
ఇటీవల కాలంలో అంతా స్లిమ మంత్ర.. అంటూ వివిధ రకాల డైట్‌లు పాటిస్తున్నారు. కొందరూ అవి తమ శరీర తత్వానికి సరిపోతాయా..? లేదా అని లేకుండా అనాలోచితం పాటించి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల ఒక టీనేజర్ అలానే ప్రాణాలు పోగొట్టుకుంది. అయితే చాలావరకు అన్ని డైట్‌లలో చెప్పేది ఒకటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండేవి తీసుకోమనే చెబుతాయి. అది మన శరీర తత్వం ఆధారంగా ఎంత మేర తీసుకుంటే మంచిది అనేది పోషకాహార నిపుణులను సంప్రదించి పాటిస్తే సత్వరగతిన మంచి ఫలితాలు పొందుతారు. అలా కాకుండా ప్రోటీన్ మంచిదని అధికంగా తీసుకుంటూ ఉంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. అదేంటో పోషకార నిపుణుల మాటల్లో సవివరంగా చూద్దామా..!.
మన రోజువారీ భోజనంలో ప్రోటీన్‌ను చేర్చుకోవడం ఎంత కీలకమో అందరికీ తెలుసు. ఇది మన కణజాలాలను, కండరాలను నిర్మించడానికి, మరమత్తు చేయడానికి సహాయపడుతుంది. శరీరంలో మొత్తం శక్తిని ఇస్తుంది. అందుకోసం అని చాలామంది ప్రోటీన్ పౌడర్లు, షేక్‌లు, సప్లిమెంట్లపై ఆధారపడతారు. కానీ వాటికంటే గుడ్లు, మాంసం, పెరుగు, జున్ను వంటి ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తమ డైట్‌లో చేర్చుకుంటే మంచిదని చెబుతున్నారు నిపుణులు.
ఇలా ప్రోటీన్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పేనని హెచ్చరిస్తున్నారు. అంతేగాదు వృద్ధాప్యం ేవేగవంతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని అన్నారు.ఈ మేరకు ప్రముఖ పోషకాహార నిపుణురాలు లోవ్నీత్ బాత్రా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా దీని గురించి షేర్ చేశారు.
ప్రోటీన్ ఎక్కువగా తినడం వల్ల వృద్ధాప్యం త్వరగా వస్తుందా? ఇటీవల పోషకాహార నిపుణుడు లోవ్నీత్ బాత్రా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రోటీన్ తీసుకోవడం వల్ల వృద్ధాప్యం త్వరగా వస్తుందని పంచుకున్నారు. ప్రోటీన్ పౌడర్లు,జంతు ఆధారిత ప్రోటీన్లపై ఎక్కువగా ఆధారపడితే గ్లైకేషన్ ప్రేరేపించబడుతుందట. ఇది కణజాలాలను గట్టిపరిచే ప్రక్రియ అట.
దీంతో ముడతలు, కీళ్ల ధృడత్వం, ఆక్సీకరణ ఒత్తిడికి దారితీస్తుందని చెప్పారు. అంతేగాదు ఇది శరీరంలో ప్రోటీన్ అసమతుల్యతను ఏర్పరిచి జీవక్రియను దెబ్బతీస్తుందని అన్నారు. ఫలితంగా ఇన్సులిన నిరోధకత, వాపు వంటి సమస్యలు వస్తాయని అన్నారు. అలాగే ఈ ప్రోటీన్ షేక్‌లలో ఉండే కృత్రిమ స్వీటెనర్ల ప్రిజర్వేటివ్‌లతో శరీరం లోడ్ అవుతుందనేది గ్రహించండి అని చెబుతున్నారు.
కాబట్టి అధిక ప్రోటీన్ వినియోగం అనేది ఆరోగ్యానికి అన్ని విధాల హానికరమే అని వార్నింగ్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ శరీరానికి అనుగుణంగా ప్రోటీన్ తీసుకోండి. అలాగే జంతు ఆధారిత ప్రోటీన్ కంటే ఆల్కలీన్ స్వభావం కలిగిన మొక్కల ఆధారిత ప్రోటీన్‌లను తీసుకువాలని అన్నారు. ముఖ్యంగా కాయధాన్యాలు, క్వినోవా, టోఫు, గింజలు, నట్స్, వంటివి ఉత్తమం అని చెప్పారు. అదనంగా యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలతో భర్తీ చేసుకోమని సూచించారు.
అంటే విటమిన్లు సీ, ఈఅధికంగా ఉండే తాజా పండ్లు, కూరగాయలతో సమతుల్యం చేసుకోవాలని చెప్పుకొచ్చారు. ప్రోటీన్ పౌడర్ల కంటే సంపూర్ణ ఆహార పదార్థాలను తీసుకోవడమే మంచిదని నొక్కి చెప్పారు. అలాగే మన శరీరం ప్రోటీన్ లోపంతో బాధపడుతుందనేందుకు సంకేతంగా జుట్టు, చర్మం, గోర్లు కండరాల బలహీనత, అలసట, కొవ్వు కాలేయం కారణంగా పెరిగిన ఆకలి కోరికలు, గాయాలు త్వరగా నయం కాకపోవడం తదితర సమస్యలు చుట్టుముడతాయని వివరించారు లోవ్నీత్ బాత్రా.
(చదవండి: ఆసియా బెస్ట్ రెస్టారెంట్స్ జాబితాలో భారత్ రెస్టారెంట్‌లు ఎన్నంటే..!)
Comments
Please login to add a commentAdd a comment