కరోనా కాలంలో పిల్లలకు సీజనల్‌ జ్వరాలు.. జాగ్రత్తలు | Seasonal Allergies vs COVID-19 Symptoms In Kids | Sakshi
Sakshi News home page

కరోనా కాలంలో పిల్లలకు సీజనల్‌ జ్వరాలు.. జాగ్రత్తలు

Published Sat, Jun 26 2021 10:48 PM | Last Updated on Sat, Jun 26 2021 10:48 PM

Seasonal Allergies vs COVID-19 Symptoms In Kids - Sakshi

ప్రపంచమంతా ఇప్పుడు కరోనా మహమ్మారితో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఏ చిన్న జ్వరం వచ్చినా అది కరోనాయే అనేంత ఆందోళన. ప్రతి జ్వరమూ కరోనా కాకపోవచ్చు. అయితే పిల్లల్లో వచ్చిన జ్వరం కరోనా వల్లనా కాదా అన్నది పరీక్షలు లేకుండా చెప్పలేంగానీ... సాధారణంగా ఈ సమయంలో జ్వరాలూ, జబ్బులు ముసిరే సీజన్‌. జూన్‌ నెల ఆఖరికి వస్తూ జులైలో ప్రవేశిస్తున్న ఈ సమయంలో అనేక సీజనల్‌ వ్యాధులు వచ్చే టైమిది. అందుకే ప్రతి జ్వరాన్నీ కోవిడ్‌–19గా అనుమానించనక్కర్లేదనీ, అలా అనుమానించి ఆందోళన చెందక్కర్లేదని తెలుసుకోవాల్సిన సీజన్‌ ఇది. ఇలాంటి సీజన్‌లో పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ సీజనల్‌ జ్వరాలకు ఎలాంటి నివారణ చర్యలు అవసరం అనే అంశాలపై అవగాహన కోసం ఈ కథనం...

చినుకు పడీ పడగానే దోమలు వచ్చేస్తాయి. వాన నీరు వచ్చీ రాగానే పుట్టే దోమల వల్ల మలేరియా, డెంగీ వంటి జ్వరాలు వచ్చే సంగతి మనకు తెలుసు. అలాగే చిత్తడితో కలుషితమైన నీళ్ల కారణంగా డయేరియా, నీళ్ల విరేచనాలు మొదలుకొని టైఫాయిడ్‌ వరకూ జబ్బులు చుట్టుముడతాయి. ఇదే సమయంలో సీజనల్‌గా వచ్చే ఫ్లూ ఎప్పుడూ కాచుకుని ఉంటుంది. అయితే ఈ జబ్బులన్నింటిలో ఉండే లక్షణాలన్నీ కరోనాలోనూ కనిపిస్తాయి. అలాంటప్పుడు చిన్నారికి వచ్చింది కరోనాయేనా, కాదా అనే సందేహాలు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తాయి. 

మూడు రోజులూ వేచి చూడండి... 
పిల్లలకు ఈ సీజన్‌లో వచ్చే జబ్బు మలేరియా, డెంగీ, డయేరియా, టైఫాయిడ్, ఫ్లూ ఏదైనా సరే... మొదట కనిపించే లక్షణం జ్వరమే. దాంతోపాటు పిల్లల్లో తీవ్రమైన నీరసం, నిస్సత్తువ, ఒళ్లునొప్పులు, కడుపు నొప్పితో పాటు వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇక ఫ్లూ అయితే దాదాపుగా కరోనానే పూర్తిగా పోలి ఉంటుంది. పైగా అది కరోనా మాదిరిగానే నీటితుంపర్లతోనే వ్యాప్తి చెందుతుంది. అందువల్ల వచ్చే జ్వరం ఏదైనా లేదా కరోనా వల్లనే అయినా తొలిరోజుల్లో జ్వరాన్ని నియంత్రించడానికి వాడాల్సింది తగిన మోతాదులో పారసిటమాల్‌ వంటి మాత్రమేనన్న విషయం మనకు తెలిసిందే. అందుకే జ్వరం రాగానే ఆందోళన లేకుండా పారాసిటమాల్‌ మొదలుపెట్టాలి. అది సాధారణ ఫ్లూ అయితే మూడు రోజుల్లో దానంతట అదే తగ్గిపోతుంది. ఇక నీటికాలుష్యం కారణంగా కలిగే డయేరియా, నీళ్లవిరేచనాల విషయంలోనూ జ్వరం ఉంటే పారసిటమాల్‌తో పాటు వాంతులు, నీళ్లవిరేచనాల వల్ల కోల్పోయిన నీటిని భర్తీ చేసేందుకు ఓఆర్‌ఎస్, ఆరోగ్యకరమైన ద్రవాహారాలు ఇస్తూ వీటి విషయంలోనూ మూడు రోజులు ఆగవచ్చు. ఇలాంటివన్నీ తమంతట తామే అదుపులోకి వచ్చే (సెల్ఫ్‌ లిమిటింగ్‌) జ్వరాలు అయినందున మూడు రోజుల్లో వాటి స్వభావం తెలిసి రావడం లేదా జ్వరం పూర్తిగా తగ్గిపోవడంతో తల్లిదండ్రుల ఆందోళన దూరమవుతుంది. 

అలా కాకుండా అది మలేరియా, డెంగీ లేదా టైఫాయిడ్‌ లాంటి జ్వరాలైతే వాటి లక్షణాలూ కాస్తంత పరిశీలనతో మనకు తెలిసిపోతుంటాయి. ఉదాహరణకు మలేరియా అయితే నిర్ణీత వ్యవధి లో చలిజ్వరం మాటిమాటికీ తిరగబెడుతూ ఉండటం, డెంగీ లాంటివి అయితే తీవ్రమైన కడుపునొప్పి, మలంలో రక్తం, ఒంటిపైన ర్యాష్‌ వంటివి కనిపించడం (కొన్ని అరుదైన కేసుల్లో కరోనాలోనూ ఒంటిపైన ర్యాష్‌  రావచ్చు) జరుగుతాయి. దాంతో అవి వాటంతట అవే తగ్గక హాస్పిటల్‌కు తీసుకోరావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది కరోనా కాదని తేలడం ఇక్కడ ఒక చిన్న ఊరటే అయినా హాస్పిటల్‌ కోసం పిల్లలను బయటకు తీసుకెళ్లాల్సి రావడంతో మళ్లీ కరోనా ముప్పు పొంచి ఉంటుంది. అందువల్ల జ్వరం ఏదైనప్పటికీ తొలి మూడు రోజులూ ఒకింత టెన్షన్‌గా ఉన్నప్పటికీ సందర్భాన్ని, లక్షణాలను బట్టి పారాసిటమాల్, ఓఆర్‌ఎస్, ద్రవాహారాలు వంటి సాధారణ మెడికేషన్‌ సరిపోతుంది. 

మూడు రోజులు దాటాక... 
తొలి మూడు రోజులూ దాటాక కూడా పిల్లల శ్వాసప్రక్రియ  చాలా వేగంగా జరుగుతూ ఉండటం, చిన్నారులు ఆయాసపడటం, మూత్రం పరిమాణం తగ్గడం, అన్నం తినడానికి నిరాకరించడం, చంటిపిల్లలైతే పాలు సరిగా తాగకపోవడం, పొట్టలో విపరీతమైన నొప్పి, వాంతులు, విరేచనాలు ఆగకుండా అదేపనిగా కొనసాగుతూ ఉంటే వెంటనే తప్పనిసరిగా పిల్లల డాక్టర్‌ను కలవాలి. 

పిల్లలపై మానసిక ఒత్తిడి పడకుండా నివారించడం ఎలా... 
తాము మునపటిలా బయటకు వెళ్లి ఆడుకోలేకపోవడం, స్కూలు లేకపోవడంతో తమ ఈడు పిల్లలతో కలయిక (సోషలైజింగ్‌) తగ్గడం,  ప్రస్తుత కరోనా సీజన్‌లో... పరిసరాల్లోనూ లేదా తెలిసినవాళ్లలోనూ ఎవరో ఒకరు కరోనా బారిన పడుతుండటం, మరోవైపున సీజనల్‌ జ్వరాలు ముప్పిరిగొనడంతో వాళ్ల లేత మనసులు ఆందోళనకు గురవుతాయి. ఈ అంశం వారి పసి మనసులపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలున్నాయి. అలా జరగకుండా ఉండేందుకు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలివి... 

చిన్న చిన్న పిల్లల్లో (ఎనిమిదేళ్ల లోపు)... 
పిల్లలు అటెన్షన్‌ను ఎక్కువగా కోరుకుంటారు. తల్లిదండ్రులు వాళ్లకు నాణ్యమైన సమయం (క్వాలిటీ టైమ్‌) కేటాయించి, ఎలాంటి పరిస్థితి ఎదురైనా తాము ఉన్నామనీ, ఎప్పుడూ అండగా ఉంటామనే ధైర్యం చెబుతూ, వాళ్లలో ఆత్మస్థైర్యం నింపాలి.  ఇప్పుడున్న  స్థితిలో వాళ్లను  అయోమయంలో ఉంచకుండా... కోవిడ్‌ అంటే ఏమిటి; ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలా తీసుకుంటే ఏమీ కాదనేలా వాళ్లకు అవగాహన కల్పించాలి. ఇలాంటి చర్యలన్నీ వాళ్లలో ఆత్మవిశ్వాసం నింపుతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం కరోనా మహమ్మారి గురించీ, ఇతరత్రా జబ్బుల గురించి ఆలోచించేలా కాకుండా వాళ్లను ఏదో వ్యాపకంలో నిమగ్నం చేయడంతో ఉంచడంతోపాటు, వాళ్లకు వ్యాధినిరోధక శక్తిని (ఇమ్యూనిటీని) పెంచుతాయి. కరోనాతో పాటు ఈ సీజనల్‌ జబ్బులను ఎదుర్కోడానికీ ఈ వ్యాధి నిరోధక శక్తి వాళ్లకు బాగా ఉపకరిస్తుంది.

ఇతర జబ్బులతో బాధపడే పిల్లల కోసం... 
పిల్లందరూ పూర్తిగా ఆరోగ్యవంతులుగా ఉండరు. కొంతమంది పిల్లలు పుట్టుకతోగానీ లేదా ఆ తర్వాతగానీ కొన్ని ఇతర రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండేవారు ఉంటారు. ఉదాహరణకు ఆటిజమ్‌ స్పెక్ట్రమ్‌ డిజార్డర్, అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌ ఏక్టివిటీ డిజార్డర్, సెరిబ్రల్‌ పాల్సీ, పెరుగుదల లోపాలు (డెవలప్‌మెంట్‌ డిలే) లాంటి సమస్యలతో బాధపడే పిల్లలు ప్రస్తుత లాక్‌డౌన్‌ / ఆంక్షల సమయంలో ఇతరత్రా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. దానికి తోడు ఈ సమయంలో వాళ్లకు ఒకవేళ సీజనల్‌ జబ్బులు వస్తే పరిస్థితి మరికొంత సమస్యాత్మకంగా మారవచ్చు. ఇలాంటి పిల్లల విషయంలో తల్లిదండ్రులు వాళ్ల వాళ్ల సంబంధిత డాక్టర్ల ఫోన్‌ నంబర్లను సంసిద్ధంగా ఉంచుకోవడం, అవసరమైతే వాళ్లతో తక్షణం సంప్రదించేలాంటి ఏర్పాటు చేసుకోవాలి. అలాగే గుండెసమస్యలు, క్యాన్సర్‌ల వంటి తీవ్రమైన జబ్బులు ఉన్న పిల్లల విషయంలో చికిత్సను అందించే డాక్టర్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఉండాలి. 

