చిరుతతో సెల్ఫీ కోసం ఎగబడ్డ జనం! | Narayanpet Villagers Trying To Take Selfie With Leopard Viral - Sakshi
Sakshi News home page

నారాయణ పేట: చిరుతతో సెల్ఫీ కోసం ఎగబడ్డ జనం!

Published Sat, Jan 13 2024 6:38 PM | Last Updated on Sat, Jan 13 2024 7:16 PM

Narayanpet Villagers selfie With Leo Pard Viral - Sakshi

నారాయణపేట, సాక్షి: చిరుత పులితో సెల్ఫీ దిగేందుకు జనం ఎగబడ్డ ఘటన శనివారం నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది. దామరగిద్ద మండలం కాంసన్ పల్లి, వత్తు గుండ్ల గ్రామాల మధ్య పొలాల్లో మూడు చిరుతలు తిరుగుతాయనే సమాచారంతో చుట్టుపక్కల జనం ఎగబడ్డారు. ఆ సమయంలో జనం రాకను చూసి పిల్ల చిరుతలు పరారయ్యాయి.

అయితే అనారోగ్యంతో ఉన్న తల్లి చిరుత నిస్సహాయ స్థితిలో అక్కడక్కడే తిరుగుతూ కనిపించింది. దీంతో కొందరు యువకులు ఫొటోలు-వీడియోలు తీసేందుకు.. ఆ చిరుతతో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఈలోపు సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని దానిని పరిశీలిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement