
కియారా అద్వానీ
ఏదో నేరం చేసినట్టు గిల్టీగా ఫీల్ అవుతున్నారు కియారా అద్వానీ. అంత తప్పేం చేసిందీ అనుకోవద్దు. కియారా ఏ తప్పూ చేయలేదు. మరి గిల్ట్ ఎందుకు అంటే ‘గిల్టీ’ పేరుతో నెట్‌ఫ్లిక్స్ కోసం ఆమె ఓ సినిమా చేయబోతున్నారు. ఆల్రెడీ ‘లస్ట్ స్టోరీస్’తో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో బోలెడంత క్రేజ్ తెచ్చుకున్నారు కియారా. అందులో చాలా బోల్డ్‌గా నటించారు. మరి.. ‘గిల్టీ’లో ఎలాంటి పాత్రలో కనిపిస్తారో చూడాలి. రుచి నరైన్ దర్శకత్వం వహిస్తారు. కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన కియారా లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. ఇది సరే కానీ కియారా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై మొగ్గు చూపుతున్నారు.. చేతిలో సినిమాలు లేవా? అంటే... అదేం కాదు. ప్రస్తుతం లక్ష్మీబాంబ్, షేర్షా అనే హిందీ చిత్రాల్లో నటిస్తున్నారు కియారా. ఇటు సౌత్‌లోనూ సినిమాలు చేయడానికి సంప్రదింపులు జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment