ఆ బాధను ఎలా అధిగమించాలి..? | Healthy Coping Skills For Uncomfortable Emotions | Sakshi
Sakshi News home page

ఆయన దూరమవ్వడానికి కారణం అదేనేమో..! ఈ వేదన, బాధను..

Published Thu, Jan 9 2025 10:51 AM | Last Updated on Thu, Jan 9 2025 11:12 AM

Healthy Coping Skills For Uncomfortable Emotions

డాక్టరు గారూ! నేనొక ప్రభుత్వ ఉద్యోగినిని. నా పిల్లలిద్దరూ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. 3 నెలల క్రితం 55 సంవత్సరాల నా భర్త సడెన్‌ హార్ట్‌ ఎటాక్‌తో మరణించారు. రాత్రి భోజనానికి తనకిష్టమైన కూర వండించుకుని తిన్నారు. ఉదయాన్నే నిద్ర లేచేసరికి పక్కనే విగత జీవిగా కనిపించారు. అప్పటినుంచి నాకు ఇంటికి రావాలంటేనే భయంగా ఉంటోంది. రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదు. అలాగే నిద్రలో ఉలిక్కిపడి లేవడం, గట్టిగా ఏడవడం చేస్తున్నాను. ఉన్నట్టుండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె దడ, విపరీతమైన భయం వేస్తున్నాయి. నాభర్త చనిపోవడానికి నా నిర్లక్ష్యమే కారణమేమోననే వేదన నన్ను కలచి వేస్తోంది. ఎంత సర్ది చెప్పుకుందామన్నా నావల్ల కావడం లేదు. ఈ బాధను అధిగమించే మార్గం చెప్పగలరా?
– శాంతిశ్రీ, విజయనగరం

మీరు అనుభవిస్తున్న ఈ వేదన, బాధ పూర్తిగా అర్థం చేసుకోగలను. మీ స్థానంలో ఉన్న వారికి ఇలాంటి లక్షణాలు ఉండటం చాలా సహజం. మీకున్న ఈ నిద్రలేమి, గుండెదడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ప్యానిక్‌ ఎటాక్‌ని సూచిస్తున్నాయి. ఈ మానసిక స్థితి ఇటువంటి ట్రామాటిక్‌ సంఘటనకు సహజమైన ప్రతిస్పందన. సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్స్‌ని ముందుగా అంచనా వేయడం లేదా పూర్తిగా నివారించడం అసాధ్యం అని మీరు గుర్తించాలి. 

అందువల్ల మీరు వారిపై చూపించిన ప్రేమ, ఆప్యాయతలను పదే పదే గుర్తు తెచ్చుకోవడం ద్వారా మీలో ఉన్న గిల్ట్‌ ఫీలింగ్‌ తగ్గుతుంది. దగ్గరిలోని సైకియాట్రిస్ట్ట్‌ని సంప్రదించి, మైండ్‌ఫుల్‌నెస్‌ థెరపీ, కాగ్నిటివ్‌ థెరపీ తీసుకోవడం వలన మీ బాధ తగ్గడమే కాక మీ ఆలోచనలు మార్చడానికి, కోపింగ్‌ స్ట్రేటజీస్‌ పెంచడానికి సహాయపడుతుంది. 

అలాగే డీప్‌ బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజెస్, ధ్యానం, ప్రోగ్రెసివ్‌ మజిల్‌ రిలాక్సేషన్‌ వంటివి తప్పక సహాయపడతాయి. నిద్ర వచ్చినా రాకపోయినా నిద్ర షెడ్యూల్‌ పాటించడం చాలా ముఖ్యం. అవసరాన్ని బట్టి కొన్ని రకాల మందులు కూడా మీరు త్వరగా కోలుకోవడానికి సహకరిస్తాయి.
డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి, సీనియర్‌ సైకియాట్రిస్ట్, విజయవాడ. 
(మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్‌ ఐడీ: sakshifamily3@gmail.com)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement