‘బీడు’ కిలకిల | 'Barren' Line | Sakshi
Sakshi News home page

‘బీడు’ కిలకిల

Published Thu, Mar 6 2014 3:07 AM | Last Updated on Sat, Jul 7 2018 2:37 PM

‘బీడు’ కిలకిల - Sakshi

‘బీడు’ కిలకిల

 అవాంతరాలను అధిగమించి ఎట్టకేలకు కోయిల్‌సాగర్ ట్రయల్ రన్ జయప్రదమైంది. ఫలితంగా  మహానేత వైఎస్ కల ఫలించి 50 వేల పైచిలుకు ఎకరాలకు నీరంది బీడు నేల పులకరించనుంది.

ఖరీఫ్ లక్ష్యంగా పనులు పూర్తిచేయాలని అధికారులు కంకణం కట్టుకున్నారు. సాంకేతిక ఇబ్బందులనధిగమించి సాగర్ నీరు పరవళ్లు తొక్కడంతో  ఉత్సాహంతో ఊగిపోయారు. తమ శ్రమ ఫలించిందని ఆనందం పంచుకున్నారు.
 
 

మరికల్

కరువు కాటకాలతో అల్లాడుతున్న  బీడు భూములను సస్యశ్యామలం  చేసేందుకు మ హానేత వైఎస్‌ఆర్ ప్రారంభించిన జలయజ్ఞం పనుల్లో  భాగంగా చేపట్టిన కోయిల్‌సాగర్  ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతమైంది. మొదటి లిప్టు పనుల దగ్గర బుధవారం నిర్వహించిన జూరాల నీటి నడక ఝల్లున సాగడం తో  అధికారులు ఆనందం వ్యక్తం చేసుకొని స్వీ ట్లు పంచుకున్నారు. ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ప్రకాష్, ఎస్‌ఈ శ్రీరామకృష్ణలు నర్వ మం డలం ఉంధ్యాల సమీపంలో  స్టేజీ-1 దగ్గర ఓక పంపుతో ట్రయల్న్‌న్రు స్వయంగా పర్యవేక్షించారు.
 

ఖరీఫ్ లక్ష్యంగా పనులు
 

ఈ సందర్భంగా ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ప్ర కాష్ మాట్లాడుతూ కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పనులు ఇప్పటి వరకు 99 శాతం పూర్తి చేశామన్నారు. రూ.458.245 కోట్లకు గాను రూ.386. 86కోట్ల పనులు చేశామన్నారు.

 మిగతా పనుల ను వేగిర పరిచేందుకు  చ ర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుతం స్టే జీ- 1 నిర్వహించిన ట్రయల్న్ ్రనీటిని ఫ ర్దీపూర్ చెరువులోకి చేరే వరకు పంపు రన్ అవుతుందన్నారు. మరో పది రోజుల్లో ధ న్వాడ మండలం తీలేర్ సమీపంలో ఉన్న స్టేజీ-2దగ్గర రె ండో పంపునకు ట్రయల్న్ ్రనిర్వహిస్తామని తెలిపారు. ఖరీఫ్ నా టికి పూర్తి స్థాయిలో జూరాల నీటితో కో యిల్‌సాగర్ ప్రాజెక్ట్‌ను నింపి పంటలకు సాగునీరు అందిస్తామన్నారు. జూరాలకు ఎగువ నుంచి 18 వందల క్యూసెక్కుల నీ రు వచ్చిచేరుతుందన్నారు. ప్రస్తుతానికి జూరాల ప్రాజెక్ట్‌కు ఎలాంటి  నీటి సమ స్య లేదన్నారు. కోయిల్‌సాగర్ స్టేజీ-1లో నీటిని పంపింగ్ చేసే పంపు సామర్థ్యం 315 క్యూస్సెకులు ఉండగా  ప్రస్తుతం 250 క్యూస్సెకుల నీటిని ఫర్దీపూర్ చెరువు కు విడుదల చేశామని అక్కడి నుంచి స్టే జీ-2కు నీటిని తరలించి పది రోజుల్లో రెండో పంపు ట్రయల్న్ ్రచేస్తామన్నారు.
 

పాలమూరుకు తాగునీరు కూడా...
 

ఈ సందర్భంగా ఎస్‌ఈ శ్రీరామకృష్ణ మా ట్లాడుతూ 50,250 ఎకరాలకు సాగునీ రందించేందుకు ఈ పథకాన్ని చేపట్టినట్లు తెలిపారు. పనులు పూర్తయినట్లు ఆయన తెలిపారు. ఫేజ్-2 కు  మరో వారం రో జుల్లో నీటిని సరఫరా చేసి కోయిల్‌సాగర్ ప్రాజెక్టులోకి పంపింగ్  చేస్తామన్నారు. ఈ నీటి ద్వారా పాలమూరు జిల్లా కేంద్రానికి తాగునీరు సరఫరాను చేయనున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో తాగునీటి స రఫరా ఇబ్బంది లేకుండా పుష్కలంగా ల భిస్తుందన్నారు. జూన్ మాసంలో వీటి ద్వారా ఆయకట్టు కింద 20 వేల ఎకరాల కు సాగునీరందించేందుకు కృషిచేస్తామ ని తెలిపారు. ట్రయల్న్ ్రవిజయవంతం కావడంతో చుట్టు ప్రక్కల గ్రామాలైన ఉంద్యాల, లంకాల, యాంకి, రాంపూర్, నర్వ, కుమార్లింగంపల్లి తదితర గ్రామా ల నుంచి రైతులు, గ్రామస్తులు భారీ ఎత్తున పంపుహౌస్ వద్దకు చేరుకొని పంపింగ్ తీరును ఆసక్తిగా తిలకించారు.

ట్రయల్న్ ్రవిజయవంతం కావడంతో స్థానిక రైతులు ఆనందం వ్యక్తపరిచారు. వీటి ద్వారా తమ పొలాల్లో భూగర్భ జలాలు పెరిగి తమకు కొంత మేలు చేకూర్చుతుందని  ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీహెచ్‌ఎల్ జీఎం ప్రసాద్, ఐవిఆర్‌సీఎల్ జీఎం నాగభూషణం, డీఈ గపూర్‌సిద్దిక్, ఈఈ కిషన్‌రావు, మేనేజర్ మోహన్‌రెడ్డి, పూరోషోత్తమరెడ్డి  తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement