సాక్షి, అమరావతి: ఎస్సీ గురుకులాల్లోని విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడటానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గురుకులాల విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించారు.
ఎవరైనా అనారోగ్యానికి గురైతే వెంటనే చికిత్స అందించాలని.. అవసరమైన ఔషధాలను కూడా అందుబాటులో పెట్టుకోవాలని సూచించారు. గురుకులాల ఆవరణల్లో అపరిశుభ్ర వాతావరణం లేకుండా చూడాలన్నారు. గతంలో సెర్ప్ ద్వారా విద్యార్థులకు అమలు చేసిన ఇన్‌స్రూ?న్స్‌ను పునరుద్ధరించే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. ప్రతి విద్యాసంస్థలో తప్పనిసరిగా హెల్త్ సూపర్‌వైజర్, హాస్టల్ కేర్ టేకర్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ పోస్టులు ఎక్కడైనా ఖాళీగా ఉంటే భర్తీ చేయడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి పాఠశాలలోనూ ప్రభుత్వ మెనూ అమలవ్వాలని స్పష్టం చేశారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయలక్షి్మ, గురుకుల విద్యా సంస్థ కార్యదర్శి పావనమూర్తి తదితరులు పాల్గొన్నారు.
గురుకులాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు
Published Sun, Sep 11 2022 4:56 AM | Last Updated on Sun, Sep 11 2022 4:23 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment