
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యమే మహాభాగ్యం... ఈ నినాదాన్ని భారతీయులు తరతరాలుగా ఒక సందేశంగా తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ భారతీయులకు దీని అవసరం ఏర్పడింది. దీనికి తగ్గట్టుగానే 2022–23 ఆర్థిక సంవత్సరంలో తమ కుటుంబ ఆదాయాల్లో పది శాతానికిపైగా ఆరోగ్య పరిరక్షణకు భారతీయులు వ్యయం చేస్తున్నట్టుగా ఇటీవల నివేదికలో వెల్లడైంది. దీనికి సంబంధించి అత్యధికంగా ఖర్చు చేస్తున్న టాప్–5 రాష్ట్రాల్లో కేరళ, మహారాష్ట్ర, యూపీ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ నిలుస్తున్నాయి.
ఇది 2017–18 స్థాయిలను బట్టి చూస్తే గణనీయంగా వైద్య, ఆరోగ్యంపై ఖర్చు పెరగడానికి ప్రధానంగా కోవిడ్ మహమ్మారి కారణంగా తలెత్తిన విపత్కర, అనిశి్చత పరిస్థితులే కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్) పురోగతిపై తాజాగా ‘మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్’విడుదల చేసిన డేటాలో ఆయా అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.
దేశవ్యాప్తంగా మొత్తంగా చూస్తే.. 2022–23లో 6.67 శాతం ప్రజలు తమ ఆదాయాల్లో పదిశాతానికిపైగా (2017–18లో ఇది 4.48 శాతం) వ్యయం చేశారు. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా... మొత్తం కుటుంబ ఆదాయాల్లో 25 శాతానికి పైగా ఖర్చు చేస్తున్న వారు 2.3 శాతం మంది ఉన్నట్టుగా ఈ డేటా స్పష్టం చేస్తోంది. గ్రామీణ ప్రాంతాలతో పోలి్చతే పట్టణ ప్రాంతాల్లోని వారే తమ ఆదాయంలో పదిశాతానికి పైగా వ్యయం చేస్తున్నట్టుగా వెల్లడైంది.
ఐతే కొన్ని సందర్భాల్లో...పరిస్థితులు చేయి దాటడం లేదా విపత్కర పరిస్థితులు ఎదురుకావడం వంటివి చోటుచేసుకున్నపుడు మాత్రం గ్రామాల్లోని ప్రజలు తమ కుటుంబ ఆదాయాల్లో 25 శాతానికి పైగా ఖర్చు చేయాల్సి వస్తోన్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే...
భారతీయుల వైద్య, ఆరోగ్యానికి సంబంధించి తలసరి వ్యయం 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి (కరోనా తరువాత) అత్యధికంగా పెరిగినట్టుగా కేంద్ర మంత్రిత్వశాఖ నేషనల్ హెల్త్ అకౌంట్స్ (ఎన్‌హెచ్‌ఏ) అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.
ఆరోగ్యం, కుటుంబాల ‘ఔట్ ఆఫ్ ప్యాకెట్’వైద్య, ఆరోగ్య వ్యయంపై ప్రభుత్వం ఖర్చు పెంచాక ఈ వృద్ధి నమోదైనట్టుగా ఈ అంచనాల్లోపేర్కొన్నారు. 2014–15 లలో ప్రభుత్వం చేస్తున్న తలసరిఖర్చు రూ. 1,100 కాగా, 2019–20 కల్లా అది రూ. 2,014కు పెరిగినట్టు ఇందులో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment