Hareesh
-
విలు విద్య పేరుతో మోసం
ఒంగోలు క్రైం: విలు విద్య పేరుతో ఓ వ్యక్తి ఒంగోలు నగరంలో పలువురిని మోసం చేశాడు. బాధితులు ఒంగోలు ఒన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విలు విద్య పేరుతో మోసం చేసిన స్థానిక కమ్మపాలేనికి చెందిన నందనం హరీష్‌బాబును ఎస్ఐ ఎం.దేవకుమార్ అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు పంపారు. ఏం జరిగిందంటే.. నగరంలోని రంగారాయుడుచెరువు వద్ద ఉన్న గాంధీపార్కులో ఒంగోలు కమ్మపాలేనికి చెందిన నందనం హరీష్‌బాబు తాను విలు విద్యలో శిక్షణనిస్తానంటూ విద్యార్థినీ, విద్యార్థుల తల్లిదండ్రులను నమ్మబలికాడు. దీంతో తమ చిన్నారులకు విలు విద్యలో శిక్షణ ఇప్పిస్తే ఉన్నత చదువుల్లో అవకాశాలతో పాటు ఉద్యోగావకాశాలు కూడా మెండుగా ఉంటాయని భావించి తల్లిదండ్రులు అతని వద్ద చేర్పించారు. శిక్షణ పేరుతో నెలల తరబడి తల్లిదండ్రుల వద్ద పెద్ద మొత్తాల్లో నగదు వసూలు చేశాడు. విల్లు కోసం, బాణాల కొనుగోలు కోసం డబ్బులు కావాలని అడగడంతో వేలకు వేలు ఇచ్చారు. విల్లు, బాణాలు కొందరికీ ఇచ్చి మరికొందరికి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ వచ్చాడు. నిర్మల్‌నగర్‌కు చెందిన జాస్టి రామారావు తన వద్ద రూ.60 వేలు తీసుకొని మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించాడు. నగదుతో పాటు వారి వద్ద ఏటీఎం కార్డు కూడా తీసుకొని నగదు కూడా డ్రా చేశాడు. తీరా విల్లు, బాణాలు ఇవ్వకపోవడంతో మోసపోయానని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. సుజాతనగర్‌కు చెందిన భవనాశి ప్రవల్లిక విల్లు, బాణాల కోసం రూ.98 వేలిచ్చింది. కమ్మపాలేనికి చెందిన పెండ్యాల రామకృష్ణ రూ.59 వేలిచ్చాడు. గద్దలగుంటకు చెందిన నత్తల శ్రీనివాసరావు రూ.25 వేలు ముట్టజెప్పాడు. బల్లిపల్లి శ్రీనివాసులు అనే వ్యక్తి తన ఇద్దరు కుమార్తెల కోసం రూ.70 వేలిచ్చాడు. ఇలా హరీష్‌బాబు మోసాలను ఒక్కొక్కరుగా బయట పెడుతున్నారు. వాస్తవానికి రాయల్ స్పోర్ట్స్ అకాడమీ పేరుతో నిర్వహిస్తున్న సంస్థకు అసలు స్పోర్ట్స్ అథారిటీ నుంచి అనుమతే లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. హరీష్‌బాబు పోటీల్లో గెలిచానని చూపిస్తున్న సర్టిఫికెట్లు కూడా నకిలీవని తెలింది. నిందితుడిని అరెస్టు చేసి పోలీసులు రిమాండ్‌కు పంపారు. -
యువక మండలి అధ్యక్షుడిగా హరీశ్
మరికల్ (ధన్వాడ) : మరికల్ యువక మండలి అధ్యక్షుడిగా హరీశ్‌కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని ప్రధాన కార్యదర్శి రాఘవేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం యువక మండలి భవనంలో జరిగిన సమావేశంలో కార్యవర్గ సభ్యుల సూచన మేరకు గతంలో అధ్యక్షుడిగా పనిచేస్తున్న సుధాకర్‌గౌడ్‌ను తప్పించి 4 నెలల కోసం హరీశ్‌ను ఎన్నుకున్నట్లు తెలిపారు. యథావిధిగా పాత కమిటీని కొనసాగిస్తామన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌కుమార్ మాట్లాడుతూ మరికల్ యువక మండలి తరఫున సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. -
దొరక్కపోతే దొరలే!
రామ్‌సందీప్, హరీష్, శిల్పా, రజితలు హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ శ్రీ లక్ష్మీగణపతి మూవీస్ నిర్మిస్తోన్న చిత్రం ‘ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్’. శ్రీనివాస్ తోకల దర్శకత్వంలో బి. శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం మలి షెడ్యూల్ జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఈ షెడ్యూల్లో కృష్ణభగవాన్, తాగుబోతు రమేష్, పింగ్ పాంగ్, రామ్‌సందీప్, శిరీషలు పాల్గొనగా హాస్య సన్నివేశాలు తీస్తున్నాం. సస్పెన్స్, కామెడీ నేపథ్యంలో సాగే చిత్రం. చేసిన తప్పులు తెలియనంతవరకు అందరూ దొరలే.. తెలిసిన తర్వాత దొంగలే అనే విషయం అందరికీ తెలుసు. ఈ పాయింట్ మీదే ఈ చిత్రం ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: నండూరి వీరేష్, కెమెరా: మహిశర్ల.