marikal
-
వివాహేతర సంబంధంతో.. భర్తను హతమార్చిన భార్య, ప్రియుడు..
మహబూబ్‌నగర్: వాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి హతమార్చి మృతదేహాన్ని దుప్పట్లో మూటకట్టి ముళ్లపొదల్లో పడేసిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. ఎస్ఐ హరిప్రసాద్‌రెడ్డి కథనం మేరకు.. దేవరకద్ర మండలం గూరకొండకు చెందిన గడుగు శ్రీనివాసులు (34)కు మక్తల్ మండలం దాసరిదొడ్డికి చెందిన మాధవి అలియాస్ హారతితో నాలుగు ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమారుడు, ఏడాది కుమార్తె ఉన్నారు. మాధవికి గూరకొండకు చెందిన గడుగు యమన్న అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. మాధవి పుట్టింటికి వెళ్లగా ఈ నెల 1న ఇంట్లో నుంచి ఆటోలో బయలుదేరిన శ్రీనివాసులు రాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో 2వ తేదీన శ్రీనివాసులు సోదరుడు మరికల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మూడురోజుల పాటు పోలీసులు గాలించినా ప్రయోజనం లేకపోయింది. చివరకు ఎవరిమీదైనా అనుమానం ఉందా అని కుటుంబ సభ్యులను ఆరా తీయగా అదే గ్రామానికి చెందిన యమన్న పేరు చెప్పారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా నిజాన్ని బయటపెట్టాడు. ఈ నెల 1న ఇంట్లో నుంచి బయటకు వచ్చిన శ్రీనివాసులును గమనిస్తున్న యమన్న మరికల్లో శ్రీనివాసులును కలిశాడు. భూత్పూర్లో ప్రధాని మోదీ సభకు వెళ్దామని శ్రీనివాసులు చెప్పగా వద్దు దాసరిదొడ్డిలోని నీ భార్య దగ్గరకు వెళ్దామని చెప్పి తీసుకెళ్లాడు. అక్కడికి కూడా వెళ్లకుండా రాష్ట్ర సరిహద్దులోని దేవసుగూర్ సమీపంలో కృష్ణానది వద్దకు తీసుకెళ్లి అక్కడే శ్రీనివాసులును హతమార్చి దుప్పట్లో మూటకట్టి ముళ్లపొదల్లో పారేశాడు. నిందితుడు చెప్పిన విధంగా శుక్రవారం పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం కుళ్లిపోయి ఉండటంతో పోస్టుమర్టం నిమిత్తం నారాయణపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని.. మాధవి సహకారంతోనే శ్రీనివాసులును యమన్న హత్య చేశాడని ఎస్ఐ వివరించారు. కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
వివాహేతర సంబంధానికి భర్త అడ్డు..గ్రామంలో జాతర ఉందని చెప్పి!
సాక్షి, మహబూబ్‌నగర్: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన సంఘటన పది రోజుల తర్వాత వెలుగు చూసింది. స్థానిక సీఐ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ రాంలాల్ వివరాలను వెల్లడించారు. మండలంలోని పెద్దచింతకుంట గ్రామానికి చెందిన మరాఠి శ్రీనివాసులు(39) వృత్తి రీత్యా ఆటోడ్రైవర్, భార్య సుజాత వీరికి కుమారుడు, కుతూరు ఉన్నారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన కరుణాకర్‌రెడ్డితో నాలుగేళ్ల క్రితం సుజాతతో పరిచయం ఏర్పడింది. ఈ విషయంపై అనుమానం వచ్చిన భర్త పలుమార్లు భార్యను నిలదీశాడు. పెద్దల సమక్షంలో పంచాయితీలు పెట్టారు. అయినా గుట్టు చప్పుడుగా వీరు తమ సంబంధాన్ని కొనసాగిస్తుండడంతో, పద్ధతి మార్చుకోవాలని భార్యతో తరచుగా గొడవ పడేవాడు. భర్త గొడవ పడుతున్న విషయాన్ని సుజాత ప్రియుడికి తెలిపింది. ఇరువురు కలిసి శ్రీనివాసులు హత్యకు పథకం వేశారు. ఈ నెల 6న గ్రామంలో జాతర ఉందని ఇంటిని శుద్ధి చేసి భర్తను నమ్మించి ముగ్గురు కలిసి ఆ రోజు రాత్రి మద్యం సేవించారు. శ్రీనివాసులు మద్యం మత్తులోకి జారుకోగా, రాత్రి 12 గంటల సమయంలో భార్య తన భర్త ముఖంపై ఊపిరి ఆడకుండా గట్టిగా దిండు పెట్టగా, ప్రియుడు కరుణాకర్‌రెడ్డి కాళ్లు, చేతులు గట్టిగా పట్టుకొని హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకున్నారు. భార్యపై అనుమానంతో మృతుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణలో నిజాలు తేలాయని సీఐ తెలిపారు. నిందితులు ఇద్దరిని గ్రామంలోనే అరెస్ట్ చేసి నారాయణపేట కోర్టులో హాజరుపరిచారు. చదవండి: ఆర్య సమాజ్‌లో ప్రేమ పెళ్లి.. మియాపూర్‌లో కాపురం.. చివరికి భర్త షాకింగ్ ట్విస్ట్ -
అడ్డొస్తే ట్రాక్టర్లతో తొక్కేస్తాం!
మరికల్ (నారాయణపేట): ‘ఇసుక ట్రాక్టర్లకు అడ్డువస్తే వాటితోనే తొక్కించుకుంటూ వెళ్తాం..’అంటూ గ్రామస్తులను ఇసుక మాఫియా హెచ్చరించింది. అయితే.. వారి తాటాకు చప్పుళ్లకు భయపడకుండా గ్రామస్తులు తిరగబడడంతో ట్రాక్టర్లను వదిలి పరారయ్యారు. ఈ సంఘటన శనివారం నారాయణపేట జిల్లా మరికల్ మండలం జిన్నారంలోని మన్నెవాగు వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. మన్నెవాగు నుంచి నెల రోజుల నుంచి ఇసుక అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులు, పోలీసుల దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదు. సమీపంలోని మన్నెవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలింపుతో చుట్టుపక్కల వ్యవసాయ బోర్లలో నీటిమట్టం పడిపోతోంది. కాగా, శనివారం ఉదయం ఇసుక కోసం ఈ వాగులోకి వచ్చిన సుమారు పది ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. రెచ్చిపోయిన ఇసుక వ్యాపారులు ‘మంచి మాటలతో చెబుతున్నాం. అడ్డు రాకండి.. అడ్డొస్తే ట్రాక్టర్లతో తొక్కిస్తాం..’అంటూ బెదిరించారు. అయితే గ్రామస్తులు తిరగబడటంతో ట్రాక్టర్లను వదిలి పరారయ్యారు. ఈ క్రమంలో వాగులోని నీటిగుంతలో కొన్ని వాహనాలు ఇరుక్కుపోయాయి. ఈ విషయాన్ని తహసీల్దార్, పోలీసులకు సమాచారం ఇచ్చినా ఎవరు అక్కడికి రాకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వాగులో నుంచి ఇసుకను అమ్ముకుంటున్న వారితో పాటు అనుమతి లేకుండా ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్న వారిపైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనుమతి లేకుండా తరలిస్తే చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతువేదికలు, శ్మశానవాటికలకు మాత్రమే ఇసుకకు అనుమతి ఇచ్చాం. ఒకవేళ ఇసుకను అక్రమంగా తరలిస్తే ఎంతటి వారైనా సరే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. గ్రామస్తులను భయాందోళనలకు గురిచేసే వారిపై కేసులు నమోదు చేయిస్తాం. – శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్, మరికల్ -
అవినీతి మరకలేని వారు రైతులొక్కరే..
మరికల్ (నారాయణపేట): దేశంలో అవినీతి మరక లేని వారు ఉన్నారంటే అది రైతులు ఒక్కరేనని ప్రొఫెసర్ హారగోపాల్ అన్నారు. రైతు దినోత్సవం సందర్భంగా మరికల్ శ్రీవాణి పాఠశాల్లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కోట్ల రూపాలయలను కొల్లగొట్టి దేశం విడిచి పొతున్న అవినీతి రాజకీయ నాయకులకు ఈ ప్రభుత్వాలు మద్దతు పలుకుతున్నాయని ఆరోపించారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన రైతులకు మద్దతు ధరలు ప్రకటించాలని కొరితే లాఠీచార్జ్‌లు చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటల కోసం చేసిన అప్పులను తీర్చలేక ఆత్మహత్యలు చెసుకుంటున్నా ప్రభుత్వాల నుంచి స్పందన రావడం లేదన్నారు. ఎవరో వస్తారు ఏదో చేస్తారో అని అలోచన చేయకుండా రైతులు నూతన పద్ధతి ద్వారా వ్యవసాయానికి శ్రీకారం చుట్టాలన్నారు. సేంద్రియ ఎరువులు వేసి పంటలను పండిస్తే అధిక దిగుబడితో పాటు మంచి లాభాలను ఆర్జించవచ్చన్నారు. నేడు హైబ్రీడ్ విత్తనాలు రావడంతో ఓ పంటల దిగుబడి పూర్తిగా తగ్గిందని, దీంతో అప్పులు రైతులవి ఆదాయం మాత్రం కార్పొరేట్ వారివి అని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం చేసిన హామీలను వెంటనే అమలు చేసి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాసశర్మ, వినితమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మా ఊళ్లో మద్యం వద్దు !
మరికల్ (నారాయణపేట): గాంధీజీ కన్న కలలను సాకారం చేసేందుకు మండలంలోని మాధ్వార్ గ్రామస్తులు అడుగులు వేస్తున్నారు. ఆగస్టు 15 నుంచి సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం మంగళవారం గ్రామస్తులు తిర్మానం చేశారు. మద్య నిషేధ సమయంలో గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మకాలు చేపడితే రూ.40వేల జరిమానా విధిస్తామని సర్పంచ్ పుణ్యశీల తిర్మానించారు. మహిళా సర్పంచ్ ముందడుగు.. మరికల్ మండలం మాధ్వార్‌లో 845 కుటుంబాలు ఉండగా 3,568 మంది జనాబా ఉంది. ఇటీవల కాలంలో గ్రామంలో మద్యం సేవించి భవిష్యత్‌ను బుగ్గిపాలు చేసుకుంటున్న యువతను మార్చేందుకు మాహిళ సర్పంచ్ పుణ్యశీల ముందుగా నడుం బిగించారు. ఆమె పిలుపు అందుకున్న మిగితా ప్రజాప్రతినిధులు, యువకులు, గ్రామస్తులు, మహిళలు పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు తిర్మానించారు. ఇందుకు గ్రామస్తులు సైతం ముందుకు వచ్చి తమ సంసారాలు బాగుపడుతాయంటే ఇంతకంటే ఏం కావాలంటూ పంచాయతీ కార్యాలయం ఎదుట మద్యం నిషేదిస్తున్నట్లు ప్రతిజ్ఞా చేశారు. ఆగష్టు 15 తర్వాత మాధ్వార్‌లో ఎవరైన మద్యం అమ్మకాలు చేప్పడితే రూ. 40 వేలు జరిమాన విధిస్తామని తిర్మానం చేశారు. అంతలో ఏమైన మద్యం మిగిలివుంటే ఆగస్టు 14 వరకు విక్రయించుకోవాలని వారికి వెసులుబాటు కల్పించి మిగితా గ్రామాలకు ఆదర్శంగా నిలిచారు. యువత పెడదారి పట్టొద్దనే నిర్ణయం యువత పెడదారి పట్టకుండా ఉండేందుకే గ్రామంలో మద్యం నిషేదించడం జరిగింది. ఇటీవల కాలంలో గ్రామంలో యువకులతో పాటు మహిళలు కూడా మద్యం సేవించి అలర్లకు కారణమవుతున్నారు. మాధ్వార్ గ్రామాన్ని ఒక ప్రశాంతమైన గ్రామంగా తీర్చేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది. – పుణ్యశీల, సర్పంచ్, మాధ్వార్ -
గ్రామీణాభివృద్ధికి పెద్దపీట
సాక్షి, మరికల్: ‘‘ఊరికి మరిన్ని మెరుపులు మెరిపించాలనే ఉద్దేశంతో ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన బడ్జెట్లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా అడుగలు వేసింది. ఉపాధి హామీకి మరింత ధీమాను ఇచ్చి.. మారుమూల పల్లెల్లో కూడా అందరికీ విద్యుత్ సౌకర్యం.. గ్రామీణ రోడ్లకు మెరుగులు దిద్దేందుకు నిధులు విడుదల.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు.. స్వచ్ఛభారత్ లక్ష్యానికి అందుకోవడం కోసం ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయడంతోపాటు ప్రతి గ్రామంలో కనీస మౌలిక వసతుల కల్పనకు కేంద్రం పెద్దపీట వేయడంతో గ్రామీణ రంగస్థలం ముస్తాబువుతుంది.’’ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామాల్లో ఏ ఒక్కరూ ఆకలితో ఉండరాదనే ఉద్దేశంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మరింత ఊతమిచ్చింది. ఆ దిశగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కూలీలకు గిట్టుబాటు కూలీ కల్పించడంలో ఉపాధి పనులు చేయాడానికి కూలీలు ఉత్సాహం చూపుతున్నారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్జ్యోతి యోజన మారుమూల గ్రామాల్లో కూడా విద్యుత్ కాంతులను నింపేందుకు రూ.125కే విద్యుత్ మీటర్‌ను ఏర్పాటు చేసి గిరిజనుల కుటుంబాల్లో వెలుగు జ్యోతిని నింపేందుకు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్జ్యోతి