మరణం అంచులదాక వెళ్లి అనూహ్యంగా బయటపెడితే ఎవరికైనా ఏడుపూ ఆనందం ఒకేసారి తన్నుకుంటూ వచ్చేస్తాయి. ఔను! జీవితం మనకు మరో అవకాశం ఇచ్చిందనుకుంటాం. మళ్లీ సమర్ధవంతంగా జీవితాన్ని ఎలా పునర్‌నిర్మించాలో ఆలోచించుకుంటాం కదా. అచ్చం అలానే ఇక్కడొక జంట చచ్చపోతాం అనుకునేంత భయానక ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు.
వివరాల్లోకెళ్తే....పెరూ రాజధాని లిమాలోని విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లో రన్‌వేపై కుప్పకూలిపోయింది. అక్కడే ఉన్న అగ్నిమాపక వాహనాన్ని ఢీకొని మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో సిబ్బంది తోపాటు, దాదాపు 120 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఐతే ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ ఒక జంట వెంటనే సెల్ఫీ తీసుకున్నారు.
ఇలాంటి ప్రమాదం తర్వాత కాసేపు భయాందోళనలకు లోనవ్వడం సహజం. కానీ జీవితం మరో అవకాశం ఇచ్చిందన్న ఆనందంతో తాము ఇలా సెల్ఫీతో సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని ఆనందంగా చెబుతున్నారు ఆ దంపతులు. ఈ సెల్ఫీ ఫోటోను ఏ 320 సిస్టమ్స అనే ఫేస్‌బుక్‌లో 'సెల్ఫీ ఆఫ్ ద ఇయర్' అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment