
భార్యాభర్తల మధ్య మంచి అవగాహన కుదిరితే జీవితం ఆనందంగా ఉంటుంది. చిన్ని చిన్ని అలకలు, తీపికబుర్లు, బాధ్యతలతో సంసారం సాఫీగా సాగిపోతుంది. అవగాహన కుదరకపోతే అంతే సంగతలు. హీరో వరుణ్ ధావన్ అలానే అంటున్నారు. ‘హ్యాపీ వైఫ్.. హ్యాపీ లైఫ్’ అంటూ కియారా అద్వానీతో కలసి తాను నటిస్తున్న ‘జగ్ జగ్ జాయే’ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు వరుణ్. ఫొటోలో వరుణ్, కియారా కెమిస్ట్రీ చూస్తుంటే సినిమాలో హ్యాపీ కపుల్‌గా కనబడతారని అర్థం అవుతోంది. ‘గుడ్ న్యూస్’ ఫేమ్ రాజ్ మెహతా దర్శకత్వంలో ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఇందులో ఓ కీలక పాత్రను అనిల్ కపూర్ చేయనున్నారు. 2021లో ఈ సినిమా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment