మనలో చాలా మందికి 60లో 20లా కనిపించాలని పరితపిస్తుంటారు. కానీ వయోబేధం లేకుండా రకరకాల కారణాల వల్ల లేదంటే వయసు రిత్యా చర్మంపై ముడతలు వస్తుంటాయి. అయితే అలాంటి ముడతల్ని తగ్గించుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు. వాటిని ఫాలో అయితే తప్పని సరిగా శరీరంపై ఉన్న ముడతలు పోవడమే కాదు మొఖం కాంతివంతంగా తయారవుతుందని అంటున్నారు. అయితే ఇప్పుడు మనం ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం..!
ప్రస్తుతం మార్కెట్లో విరివిగా దొరుకుతున్న నేరేడు పండులో విటమిన్ సి, ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. నేరేడు పండ్లను తినడంవల్ల చర్మంపై ముడతలు, మొటిమలు ఏర్పడవు. రక్త శుద్ధి జరిగి మేనిఛాయ నిగారింపును సంతరించుకుంటుంది. ∙డయాబెటిస్ ఉన్నవారు తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయులు తగ్గి ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది.∙డైలీ ఆహారంలో నేరేడు పండ్లను చేర్చడం ద్వారా రక్త పీడనం సమతులంగా ఉండడమేగాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.∙పీచు పదార్థం అధికంగా ఉండడంతో జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచి పేగుల్లో అల్సర్లు ఏర్పడకుండా కాపాడుతుంది.
∙కేలరీలు తక్కువ, అధికమొత్తం లో పీచు పదార్థం ఉండడం వల్ల జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. దీనివల్ల కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావన కలిగి తక్కువ తింటాము. ఫలితంగా బరువు అదుపు లో ఉంటుంది. యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు అధికంగా ఉండడంతో దంతారోగ్యం కూడా మెరుగుపడుతుంది. నేరేడు చెట్టు ఆకులను ఎండబెట్టి పొడి చేసి పళ్లు తోముకుంటే దంత సమస్యలు తొలగి పోతాయి. పుష్కలంగా ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, యాంటీ బ్యాక్టిరియల్, యాంటీ ఇన్‌ఫెక్టివ్, యాంటీ మలేరియల్ సుగుణాలు ఉండడంతో నేరేడు శరీరానికి మంచి ఇమ్యూనిటి బూస్టర్‌గా పనిచేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment