
ముంబై: హెల్త్‌కేర్ రంగ ఆదాయంలో వచ్చే మూడు ఆర్థిక సంవత్సరాల కాలంలో 15 శాతంమేర వార్షిక వృద్ధి నమోదు కావొచ్చని అంచనాలు వెలువడ్డాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాల వల్ల హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ విస్తరణ పెరగడం దీనికి ప్రధాన కారణంగా నిలువనున్నట్లు క్రిసిల్ రేటింగ్స్ సంస్థ వెల్లడించింది.
రూ.4.8 లక్షల కోట్ల విలువగల హెల్త్‌కేర్ రంగంలో బలమైన డిమాండ్ వృద్ధి ఉందని, అలాగే స్థిరమైన నగదు ప్రవాహం కనిపిస్తోందని పేర్కొంది. రెగ్యులేటరీ నియంత్రణల వల్ల హాస్పిటల్స్ లాభదాయకతపై కొంతమేర ఒత్తిడి నెలకొనవచ్చని క్రిసిల్ తన నివేదికలో అభిప్రాయపడింది. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వారి సంఖ్య గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో రెట్టింపయి 42 కోట్లకు చేరిందని పేర్కొంది. దీనికి జీవన విధానాల్లో మార్పు, వృద్ధులు, హెల్త్ ఇన్సూరెన్స్‌పై అవగాహన పెరగడం వంటి అంశాలు కారణమని తెలిపింది.