యోజన పథకం అమలు చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన రహదారులు లేని అవాసాలకు కూడా ప్రధాన మంత్రి గ్రామ్‌సడక్ యోజన పథకం బీటీరోడ్లను వేయించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ పథకం ద్వారా గిరిజన ప్రాంతాలకు నాణ్యమైన రోడ్లు వస్తాయానే భరోసా వచ్చింది. గ్రామీణ తాగునీటి పథకం తాగునీటి వనరులు లేని అనేక మారుమూల గ్రామాల్లో, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ తాగునీటి పథకం కింద అక్కడి ప్రజలకు సురక్షితమైన, తాగునీటిని అందించాలనేది ఈ పథకం ప్రధాన ఉద్ధేశం. గ్రామీణ టెలిఫోనీ మారుమూల పంచాయతీలో కూడా వైపై హాట్‌స్పాట్స్, ఇన్స్టలేషన్, హైస్ఫీడ్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ కనెక్టివిటీ వంటి సౌకర్యాలను అందించడమే గ్రామీణ టెలిఫోనీ పథకం లక్ష్యం. స్వచ్ఛ్భారత్ బహిరంగ మలవిసర్జన చేయరాదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ పథకం అమలు చేసింది. ఈ పథకం ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో పరిసరాల పరిశుభ్రత కోసం ఇంటింటికి మరుగుదొడ్లను నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. ప్రతి గ్రామంలో వందశాతం మరుగుదొడ్లను నిర్మించడమే ఈ పథకం లక్ష్యం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్లులేని పేదలకు గ్రామీణ ఆవాస్ యోజన పథకం కింద ఇళ్లు నిర్మించి ఇవ్వడం కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమల్లోకి వచ్చింది. -
కార్మికులకు వరం ‘మాన్‌ధన్’
సాక్షి, మరికల్: ‘ఎవరో వస్తారు.. ఏమో సాయం చేస్తారని.. ఎదురుచూసి మోసపోకు మిత్రమా..’ అని మోసపోకముందే ప్రధానమంత్రి అసంఘటిత కార్మికులకు చక్కటి పథకాన్ని ప్రవేశపెట్టారు. ‘శ్రమ యోగి మాన్‌ధన్ పథకంలో చేరి పింఛన్ అవకాశం దక్కించుకొండి..’ అని ప్రచారం సాగిస్తున్నారు. అసంఘటిత కార్మికులకు ఈ పథకం ఓ వరంలా ఉపయోగపడుతుంది. 18 నుంచి 40 ఏళ్ల లోపు ఉన్నవారందరూ పీఎం శ్రమయోగి మాన్‌ధన్ పథకంలో చేరాలని ఆహ్వానిస్తుంది. జీవితాంతం పింఛన్.. ఉద్యోగుల మాదిరి అసంఘిటిత రంగాల్లోని కార్మికులు నెలనెలా పింఛన్‌ను పొందనున్నారు. రెక్కాడితే డొక్కాడని కార్మికులు వయసుమీపడితే నిశ్చితంగా శేషజీవితం గడపనున్నారు. ఆరుపదుల వయస్సులో ఆర్థిక ఇబ్బందులను అదిగమించనున్నారు. తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్‌ధన్ పథకం ద్వారా వేలాది మంది కార్మికులు కల సాకారం కొబోతుంది. 18 నుంచి 40 ఏళ్లు ఉన్నవారు అర్హులు.. ఈ పథకంలో చేరే వారు 18 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉండాలి. వయస్సును బట్టి నెల, నెలకు తమపేర్ల మీద డబ్బులు కడితే అంతే మొత్తం కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. ఈ పథకంలో చేరిన వారికి 60 సంవత్సరాల వయస్సు రాగానే నెలకు రూ.3వేల చొప్పున పింఛన్ సౌకర్యం కల్పిస్తుంది. మిగితా అన్ని పింఛన్ పథకలతో పాటు అదనంగా పీఎం శ్రమయోగి మాన్‌ధన్ పింఛన్ వస్తుంది. ఒక వేళ లబ్ధిదారుడు మృతి చెందితే నామినీకి పింఛన్ వర్తిస్తుంది. అసంఘిటిత కార్మికులకు వరం దేశ ప్రధాని నరేంద్రమోదీ అమలు చేసిన ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్ పథకం ఆ సంఘటిత కార్మికులకు వరం లాంటింది. ఇందులో భవన నిర్మాణ, హమాలీ, రిక్షా, వ్యవసాయ కూలీలు, ఇళ్లలో పనిచేసే వారు, టీస్టాల్, తదితర చిన్న, చిన్న వ్యాపారులు సైతం ఈ పథకంలో చేరాడానికి అర్హులు. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు ఉన్న వారందరూ ఈ పథకంలో చేరి 60 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు కిస్తులు కడితే 60వ ఏట నుంచి ప్రతి నెలకు రూ.3వేలు పింఛన్ సౌకర్యం ఉంటుంది. ఎక్కడ దరఖాస్తు చేపసుకోవాలి ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్ పథకంలో చేరే లబ్ధిదారుల దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రతి గ్రామంలో ఓ కమన్ సర్వీస్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. 18నుంచి 40 ఏళ్ల వయస్సు ఉన్న వారందరూ తమ ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, ఫోన్ నంబర్‌ను జతపర్చి ఇవ్వాల్సి ఉంటుంది. ఏ వయస్సు వారికి ఎంత ప్రీమియం వయస్సు లబ్ధిదారుడి వాటా కేంద్రం వాటా రూ.నెలకు మొత్తం రూ.లో రూ.నెలకు 18 55 55 110 19 58 58 116 20 61 61 122 21 64 64 128 22 68 68 136 23 72 72 144 24 76 76 152 25 80 80 160 26 85 85 170 27 90 90 180 28 95 95 190 29 100 100 200 30 105 105 210 31 110 110 220 32 120 120 240 33 130 130 260 34 140 140 280 35 150 150 300 36 160 160 320 37 170 170 340 38 180 180 360 39 190 190 380 40 200 200 400 అవగాహన కల్పించాలి అసంఘటిత కార్మికుల కోసం పీఎం శ్రమ్ యోగి మాన్‌ధన్ పథకం అమలు చేసిన కేంద్ర ప్రభుత్వ పథకంపై అధికారులు పూర్తి స్థాయిలో కార్మికులకు అవగాహన కల్పించి ఎక్కువ మొత్తంలో లబ్ధిదారులను చేర్పించాలి. అన్ని రంగాల్లో పని చేసే కార్మికులతో పాటు వ్యవసాయ కూలీలకు ఈ పథకంలో చేరితే 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.3వేల పింఛన్ ఇవ్వనుంది. అధిక శాతం కార్మికులను చేర్పించేందుకు కృషి చేస్తాం. – రమేష్, భవన నిర్మాణ కార్మికుడు, మరికల్ పింఛన్‌కు దరఖాస్తు చేసుకోండి అసంఘటిత కార్మికులకు వృద్ధ్యాప్యంలో ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రమయోగి మాన్‌ధన్ పథకం అమలు చేసింది. ఇందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే కార్మికులకు, వ్యవసాయ కూలీలకు అవగాహన కల్పిస్తున్నాం. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కమన్ సర్వీస్ సెంటర్లో దరఖాస్తు చేసుకుంటే 18 నుంచి 40 ఏళ్ల వయస్సు వారు నెలకు ఎంతో డబ్బులు కడితే అంతే మొత్తం కేంద్రం ప్రభుత్వం లబ్ధిదారుడి ఖాతాలో జమ చేయనున్నారు. 60 ఏళ్ల అనంతరం నెలకు రూ.3వేల పింఛన్ వరిస్తుంది. ఈ అవకాశాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకొని లబ్ధిపొందాలి. – రాజ్‌కుమార్, జిల్లా లెబర్ ఆఫీసర్, నారాయణపేట -
భవనాల పరిశీలన
మరికల్ (ధన్వాడ) : కొత్త మండలంగా ఏర్పడిన మరికల్లో తాత్కాలిక తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటుకు బుధవారం ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ శంకరయ్య ప్రభుత్వ భవనాలను పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటుకు పంచాయతీ కార్యాలయం అణువుగా ఉంటుందని, ఆర్డీఓ ప్రజాప్రతినిధులకు సూచించారు. పాత ఆస్పత్రిలో తహసీల్దార్ కార్యాలయం కొనసాగిస్తే బాగుటుందని సర్పంచ్ జోగులక్ష్మీరామస్వామి అధికారులకు వివరిం చారు. ఇందుకు గాను అధికారులు మరికల్‌లోని పాత పీహెచ్సీ ఆస్పత్రి, సింగిల్‌విండో కార్యాలయం, వ్యవసాయగోదాం, గ్రంథాలయం, ఆయుర్వేద ఆస్పత్రి, పశుఆస్పత్రి భవనలను పరిశీలించారు. వీటిలో ఏదో ఒక భవనం ఎంపిక చే సి తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకుం టామని తహసీల్దార్ శంకరయ్య తెలిపారు. పరిశీలించిన ప్రభుత్వ భవనాల వివరాలను ఉన్నత అధికారులకు నివేదిక అందజేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు రామస్వామి, బుచ్చప్ప, రవి, వెంకట్రామారెడ్డి, తిరుపతయ్య, హన్మిరెడ్డి, కృష్ణయ్య, రాములు, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. -
మదర్‌థెరిస్సా జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు
మరికల్ (ధన్వాడ) : మదర్‌థెరిస్సా జయంతిని పురష్కరించుకుని మరికల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్ సమీపంలో ప్రతిష్ఠించిన మదర్‌థెరిస్సా విగ్రహానికి ఆ సంఘం సభ్యులు గురువారం రంగులు వేయించారు. శుక్రవారం జరిగే జయంతి ఉత్సవాలకు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. -
మరికల్‌ను మహబుబ్‌నగర్‌లో కలపాలి
కుల్కచర్ల: మండలంలోని మరికల్ గ్రామాన్ని మహబూబ్‌నగర్ జిల్లాలో కలపాలంటూ ఆదివారం ఆ గ్రామస్తులు పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు కుల్కచర్ల- నవాబుపేట రోడ్డు పై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మండలంలో మరికల్ పెద్ద పంచాయతీ అన్నారు. నాలుగు అనుబంధ గ్రామాలు, గిరిజన తండాలు ఉన్నాయన్నారు. 10 వేల వరకు జనాభా ఉంటుందన్నారు. మరికల్ గ్రామానికి కుల్కచర్ల 24 కిలో మీటర్ల దూరంలో ఉంటుందన్నారు. అదే మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం కేవలం 18కిలో మీటర్ల దూరం మాత్రమే ఉంటుందన్నారు.మహబూబ్‌నగర్ జిల్లాకు వెళ్లాలంటే ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు బస్సు సౌకర్యం ఉందని, కుల్కచర్ల మండలానికి వెళ్లాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోంన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు పాండురంగయ్య, యువజన సంఘాల సభ్యులు, రైతులు పాల్గొన్నారు. -
సార్వత్రిక సమ్మె పోస్టర్ విడుదల
మరికల్ (ధన్వాడ) : కార్మిక సమస్యలపై సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మె పోస్టర్‌ను ఆదివారం మరికల్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ డివిజన్ కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ కార్మికులు ఎదుర్కొంటున్న 12 డిమాండ్లను ఎన్డీఏ ప్రభుత్వం వ్యతిరేకించడంతో చేపట్టిన ఈ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు. -
యువక మండలి అధ్యక్షుడిగా హరీశ్
మరికల్ (ధన్వాడ) : మరికల్ యువక మండలి అధ్యక్షుడిగా హరీశ్‌కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని ప్రధాన కార్యదర్శి రాఘవేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం యువక మండలి భవనంలో జరిగిన సమావేశంలో కార్యవర్గ సభ్యుల సూచన మేరకు గతంలో అధ్యక్షుడిగా పనిచేస్తున్న సుధాకర్‌గౌడ్‌ను తప్పించి 4 నెలల కోసం హరీశ్‌ను ఎన్నుకున్నట్లు తెలిపారు. యథావిధిగా పాత కమిటీని కొనసాగిస్తామన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌కుమార్ మాట్లాడుతూ మరికల్ యువక మండలి తరఫున సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. -
సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి
మరికల్ (ధన్వాడ) : వర్షాకాలంలో వ్యాపించే సీజనల్ వ్యాధులపై గ్రామస్తులకు అవగాహన కల్పించాలని నారాయణపేట క్లస్టర్ అధికారిణి సౌభాగ్యలక్ష్మి అన్నారు. మంగళవారం మరికల్ పీహెచ్సీలో ఆశ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్షకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యాధుల పట్ల ఆశ కార్యకర్తలు ఎప్పటికప్పుడు గ్రామాల్లో క్యాంపులు నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఆస్పత్రి అవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డాక్టర్ హరినాథ్, సిబ్బంది హన్మంతు, ఆయుబ్ఖాన్, బస్వారాజ్, ఆశమ్మ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
తెల్లారిన బతుకులు
ట్రాక్టర్ బావిలోకి దూసుకెళ్లి.. మరికల్ : ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బావిలో పడి డ్రైవర్ అబ్దుల్(26) దుర్మరణం చెందాడు. మరికల్‌కు చెం దిన అబ్దుల్ శనివారం తెల్లవారుజామున 4గంటలకు ధన్వాడ మండలం రాకొండకు ట్రాక్టర్‌ను తీసుకెళ్తుండగా అదపుతప్పి రహదారి పక్కనే ఉన్న బావిలోకి దూసుకేళ్లింది. సంఘటన స్థలంలో కనిపించిన ఆనవాళ్లతో అటుగా వెళ్లే వారు బావిలో ట్రాక్టర్ పడినట్టు గుర్తించారు. ఇరు గ్రామాల ప్రజలు సంఘటన స్థలానికి చేరుకొని జేసీబీ సహాయంతో మొదట ట్రాక్టర్ ట్రాలీని బయట కు తీశారు. ఇంజన్‌తో పాటు అబ్దుల్ మృతదేహం బావిలోనే కురుకుపోయింది. నాలుగు మోటర్లు, పైర్‌ఇంజన్ సహాయంతో మూడు గంటల పాటు శ్రమించి నీటిని బయటకు తోడేశారు. మృతదేహాన్ని బయటకు తీసి అబ్దుల్‌గా గుర్తించారు. మృతునికి వృద్ధ తల్లిదండ్రులు పాష, మీరంబీతోపాటు భార్య షాహిన్‌బేగం, ఇద్దరు కుమారులు షాహిద్, ష్యాపీయన్లు ఉన్నారు. భార్య ప్రస్తుతం గర్భవతి. సంఘటన స్థలంలో కుటుంబసభ్యుల రోదనలు గ్రామస్తులకు కన్నీళ్లు తెప్పించాయి. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేటకు తరలించారు. సంపులో పడి బాలుడు భూత్పూర్ : మండల కేంద్రంలోని ఎస్సీ కాల నీలో శనివారం సాయంత్రం సంపులో పడి నయా బ్, షాహిన్బేగంల కు మారుడు ఎండి.ముజ్జు (3) చనిపోయాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముందున్న సంపులో పడిపోయాడు. కుమారుడు ఎక్కడా కనిపించకపోవడంతో తల్లి చుట్టుపక్కలంతా వెతికింది. చివరికి సంపులో శవమై కనిపించా డు. ఒకే కుమారుడు కావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. -
‘బీడు’ కిలకిల
