దొరక్కపోతే దొరలే! | all are kings, if they are not caught | Sakshi
Sakshi News home page

దొరక్కపోతే దొరలే!

Published Tue, Oct 1 2013 1:42 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

దొరక్కపోతే దొరలే! - Sakshi

దొరక్కపోతే దొరలే!

రామ్‌సందీప్, హరీష్, శిల్పా, రజితలు హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ శ్రీ లక్ష్మీగణపతి మూవీస్ నిర్మిస్తోన్న చిత్రం ‘ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్’. శ్రీనివాస్ తోకల దర్శకత్వంలో బి. శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం మలి షెడ్యూల్ జరుగుతోంది. 
 
 ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఈ షెడ్యూల్‌లో కృష్ణభగవాన్, తాగుబోతు రమేష్, పింగ్ పాంగ్, రామ్‌సందీప్, శిరీషలు పాల్గొనగా హాస్య సన్నివేశాలు తీస్తున్నాం. సస్పెన్స్, కామెడీ నేపథ్యంలో సాగే చిత్రం.
 
 చేసిన తప్పులు తెలియనంతవరకు అందరూ దొరలే.. తెలిసిన తర్వాత దొంగలే అనే విషయం అందరికీ తెలుసు. ఈ పాయింట్ మీదే ఈ చిత్రం ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: నండూరి వీరేష్, కెమెరా: మహిశర్ల.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement