తెల్లారిన బతుకులు | Abdhul died in road accident | Sakshi
Sakshi News home page

తెల్లారిన బతుకులు

Published Sun, Apr 27 2014 4:01 AM | Last Updated on Sat, Sep 2 2017 6:33 AM

Abdhul died in road accident

 ట్రాక్టర్ బావిలోకి దూసుకెళ్లి..
 మరికల్ : ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బావిలో పడి డ్రైవర్ అబ్దుల్(26) దుర్మరణం చెందాడు.  మరికల్‌కు చెం దిన అబ్దుల్ శనివారం తెల్లవారుజామున 4గంటలకు ధన్వాడ మండలం రాకొండకు ట్రాక్టర్‌ను తీసుకెళ్తుండగా అదపుతప్పి రహదారి పక్కనే ఉన్న బావిలోకి దూసుకేళ్లింది. సంఘటన స్థలంలో కనిపించిన ఆనవాళ్లతో అటుగా వెళ్లే వారు బావిలో ట్రాక్టర్ పడినట్టు గుర్తించారు. ఇరు గ్రామాల ప్రజలు సంఘటన స్థలానికి చేరుకొని జేసీబీ సహాయంతో మొదట ట్రాక్టర్ ట్రాలీని బయట కు తీశారు.
 
 ఇంజన్‌తో పాటు అబ్దుల్ మృతదేహం బావిలోనే కురుకుపోయింది. నాలుగు మోటర్లు, పైర్‌ఇంజన్ సహాయంతో మూడు గంటల పాటు శ్రమించి నీటిని బయటకు తోడేశారు. మృతదేహాన్ని బయటకు తీసి అబ్దుల్‌గా గుర్తించారు. మృతునికి వృద్ధ తల్లిదండ్రులు పాష, మీరంబీతోపాటు భార్య షాహిన్‌బేగం, ఇద్దరు కుమారులు షాహిద్, ష్యాపీయన్‌లు ఉన్నారు. భార్య ప్రస్తుతం గర్భవతి.  సంఘటన స్థలంలో కుటుంబసభ్యుల రోదనలు గ్రామస్తులకు కన్నీళ్లు తెప్పించాయి. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేటకు తరలించారు.
 
 సంపులో పడి బాలుడు
 భూత్పూర్ : మండల కేంద్రంలోని ఎస్సీ కాల నీలో శనివారం సాయంత్రం సంపులో పడి నయా బ్, షాహిన్‌బేగంల కు మారుడు ఎండి.ముజ్జు (3) చనిపోయాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముందున్న సంపులో పడిపోయాడు. కుమారుడు ఎక్కడా కనిపించకపోవడంతో తల్లి చుట్టుపక్కలంతా వెతికింది. చివరికి సంపులో శవమై కనిపించా డు. ఒకే కుమారుడు కావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement