మాట్లాడుతున్న క్లస్టర్ అధికారిణి సౌభాగ్యలక్ష్మి
మరికల్ (ధన్వాడ) : వర్షాకాలంలో వ్యాపించే సీజనల్ వ్యాధులపై గ్రామస్తులకు అవగాహన కల్పించాలని నారాయణపేట క్లస్టర్ అధికారిణి సౌభాగ్యలక్ష్మి అన్నారు. మంగళవారం మరికల్ పీహెచ్‌సీలో ఆశ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్షకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యాధుల పట్ల ఆశ కార్యకర్తలు ఎప్పటికప్పుడు గ్రామాల్లో క్యాంపులు నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఆస్పత్రి అవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డాక్టర్ హరినాథ్, సిబ్బంది హన్మంతు, ఆయుబ్‌ఖాన్, బస్వారాజ్, ఆశమ్మ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.