అవాంతరాలను అధిగమించి ఎట్టకేలకు కోయిల్‌సాగర్ ట్రయల్ రన్ జయప్రదమైంది. ఫలితంగా మహానేత వైఎస్ కల ఫలించి 50 వేల పైచిలుకు ఎకరాలకు నీరంది బీడు నేల పులకరించనుంది. ఖరీఫ్ లక్ష్యంగా పనులు పూర్తిచేయాలని అధికారులు కంకణం కట్టుకున్నారు. సాంకేతిక ఇబ్బందులనధిగమించి సాగర్ నీరు పరవళ్లు తొక్కడంతో ఉత్సాహంతో ఊగిపోయారు. తమ శ్రమ ఫలించిందని ఆనందం పంచుకున్నారు. మరికల్ కరువు కాటకాలతో అల్లాడుతున్న బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు మ హానేత వైఎస్ఆర్ ప్రారంభించిన జలయజ్ఞం పనుల్లో భాగంగా చేపట్టిన కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతమైంది. మొదటి లిప్టు పనుల దగ్గర బుధవారం నిర్వహించిన జూరాల నీటి నడక ఝల్లున సాగడం తో అధికారులు ఆనందం వ్యక్తం చేసుకొని స్వీ ట్లు పంచుకున్నారు. ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ప్రకాష్, ఎస్ఈ శ్రీరామకృష్ణలు నర్వ మం డలం ఉంధ్యాల సమీపంలో స్టేజీ-1 దగ్గర ఓక పంపుతో ట్రయల్న్‌న్రు స్వయంగా పర్యవేక్షించారు. ఖరీఫ్ లక్ష్యంగా పనులు ఈ సందర్భంగా ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ప్ర కాష్ మాట్లాడుతూ కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పనులు ఇప్పటి వరకు 99 శాతం పూర్తి చేశామన్నారు. రూ.458.245 కోట్లకు గాను రూ.386. 86కోట్ల పనులు చేశామన్నారు. మిగతా పనుల ను వేగిర పరిచేందుకు చ ర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుతం స్టే జీ- 1 నిర్వహించిన ట్రయల్న్ ్రనీటిని ఫ ర్దీపూర్ చెరువులోకి చేరే వరకు పంపు రన్ అవుతుందన్నారు. మరో పది రోజుల్లో ధ న్వాడ మండలం తీలేర్ సమీపంలో ఉన్న స్టేజీ-2దగ్గర రె ండో పంపునకు ట్రయల్న్ ్రనిర్వహిస్తామని తెలిపారు. ఖరీఫ్ నా టికి పూర్తి స్థాయిలో జూరాల నీటితో కో యిల్‌సాగర్ ప్రాజెక్ట్‌ను నింపి పంటలకు సాగునీరు అందిస్తామన్నారు. జూరాలకు ఎగువ నుంచి 18 వందల క్యూసెక్కుల నీ రు వచ్చిచేరుతుందన్నారు. ప్రస్తుతానికి జూరాల ప్రాజెక్ట్‌కు ఎలాంటి నీటి సమ స్య లేదన్నారు. కోయిల్‌సాగర్ స్టేజీ-1లో నీటిని పంపింగ్ చేసే పంపు సామర్థ్యం 315 క్యూస్సెకులు ఉండగా ప్రస్తుతం 250 క్యూస్సెకుల నీటిని ఫర్దీపూర్ చెరువు కు విడుదల చేశామని అక్కడి నుంచి స్టే జీ-2కు నీటిని తరలించి పది రోజుల్లో రెండో పంపు ట్రయల్న్ ్రచేస్తామన్నారు. పాలమూరుకు తాగునీరు కూడా... ఈ సందర్భంగా ఎస్ఈ శ్రీరామకృష్ణ మా ట్లాడుతూ 50,250 ఎకరాలకు సాగునీ రందించేందుకు ఈ పథకాన్ని చేపట్టినట్లు తెలిపారు. పనులు పూర్తయినట్లు ఆయన తెలిపారు. ఫేజ్-2 కు మరో వారం రో జుల్లో నీటిని సరఫరా చేసి కోయిల్‌సాగర్ ప్రాజెక్టులోకి పంపింగ్ చేస్తామన్నారు. ఈ నీటి ద్వారా పాలమూరు జిల్లా కేంద్రానికి తాగునీరు సరఫరాను చేయనున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో తాగునీటి స రఫరా ఇబ్బంది లేకుండా పుష్కలంగా ల భిస్తుందన్నారు. జూన్ మాసంలో వీటి ద్వారా ఆయకట్టు కింద 20 వేల ఎకరాల కు సాగునీరందించేందుకు కృషిచేస్తామ ని తెలిపారు. ట్రయల్న్ ్రవిజయవంతం కావడంతో చుట్టు ప్రక్కల గ్రామాలైన ఉంద్యాల, లంకాల, యాంకి, రాంపూర్, నర్వ, కుమార్లింగంపల్లి తదితర గ్రామా ల నుంచి రైతులు, గ్రామస్తులు భారీ ఎత్తున పంపుహౌస్ వద్దకు చేరుకొని పంపింగ్ తీరును ఆసక్తిగా తిలకించారు. ట్రయల్న్ ్రవిజయవంతం కావడంతో స్థానిక రైతులు ఆనందం వ్యక్తపరిచారు. వీటి ద్వారా తమ పొలాల్లో భూగర్భ జలాలు పెరిగి తమకు కొంత మేలు చేకూర్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీహెచ్ఎల్ జీఎం ప్రసాద్, ఐవిఆర్సీఎల్ జీఎం నాగభూషణం, డీఈ గపూర్సిద్దిక్, ఈఈ కిషన్‌రావు, మేనేజర్ మోహన్‌రెడ్డి, పూరోషోత్తమరెడ్డి తదితరులు పాల్గొన్నారు.