Published
Thu, Jul 28 2016 11:35 PM
| Last Updated on Mon, Sep 4 2017 6:46 AM
సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి
హుజూర్‌నగర్ : ప్రస్తుత వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ విజయదుర్గాచారి అన్నారు. గురువారం స్థానిక టౌన్‌హాల్‌లో జరిగిన ఆశా వర్కర్ల సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. వైద్య ఆరోగ్యశాఖ అమలుచేస్తున్న పథకాలు గ్రామస్థాయిలో ప్రజలకు చేరువయ్యేలా ఆశా కార్యకర్తలు ఏఎన్‌ఎంలతో కలిసి పనిచేయాలన్నారు. గర్భిణులకు ఆరోగ్య సంబంధ విషయాల్లో అవగాహన కల్పించి వైద్యశాలల్లో కాన్పులు జరిగేలా చూడాలన్నారు. నగరపంచాయతీ చైర్మన్ జక్కుల వెంకయ్య మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ కార్యక్రమాల్లో ఆశా కార్యకర్తల పాత్ర కీలకమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జి.నిర్మల, కమిషనర్ సత్యనారాయణరెడ్డి, తహసీల్దార్ రవి, డాక్టర్ నాగేంద్రబాబు, డాక్టర్ ప్రేమ్‌సింగ్, డాక్టర్ ఫిరోజ్, డాక్టర్ హలీం, డీపీఎంఓ సురేష్‌బాబు, మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీనివాసరాజు, టీబీ సూపర్‌వైజర్ నిమ్మల వెంకటేశ్వర్లు, శ్రీనివాసన్, కిరణ్, రామకృష్ణ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.