సీజనల్‌ జబ్బుల నివారణ కోసం... 
టఈ సీజన్‌లోని దాదాపు అన్ని వ్యాధులతో జ్వరాలు, ఇతర లక్షణాలకు ఓ ప్రధాన కారణం కలుషితమైన నీరే. కాబట్టి వీలైనంతవరకు ఈ సీజన్‌ అంతా నీటిని కాచి చల్లార్చి తాగాలి. టపల్లెవాసులు కుండల్లో, బిందెల్లో ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉన్న నీటిని తాగకూడదు. వీలైతే రోజూ నీటిని మార్చడం... కుదరకపోతే నల్లా (కుళాయి)లో మంచినీళ్లను రోజు విడిచి రోజైనా పట్టుకుని వాడటం మంచిది. టనీటిని క్లోరినేషన్‌ ద్వారా శుభ్రం చేసి తాగడం మేలు. టబయటి ఆహార పదార్థాలు ఈ సీజన్‌లో వద్దు. టఇంట్లోనే వండిన పదర్థాలను అవి వేడిగా ఉండగానే తినడం మంచిది. వండటానికి వీలైనంతవరకు తాజా పదార్థాలనే వాడాలి. నిల్వ ఉన్నవి అంత మంచిది కాదు. చల్లారిన ఆహారాన్ని వూటి వూటికీ వేడి చేసి తినడం సరికాదు.  టవూంసాహారం కంటే శాకాహారానికి ప్రాధాన్యం ఇవ్వండి. మాంసాహారం తినాల్సి వస్తే అప్పటికప్పుడు తాజాగా తెచ్చుకోవాలి. ఫ్రిజ్‌æలో చాలారోజుల పాటు నిల్వ ఉన్నది అంత మంచిదికాదు. టపరిసరాల పరిశుభ్రత పాటించాలి. పరిసరాలన్నీ చాలా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.

పాత టైర్లు, ఖాళీ కొబ్బరి చిప్పల వంటివి దోవుల పెరుగుదలకు ఉపకరిస్తాయి కాబట్టి వాటిని మన ఇంటి ఆవరణల్లో, పరిసరాల్లో ఉంచకుండా (పోగు కాకుండా) జాగ్రత్త పడాలి. టమురుగు నీటి కాల్వల నీళ్లు... మంచినీటి పైప్‌లతో కలవకుండా జాగ్రత్త పడాలి. (ఇది సామాజికంగా ప్రభుత్వాలు తీసుకోవాల్సిన జాగ్రత్త). టఈ సీజన్‌లో దోవులతో వచ్చే వ్యాధుల నుంచి కాపాడుకోడానికి శరీరవుంతా కప్పే దుస్తులు వేసుకోవాలి. టవ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. వుల, వుూత్ర విసర్జనకు వుుందు, తర్వాత చేతులు శుభ్రంగా సబ్బుతో లేదా బూడిదతో కడుక్కోవాలి. టసింక్‌లో ఉన్న పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. కొందరు తమ వంట పాత్రలనూ, ఇంట్లోని కంచాలు, ఇతర సామగ్రిని వుట్టితో శుభ్రం చేస్తారు. అలా ఎప్పుడూ చేయవద్దు. పాత్రలు శుభ్రం చేసే సవుయంలో సబ్బు వాడాలి. పల్లెటూళ్లలో అలా సబ్బు అందుబాటులో లేకపోతే బూడిదతో శుభ్రం చేయాలి. 


డాక్టర్‌ ఎమ్‌. అరవింద్‌ కుమార్‌
కన్సల్టెంట్‌ పీడియాట్రీషియన్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement