
సాక్షి, అమరావతి: భారతదేశం ప్రపంచానికి హెల్త్ కేర్ సెంటర్‌గా మారిందని రాజ్యసభ సభ్యుడు వినయ్ టెండూల్కర్, డాక్టర్ సందేశ్ యాదవ్ తెలిపారు. జీ–20 సదస్సులో భాగంగా సోమ, మంగళవారాల్లో స్విట్జర్లాండ్, ఇటలీలలో హెల్త్‌కేర్‌పై జరిగిన సన్నాహక సదస్సుల్లో పల్సస్ గ్రూప్ పాలుపంచుకుంది.
ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని పల్సస్ సంస్థ కార్యాలయాన్ని వినయ్ టెండూల్కర్, డాక్టర్ సందేశ్ యాదవ్ సందర్శించారు. అందరికీ ఆరోగ్యమే లక్ష్యంగా పల్సస్ గ్రూప్ కృషి చేస్తున్నట్టు వారు పేర్కొన్నారు. ఏపీలో సీఎం వైఎస్ జగన్ ఆరోగ్య రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. సమావేశాల కో–కన్వెనర్ డాక్టర్ శ్రీనుబాబు గేదెల పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment