్టర్ కౌన్సిల్ ప్రతిపాదిస్తోంది. ఈ విరాళాలను అక్కడి మీడియా ‘గిల్ట్ ట్యాక్స్’ అని వ్యవహరిస్తోంది. గిల్ట్ ట్యాక్స్ ద్వారా వచ్చిన డబ్బును ఉద్యోగ కల్పన, రోడ్లపై నిద్రించేవారికి దుప్పట్లు ఇవ్వడం తదితర అవసరాలకు ఉపయోగిస్తామని వెస్ట్‌మినిస్టర్ కౌన్సిల్ చెబుతోంది. కోటి పౌండ్లకు పైగా ఆస్తులు ఉన్న వారి నుంచి స్వచ్ఛందంగానే గిల్ట్ ట్యాక్స్‌ను వసూలు చేస్తామనీ, ఇందుకోసం 15 వేల మంది సంపన్నులకు లేఖలు రాస్తామంటోంది. -
జిషా కేసు.. ఇస్లాంను దోషిగా తేల్చిన కోర్టు
-
జిషా కేసు.. ఇస్లాంను దోషిగా తేల్చిన కోర్టు
సాక్షి, తిరువనంతపురం : ఒక్క కేరళలోనే కాదు.. యావత్ దేశంలో సంచలనం సృష్టించిన జిషా హత్యాచార కేసులో కేరళ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఆరోపణలు ఎదుర్కుంటున్న నిందితుడు అమీర్ ఉల్ ఇస్లాంను దోషిగా కోర్టు నిర్ధారించింది. శిక్ష ఇంకా ఖరారు చెయ్యలేదు. కాగా, మృగ పైశాచిక చేష్టలకు సాక్ష్యంగా నిలిచిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఎర్నాకులం జిల్లా పెరంబవూర్ నుంచి కురుప్పామ్‌పడి లో స్థిరపడింది జిషా కుటుంబం. న్యాయ విద్యార్థి అయిన 30 ఏళ్ల జిషా గతేడాది ఏప్రిల్ 28న కెనాల్ బండ్లో ఉన్న ఆమె ఇంట్లోనే అతి కిరాతకంగా హత్యాచారానికి గురైంది. వాంఛ తీర్చుకోవడానికి ఆమెను అతి కిరాతకంగా హింసించి చంపారు. మర్మాంగాలతోసహా శరీరంపై కత్తితో 30 పొట్లు పొడిచారు. ఆ సమయంలో ఆమె తల్లి, సోదరి ఇంట్లో లేరు. ఇంట్లోంచి అరుపులు వినిపిస్తున్నా స్థానికులు స్పందించలేదు. ఘటన తర్వాత కేరళ అగ్నిగుండగా మారింది. ఇంట్లో ఉన్న మహిళలకు కూడా రక్షణ లేకుండా పోయిందని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వినిపించాయి. ఈ దాషీక్టంపై మహిళా, ప్రజా సంఘాలు రోడెక్కి ఆందోళన చేపట్టాయి. పైగా బాధితురాలు దళిత వర్గానికి చెందటంతో అది మరింత ఉధృతం అయ్యింది. కేసు పురోగతిలో జాప్యం జరగటంతో ప్రభుత్వంపై కేరళ ప్రజానీకం మండిపడింది. చివరకు అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి ప్రభుత్వ ఓటమికి ప్రత్యక్షంగా ఓ కారణం కూడా అయ్యింది. పోలీసులు ఈ కేసును సీరియస్‌గా దర్యాప్తు చేయగా.. ఘటన జరిగిన రెండు నెలల తరువాత తమిళనాడు కాంచీపురంలో అస్సాంకు చెందిన అమీర్ ఉల్ ఇస్లాం ను పోలీసులు అరెస్టు చేశారు. కూలీ పనులు చేసుకునే అతను మద్యం మత్తులోనే ఆ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. హత్య అనంతరం అమీర్ కాంచీపురానికి పారిపోయి అక్కడ ఉద్యోగం చేశాడు. అతని గది నుంచి హత్యకు వాడిన మారణాయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 1500 పేజీల ఛార్జీ షీట్‌ను గతేడాది సెప్టెంబర్‌లోనే కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో తొలుత సబు అనే వ్యక్తి పేరు తెరపైకి రాగా.. కారణం ఏంటో తెలీదుగానీ అతను ఈ ఏడాది జూలై లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక మరో వ్యక్తి స్కెచ్‌ను పోలీసులు విడుదల చేయగా.. అతను ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. ఎల్డీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఏడీజీపీ సంద్య ఆధ్వర్యంలో మళ్లీ విచారణకు ఆదేశించింది. 290 పేజీల డాక్యుమెంట్లు, 36 మెటీరియల్ సాక్ష్యాలు, ఐదుగురు సాక్ష్యుల విచారణ.. ఫోరెన్సిక్ నివేదిక తదితరాలు ఇస్లాం తప్పు చేసినట్లు తేల్చాయి. ఇక ఏప్రిల్ 4, 2017న ఈ కేసులో విచారణ ప్రారంభమైంది. తన క్లయింట్‌ను కేసులో ఇరికించారని ఇస్లాం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. చివరకు నేరం తనే చేశానని గతంలో ఒప్పుకున్న స్టేట్మెంట్ను పరిగణనలోకి తీసుకున్న ఎర్నాకులం సెషన్స్ కోర్టు అమీర్ ఉల్ ఇస్లాంను దోషిగా తేల్చింది. -
మాల్యా దోషే: సుప్రీంకోర్టు
► రూ. 260 కోట్లను తన పిల్లలకు బదిలీ చేయడం కోర్టు ధిక్కరణే ► జూలై 10లోపు కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశం న్యూఢిల్లీ: కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ.. దాదాపు 40 మిలియన్ డాలర్లను(రూ. 260 కోట్లు) తన పిల్లలకు బదిలీ చేసినందుకు కింగ్‌ఫిషర్ మాజీ అధినేత విజయ్ మాల్యాను సుప్రీంకోర్టు దోషిగా నిర్ధారించింది. ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్న మాల్యాను శిక్షపై తన వాదనలు వినిపించేందుకు జూలై 10 లోపు తన ముందు హాజరుకావాలని మంగళవారం కోర్టు ఆదేశించింది. ‘రెండు ఆధారాల్ని పరిగణనలోకి తీసుకుని కోర్టు ధిక్కరణ కేసులో మాల్యాను దోషిగా తేల్చా’మని జస్టిస్ ఏకే గోయల్, యుయు లలిత్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. బ్యాంకులకు దాదాపు రూ.9 వేల కోట్లకు పైగా ఎగవేత కేసులో నిందితుడిగా ఉన్న మాల్యాను అప్పగించాలంటూ ఇటీవలే బ్రిటన్ను భారత్ అధికారికంగా కోరిన సంగతి తెలిసిందే. కర్ణాటక హైకోర్టు ఆదేశాల్ని ధిక్కరిస్తూ డబ్బును కొడుకు సిద్ధార్థ్ మాల్యా, కుమార్తెలు లియన్ మాల్యా, టాన్యా మాల్యాలకు విజయ్ మాల్యా బదిలీ చేసినట్లు బ్యాంకులు ఆరోపించాయి. డియాజియో నుంచి అందుకున్న డబ్బు వివరాలు ఎందుకు తెలపలేదని... ఆ మొత్తం పిల్లలకు బదిలీ చేసినట్లు ఎందుకు వెల్లడించలేదని కోర్టు మాల్యాను ప్రశ్నించింది. కోర్టు ధిక్కరణ నోటీసుకు సమాధానం ఇవ్వాలని మాల్యా తరఫు న్యాయవాది సీఎస్ వైద్యనాథన్‌ను ఆదేశించింది. -
దోషిగా తేల్చేవరకూ నిరపరాధినే: మాల్యా
న్యూఢిల్లీ: అక్రమంగా నిధుల తరలింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యా మరోసారి తాను అమాయకుడినని చెప్పుకొచ్చారు. బ్యాంకులకు రూ.9వేల కోట్లకుపైగా రుణాలు ఎగవేసి లండన్‌లో తలదాచుకుంటున్న ఆయన ట్వీటర్ వేదికగా స్పందించారు. ‘‘ఈ నిమిషం వరకు బ్యాంకులకు కేఎఫ్ఏ (కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్) బకాయి పడిన విషయంలో న్యాయపరంగా ఎటువంటి తుది నిర్ణయం రాలేదు. వ్యక్తిగత హోదాలో నేను ఎంత రుణపడి ఉన్నానన్నది విచారణ తర్వాత తెలుస్తుంది’’ అంటూ మాల్యా ట్వీట్ చేశారు. శుక్రవారం వరుసపెట్టి ట్వీట్లు చేసిన ఆయన ఇటీవలి పరిణామాలను మీడియా చిత్రీకరించిన తీరు పట్ల మండిపడ్డారు. ‘‘మన దేశంలో దోషిగా ప్రకటించే వరకు అమాయకుడిగానే పరిగణిస్తారు. కానీ, ఎటువంటి విచారణ లేకుండానే వివిధ రకాల ప్రభావాలకు లోనై మీడియా నన్ను దోషిగా ప్రకటించేసింది’’ అంటూ మాల్యా ట్వీట్ చేశారు. కోర్టు తనను దోషిగా తేల్చే వరకు అమాయకుడినేనన్నారు. ‘‘బ్యాంకులకు బకాయి పడి విదేశాలకు పారిపోయానని అంటున్నారు. కానీ వ్యక్తిగతంగా నేనెప్పుడూ రుణాలు తీసుకోలేదు’’ అని మాల్యా పేర్కొన్నారు. యునైటెడ్ స్పిరిట్స్ నుంచి నిధుల మళ్లింపు కేసులో మాల్యా, మరో ఆరుగురిని సెబీ నిషేధించడం తెలిసిందే. -
కామాంధుడికి కటకటాలు
కోరిక తీర్చలేదని నిప్పంటించాడు రెండు రోజుల తర్వాత వివాహిత మృతి కేసులో కీలకమైన హతురాలి కుమారుడి సాక్ష్యం ముద్దాయికి జీవిత ఖైదు, రూ.500 జరిమానా గుత్తి : ఓ వివాహితపై కామాంధుడు కన్నేశాడు..కామ వాంఛ తీర్చాలని రోజూ వేధిస్తుండేవాడు. ఆమె అందుకు నిరాకరించడంతో కోపోద్రిక్తుడయ్యాడు..ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించి తగులబెట్టాడు. చివరకు కటకటాలపాలయ్యాడు. కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రం యాడికిలోని ఎస్సీ కాలనీలో నివాసముండే వివాహిత ఆదిలక్ష్మి (27)పై ఇదే గ్రామానికి చెందిన రాజశేఖర్ కన్ను పడింది. ఆమెను ఎలాగైనా లోబర్చుకోవాలని చాలాసార్లు ప్రయత్నించాడు. ఈ క్రమంలో 2014 డిసెంబర్ 31న రాత్రి పది గంటల సమయంలో ఆదిలక్ష్మి తన ఇంటి ముందు నూతన సంవత్సరం ముగ్గు వేస్తుండగా రాజశేఖర్ ఆమె వద్దకు వెళ్లాడు. తన కోరిక ఈ రోజైనా తీర్చాలని ఒత్తిడి చేశాడు. ఆమె అతని బారి నుంచి తప్పించుకుని ఇంటిలోకి వెళ్లింది. తలుపులు వేసి గడియ పెట్టే సమయంలో అతను లోనికి దూసుకొచ్చాడు. బలవంతం చేయడానికి ప్రయత్నించడంతో ఆమె తిరస్కరించింది.రాజశేఖర్ కోపోద్రిక్తుడై ఆదిలక్ష్మి ఒంటిపై కిరోసిన్ చల్లి నిప్పు పెట్టాడు. దీంతో ఆమె కేకలు వేసుకుంటూ బయటకు పరుగులు తీసింది. ఏడేళ్ల కుమారుడు, చుట్టుపక్కల వారు మంటలను ఆర్పి స్థానిక ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతి చెందింది. చనిపోవడానికి ముందే ఏం జరిగిందో పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ఆదిలక్ష్మి భర్త హుసేని యాడికి పోలీసు స్టేషన్లో రాజశేఖర్‌పై ఫిర్యాదు చేశాడు. కేసు పలు విచారణల అనంతరం శుక్రవారం గుత్తి ఏడీజే కోర్టులో తుది విచారణకు వచ్చింది. నేరం రుజువు కావడంతో రాజశేఖర్‌కు జీవిత ఖైదుతో పాటు రూ.500 జరినామా విధిస్తూ ఏడీజే వెంకటరమణారెడ్డి తీర్పు చెప్పారు. హతురాలి కుమారుడి సాక్ష్యం ఈ కేసులో కీలకంగా మారింది. ప్రాసిక్యూషన్ తరఫున ఎంవీ మహేష్ కుమార్ వాదించారు. -
ప్రథమ మహిళ మేనల్లుళ్లు డ్రగ్స్ దొంగలే
న్యూయార్క్: వెనిజులా ప్రథమ మహిళ సిలియా ఫ్లోర్స్ మేనల్లుళ్లు దోషులయ్యారు. అమెరికాకు మత్తు పదార్థాల రవాణా ఆరోపణల్లో వారు నేరం చేసినట్లుగా కోర్టులు ధృవీకరించాయి. న్యూయార్క్‌లోని ఫెడరల్ జ్యూరీ ఈ కేసును విచారిస్తూ వెనెజులా ప్రథమ మహిళ మేనళ్లులు ఈఫ్రెయిన్ ఆంటానియో ఫ్లోర్స్ (29), ఫ్రాన్సిస్కో ఫ్లోర్స్ డే ఫ్రైతాస్ (30)ని దోషులుగా పేర్కొంది. వీరి శిక్షా కాలాన్ని వచ్చే ఏడాది మార్చి 7న ప్రకటించనున్నారు. వీరిద్దరు వెనిజులా నుంచి దాదాపు 800 కేజీల కొకైన్‌ను హోండురాస్ నుంచి అమెరికాకు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా అమెరికాకు చెందిన డ్రగ్ ఎన్ ఫోర్స్ మెంట్ అడ్మినిస్ట్రేటివ్ (డీఈఏ) హైతీలో అరెస్టు చేసి న్యూయార్క్‌కు తరలించింది. అక్కడే నవంబర్ 7న విచారణ ప్రారంభించింది. -
భార్య మృతదేహంతో 500 కి.మీ. ప్రయాణం
-
లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు
రూ. 2.25 లక్షల జరిమానా విజయవాడ లీగల్ : బాలికను కిడ్నాప్ చేసి ఆమెపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడిన నిందితుడిపై నేరం రుజువు కావడంతో పదేళ్ల జైలుశిక్షతో పాటు, రూ.2,25,000 జరిమానా విధిస్తూ మూడో అదనపు జిల్లా జడ్జి కం ప్రత్యేక న్యాయస్థానం జడ్జి ఎ.గిరిధర్ గురువారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన నిందితుడు బొజ్జా సురేష్ తన కుటుంబంతో నివశిస్తున్నాడు. అతడి ప్రవర్తన నచ్చకపోవడంతో భార్య ఇద్దరి పిల్లలను భర్తను వదలి వెళ్లిపోయింది. అదే ప్రాంతంలో నివశిస్తున్న దూరపు బంధువైన మైనర్ బాలికపై నిందితుని కన్ను పడింది.ఆమెకు మాయమాటలు చెప్పి నమ్మించి 2013,ఆగష్టు 18న నాగపట్నం వెళ్లి వద్దామని చెప్పాడు. మరుసటి రోజు ఇద్దరు కలసి చెన్నై వె ళ్లారు.అక్కడ నుంచి నాగపట్నం చేరారు. అక్కడే బాలికను నిందితుడు వివాహం చేసుకున్నాడు. 15 రోజుల పాటు అక్కడే ఉంచి ఆ బాలికపై పలుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నగరానికి చేరుకున్న బాలిక విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో వారు సింగ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ బెల్లపు సత్య నారాయణ 11 మంది సాక్షులను విచారించారు. విచారణలో నిందితుడిపై నేరం రుజువు కావడంతో కిడ్నాప్‌నకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా, లైంగిక దాడికి పదేళ్ల జైలుశిక్ష తోపాటు, రూ. 2 లక్షలు జరిమానా విధిస్తూ,శిక్ష ఏకకాలంలో అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. -
'అప్పు అడిగాడని స్నేహితున్ని చంపేశారు'
-
ట్విట్టర్లో 'ఉగ్రవాద' పోస్టులు.. పదిహేనేళ్ల జైలు
అలెగ్జాండ్రి: సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ కు మద్దతు తెలుపుతూ, దానిపట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ భారీ మొత్తంలో పోస్ట్ లు చేసిన ఓ అమెరికన్ యువకుడికి కోర్టు పదిహేనేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ సందర్భంగా అతడు చేసిన పని తీవ్రమైన నేరం అని స్పష్టం చేసింది. అలీ షుక్రీ అమిన్(17) అనే కుర్రాడు దాదాపు ఏడువేల ట్విట్టర్ పోస్టులు చేశాడు. ఈ పోస్ట్‌లలో నేరుగా ఉగ్రవాద సంస్థను కొనియాడటంతోపాటు దానికి ఇప్పటికే మద్దతు తెలిపేవారికి కూడా తన మద్దతు ఉంటుందని, అందిన మేరకు తాను కూడా సహాయం చేస్తానని ప్రకటించాడు. డబ్బు మార్పిడి విషయంలో కూడా సూచనలు సలహాలు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలా అమెరికాలో నేరుగా ఉగ్రవాద సంస్థకు సహాయపడి పదిహేనేళ్ల జైలు శిక్షపడిన తొలిముద్దాయి ఈ పదిహేడేళ్ల యువకుడే కావడం విశేషం. -
సూరయ్య హత్య కేసులో శీనప్పే మొదటి ముద్దాయి
అనంతపురం అర్బన్: ఉరవకొండ మండలం వై.రాంపురంలో 2009 ఆగస్టులో జరిగిన బోయ సూరయ్య హత్య కేసులో పయ్యావుల శీనప్పే(శ్రీనివాసులు) మొదటి ముద్దాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. మంగళవారం అనంతపురంలో పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు ఎం.శంకర్‌నారాయణ, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, బి.ఎర్రిస్వామిరెడ్డి విలేఖర్లతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులపై దాడులు, హత్యలు పెరిగిపోతున్నాయాన్నారు. పోలీసులను అడ్డంపెట్టుకొని అమాయకులను హింసిస్తున్నారని ఆరోపించారు. ఈశ్వరయ్య అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తే తన ఇంటిపై కాంగ్రెస్ జెండా కట్టాడని అప్పటి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, ఆయన తమ్ముడు శీనప్పలు సూరయ్యను అతి దారుణంగా హత్య చేయించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకిత్తించిందన్నారు. హత్య కేసుతో శీనప్పకు సంబంధం ఉందని సీఐడీ తేల్చిన విషయాన్ని వారు గుర్తు చేశారు. 2013లోనే శీనప్పను పోలీసులు అరెస్టు చేయడానికి సిద్ధపడితే అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కాపాడారన్నారు. ఈ కేసును నీరుగార్చడానికి కేశవ్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్నారని ఆరోపించారు. అలాగే వ్యసనాలకు బానిసైన వై.రాంపురం గ్రామానికి చెందిన బోయి వెంకటరమణ(ముని) జీడిపల్లి రిజర్వాయర్‌లో శవమై తేలాడని, కానీ బోయ సూరయ్య భార్య ఓబుళమ్మ, తల్లి శాంతమ్మే మునిని హతమార్చారని పోలీసులు కొత్త కథకు తెరలేపారని అన్నారు. ఈ నెల 15న హత్యకు గురైన సూరయ్య ఇంటికి పోలీసులు వెళ్లి ముని హత్యతో సంబంధం ఉందని బెదిరించడమే కాకుండా అసభ్యంగా ప్రవర్తించడంతో వారు ఎమ్మెల్యే విశ్వను ఆశ్రయించారని, మగదిక్కులేని వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. ఈ కుటుంబాన్ని కేశవ్ ప్రలోభాలకు గురిచేస్తున్నారని అన్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని, న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. టీడీపీ నేతల అరాచకాలను అరికట్టాలని పోలీసులను కోరారు. సూరయ్య హత్య కేసులో శీనప్పకు సంబంధం ఉందని గతంలోనే సీబీసీఐడీ తేల్చిచెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. సూరయ్య హత్య కేసులో తిరిగి విచారణ జరిపించకుండా శీనప్పను ముద్దాయిగా పరిగణించి శిక్షించాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక హత్యారాజకీయాలు పెరిగాయని, చంద్రబాబు ఓ నియంతగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ముని మృతికి సూరయ్య కుటుంబ సభ్యులు ఎలాంటి సంబంధం లేదని ఎస్పీ రాజశేఖర్‌బాబు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. పోలీసులు కూడా ఈ విషయాన్ని గమనించి సూరయ్య తల్లి, భార్యకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కో-ఆర్డినేటర్ ఎగ్గుల శ్రీనివాస్, జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు పెన్నోబులేసు, వెన్నపూస రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఓబుళవ్ము కుటుంబానికి హాని జరిగితే పయ్యూవుల సోదరులదే బాధ్యత ఉరవకొండ: వై.రాంపురం గ్రావూనికి చెందిన వైఎస్సార్సీపీ వుహిళా కన్వీనర్ ఓబుళవ్ము కుటుంబానికి ఎలాంటి హని జరిగినా అందుకు పయ్యూవుల సోదరులే(వూజీ ఎమ్మెల్యే కేశవ్, శ్రీనివాసులు) పూర్తి బాధ్యత వహించాలని ఆ పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ అన్నారు. ఎంపీటీసీ సభ్యురాలు చందా చంద్రమ్మతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడుతూ సూరయ్య హత్య కేసులో శ్రీనివాసులు నిందితుడని, ఆయన పేరు చార్జిషీటు నుంచి తొలగించడానికి కేసుతో సంబంధం లేని ఓబుళమ్మ, శాంతమ్మను ప్రలోభాలకు గురిచేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఓబుళమ్మకు అండగా ఉంటామని చెప్పారు. -
'సారీ' ఇంతకంటే బాగా ఎవరూ చెప్పరేమో!!