హరీశ్‌కుమార్
యువక మండలి అధ్యక్షుడిగా హరీశ్
Published Sat, Aug 13 2016 6:24 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM
మరికల్ (ధన్వాడ) : మరికల్ యువక మండలి అధ్యక్షుడిగా హరీశ్‌కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని ప్రధాన కార్యదర్శి రాఘవేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం యువక మండలి భవనంలో జరిగిన సమావేశంలో కార్యవర్గ సభ్యుల సూచన మేరకు గతంలో అధ్యక్షుడిగా పనిచేస్తున్న సుధాకర్‌గౌడ్‌ను తప్పించి 4 నెలల కోసం హరీశ్‌ను ఎన్నుకున్నట్లు తెలిపారు. యథావిధిగా పాత కమిటీని కొనసాగిస్తామన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌కుమార్ మాట్లాడుతూ మరికల్ యువక మండలి తరఫున సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
Advertisement
Advertisement