
ప్రొఫెసర్ హరగోపాల్
మరికల్ (నారాయణపేట): దేశంలో అవినీతి మరక లేని వారు ఉన్నారంటే అది రైతులు ఒక్కరేనని ప్రొఫెసర్ హారగోపాల్ అన్నారు. రైతు దినోత్సవం సందర్భంగా మరికల్ శ్రీవాణి పాఠశాల్లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కోట్ల రూపాలయలను కొల్లగొట్టి దేశం విడిచి పొతున్న అవినీతి రాజకీయ నాయకులకు ఈ ప్రభుత్వాలు మద్దతు పలుకుతున్నాయని ఆరోపించారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన రైతులకు మద్దతు ధరలు ప్రకటించాలని కొరితే లాఠీచార్జ్‌లు చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటల కోసం చేసిన అప్పులను తీర్చలేక ఆత్మహత్యలు చెసుకుంటున్నా ప్రభుత్వాల నుంచి స్పందన రావడం లేదన్నారు. ఎవరో వస్తారు ఏదో చేస్తారో అని అలోచన చేయకుండా రైతులు నూతన పద్ధతి ద్వారా వ్యవసాయానికి శ్రీకారం చుట్టాలన్నారు. సేంద్రియ ఎరువులు వేసి పంటలను పండిస్తే అధిక దిగుబడితో పాటు మంచి లాభాలను ఆర్జించవచ్చన్నారు. నేడు హైబ్రీడ్ విత్తనాలు రావడంతో ఓ పంటల దిగుబడి పూర్తిగా తగ్గిందని, దీంతో అప్పులు రైతులవి ఆదాయం మాత్రం కార్పొరేట్ వారివి అని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం చేసిన హామీలను వెంటనే అమలు చేసి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాసశర్మ, వినితమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment