సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో బొంతు రామ్మోహన్
సాక్షి, హైదరాబాద్: సీజనల్ వ్యాధుల నివారణ, నియంత్రణలకు ఏ నెలలో, ఏమేం చేయాలో వార్షిక క్యాలెండర్‌ను రూపొందించనున్నామని మునిసిపల్, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు చెప్పారు. మంగళవారం నుంచే వివిధ స్థాయిల్లోని అధికారులతోపాటు ప్రజాప్రతినిధు లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని, పారిశుధ్య కార్యక్రమాలు పరిశీలిస్తారని, ప్రజలకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. వ్యాధులు, పారిశుధ్యం, రహదారులు తదితర అంశాలపై మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి మునిసిపల్ పరిపాలన, వైద్యారోగ్యశాఖల ఉన్నతాధికారులతో సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. వివరాలను విలేకరుల సమావేశంలో కేటీఆర్ వెల్లడించారు. సీజన్ మార్పుతో వైరల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని, జ్వరాలన్నీ డెంగీకాదని అన్నారు. ఈ విషయంలో ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రతిపక్షాలతోపాటు మీడియా కూడా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దని కోరారు.
పోస్టర్లు, కరపత్రాలతో ప్రచారం
వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోస్టర్లు, కరపత్రాలు, హోర్డింగులతో సçహా వివిధ మాధ్యమాల ద్వారా విస్తృతం గా ప్రచారం నిర్వహించనున్నట్లు కేటీఆర్ తెలిపా రు. పారిశుధ్య కార్యక్రమాలు మెరుగుపడేందుకు యుద్ధప్రాతిపదికన రేçపు ఉదయం 5.30 నుంచే హైదరాబాద్‌లో మేయర్, డిప్యూటీ మేయర్, మునిసిపాలిటీల్లో కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. వెయ్యికిపైగా ఉన్న గార్బేజి పాయింట్లలోని చెత్తను 16వ తేదీలోగా తొలగిం చాలని నిర్ణయించామన్నారు. పాఠశాలలు/కళాశాలలు, స్లమ్స్/బస్తీలు, అపార్ట్‌మెంట్లు/కాలనీల్లో అవగాహన సమావేశాలు నిర్వహిస్తారన్నా రు. ఈ కార్యక్రమాల్లో తాను, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కూడా పాలుపంచుకుంటామని తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని ఒక ఇంటిని కూడా సందర్శించి ప్రజలకు వివరించాలన్నారు.
బస్తీ దవాఖానాల్లో సాయంత్రం కూడా ఓపీ
నగరంలో యూహెచ్‌పీలు సహా 106 బస్తీ దవా ఖానాల్లో సాయంత్రం కూడా ఓపీ సేవలు అందు బాటులో ఉంటాయని కేటీఆర్ చెప్పారు. వచ్చిన రోగుల్ని గంటలోగా తిరిగి పంపించే ప్రయత్నం జరుగుతోందన్నారు. సీఎం అనుమతితో బస్తీదవాఖానాలను 300కు పెంచేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. నగరంలో ప్రత్యేకంగా 25 మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని చెప్పారు. దాదాపు 53 వేల గణేశ్ మండపాల వద్ద వ్యాధులు ప్రబలకుండా అవసరమైన సిబ్బందిని కూడా నియమిస్తామన్నారు.
వ్యర్థాలు వేస్తే కఠిన చర్యలు..
నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ వేసేవారిపై, వాటిని ఇష్టానుసారం తరలించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటా మని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు మునిసిపల్ పరిపాలన ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేయడంతోపాటు రవాణాశాఖతో కూడా మాట్లాడి త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. నగరంలో రహదారుల పరిస్థితి మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. సమావేశంలో పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్, డైరెక్టర్ టీకే శ్రీదేవి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, వాటర్‌బోర్డు ఎండీ దానకిశోర్, మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నిబంధనలు పాటించకుంటే శిక్షలే..
ట్రాఫిక్ ఉల్లంఘనలపై భారీ జరిమానాలకు సంబంధించిన ప్రశ్నకు బదులిస్తూ పౌరస్పృహ లేనివారికి జరిమానాలు, శిక్షలు ఉండాల్సిందేనని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. నగరంలో పారిశు ధ్యం మెరుగుకు చర్యలు తీసుకుంటామన్నారు. డెంగీపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. వందలాది మరణాలంటూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయన్నారు. విమర్శలు సహేతుకమైతే స్వీకరిస్తామన్నారు.
తమిళిసై నియామకంపై మాట్లాడేదేముంటుంది: కేటీఆర్
రాష్ట్ర గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్‌ను నియమించడంపై కేంద్రం నిర్ణయం తీసుకుందని, రాష్ట్రపతి నియమించారని, ఈ అంశంపై మాట్లాడేందుకేముంటుందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. సోమవారం జీహెచ్‌ఎంసీలో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఇటీవల రాజకీయసంబంధాలు కలిగినవారిని గవర్నర్లుగా నియమిస్తున్నారు. దీనిపై మీ స్పం దన ఏమిటన్న’ విలేకరుల ప్రశ్నకు బదులిస్తూ.. ఈ అంశంపై నేనేం కామెంట్ చేయగలనంటూ పైవిధంగా వ్యాఖ్యానించారు. ఆమె గవర్నర్‌గా వచ్చాక మంత్రిగా తాను ప్రమాణం చేశానని, ఆమెను గవర్నర్‌గానే చూస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment