
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి
కలెక్టర్ డాక్టర్ టీకే శ్రీదేవి
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : వర్షాలు కురుస్తున్న ఈ సమయంలో గ్రామా లు, పట్టణాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ టీకే శ్రీదేవి ఆదేశించారు. గురువారం రెవెన్యూ సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధుల నివారణపై జిల్లా సమన్వయకమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు పూర్తి అవగాహన వచ్చేలా ప్రచారం చేయాలని, ఇంటి పరిసరాల్లో దోమలు పెరగకుండా నీటి నిల్వలను తొలగించాలని, డ్రమ్ములు, నీటితొట్లను వారాకోసారి ఖాళీ చే యాలని, వృథాగా ఉన్న టైర్లు, డబ్బా లు, వాడి పడేసిన కొబ్బరి బొం డాలను కాల్చివేయాలన్నారు. వీధుల్లో దోమల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉంటాయన్నారు.
విద్యార్థుల ఆరోగ్యం జాగ్రత్త
హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా ప్రతినెల సంక్షే మ హాస్టళ్లను సందర్శించి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయాలని కోరారు. జిల్లాలోని కస్తూర్బా విద్యాలయాల్లో అనాథలు, బాలకార్మికులు చదువుకుంటున్నారని, వారి ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ప్రతివారం కస్తూర్బా పరిధిలోని మెడికల్ ఆఫీసర్లు సందర్శించి వైద్యం అందిస్తూ ఆరోగ్య సూత్రాలను తెలియజేయాలన్నారు. గ్రామాల్లోని ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీలు సమన్వయంతో ప్రతిరోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, వ్యాధులు వచ్చాక చర్యలు తీసుకునేకంటే రాకముందే అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ పార్వతి, అదనపు డీఎంహెచ్‌ఓ నాగారాం, డీపీఓ వెంకటేశ్వర్లు, జిల్లా మలేరియా అధికారి శశికాంత్ పాల్గొన్నారు.
పిల్లలను బడిలో చేర్పించాలి
బడిబాట కార్యక్రమంలో గుర్తించిన పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ శ్రీదేవి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి డిప్యూటీ ఈఓలు, మండల విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్‌సలో పలు ఆదేశాలు జారీచేశారు. ఊర్లో ఉన్న పిల్లల్లో కనీసం 50 శాతం మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విధంగా కృషి చేయాలని, స్వయంగా డిప్యూటీ ఈఓలు, ఎంఈఓలు పర్యవేక్షించాలని కోరారు. అంగన్‌వాడీల్లో ఐదు సంవత్సరాలు దాటిన పిల్లల వివరాలు సేకరించి పాఠశాలల్లో చేర్పించాలని సీడీపీఓలకు ఆదేశించారు.
ప్రతి ఊర్లో 40వేల మొక్కలు నాటాలి
భూత్పూర్ : ప్రతి గ్రామంలో 40వేల మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ టీకే శ్రీదేవి పిలుపునిచ్చారు. గురువారం మద్దిగట్లలో జరిగిన హరితహారంలో మొక్కలు నాటారు. మానవ మనుగడ అడవులపై ఆధారపడి ఉందని, పచ్చదనం పెరిగితేనే వర్షాలు కురుస్తాయనే విషయాన్ని అందరు మరిచిపోయారన్నారు. ముఖ్యంగా ప్రతి గ్రామంలో 100శాతం మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, నీటివనరుల పెంపునకు ఇంకుడుగుంతలు తప్పని సరన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈ ఓ లక్ష్మినారాయణ, డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, డీఎఫ్‌ఓ రాంమూర్తి, ఆర్‌వీఎం పీఓ గోవిందరాజులు, ఎం పీపీ సుకన్య, తహసీల్దార్ జ్యోతి, ఎంపీడీఓ గోపాల్‌నాయక్, సర్పంచ్ చంద్రయ్య పాల్గొన్నారు.