ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి మండలం షట్‌పల్లి గ్రామంలో ప్రత్యేక వైద్య, ఆరోగ్య శిబిరాన్ని జిల్లా వైద్యులు నిర్వహించారు.
కోటపల్లి (ఆదిలాబాద్ జిల్లా) : ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి మండలం షట్‌పల్లి గ్రామంలో ప్రత్యేక వైద్య, ఆరోగ్య శిబిరాన్ని జిల్లా వైద్యులు నిర్వహించారు. శుక్రవారం గ్రామంలో జరిగిన వైద్య శిబిరంలో గ్రామస్తులకు ఉచితంగా వైద్య సేవలు అందించారు.
సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకొని వైద్య అధికారులు ముందస్తుగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.