హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీలో ఉన్న ఫ్రెంచ్ సంస్థ సనోఫీ భారత్‌లో సుమారు రూ.3,655 కోట్లు వెచ్చించనున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్‌లోని గ్లోబల్ కెపాసిటీ సెంటర్ (జీసీసీ) కోసం 2030 నాటికి ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్టు సనోఫీ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మ్యాడలిన్ రోచ్ వెల్లడించారు.
ఇందులో రూ.914 కోట్లు వచ్చే ఏడాదికల్లా వ్యయం చేస్తామని చెప్పారు. తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబుతో కలిసి సనోఫీ జీసీసీ నూతన భవనాన్ని బుధవారం ప్రారంభించిన సందర్భంగా రోచ్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ కేంద్రంలో ప్రస్తుతం 1,000 మంది సిబ్బంది ఉన్నారని చెప్పారు. కొత్త ఫెసిలిటీకి 2,600 మంది ఉద్యోగులు కూర్చునే సామర్థ్యం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment