జిల్లాకు జ్వరమొచ్చింది. కొద్ది రోజులుగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. విషజ్వరాలు, అతిసారం, డెంగీ, మలేరియా వంటి వ్యాధులతో జనం మంచం పడుతున్నారు. సర్కారు ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందక ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఓవైపు రోగాలతో ఒళ్లు గుళ్లవుతుండగా, మరోవైపు వైద్య ఖర్చుల కోసం జేబులు ఖాళీ అవుతున్నాయి. జిల్లాలో నెల రోజుల్లో ఇరవై మందికి పైగా మృత్యువాతపడ్డారు. అయినప్పటికీ అధికార యంత్రాంగం అప్రమత్తం కాకపోవడంతో వారికి ప్రజారోగ్యం పట్ల ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్థమవుతోంది.
- న్యూస్‌లైన్, కరీంనగర్ హెల్త్
రోజుకు రూ.వెయ్యి ఖర్చు..
నాకు 25 రోజుల క్రితం జ్వరం వచ్చింది. గత ఆదివారం ప్రభుత్వాసుపత్రిలో చేరాను. డాక్టర్లు డెంగీ వచ్చిందని చెప్పారు. వైద్య పరీక్షలకే రూ.20వేలకు పైగా ఖర్చయింది. ఇతర ఖర్చులు రోజుకు వెయ్యి అవుతున్నాయి.
- రాజ్‌కుమార్, డిగ్రీ విద్యార్థి, ధర్మపురి
పొట్టనపెట్టుకున్న మలేరియా..
వెల్గటూర్ మండలం కొత్తపేటకు చెందిన కుష్నపెల్లి సత్తమ్మ(28)కు పదిరోజుల క్రితం జ్వరం రాగా ఆర్‌ఎంపీ వద్ద వైద్యం చేయిం చుకుంది. అయినా తగ్గకపోవడంతో బంధువులు ఆమెను వారం రోజుల క్రితం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల్లో మలేరియా వచ్చినట్లు తేలింది. చేతులెత్తేసిన ్రైపైవేట్ వైద్యులు ఆమెను మూడు రోజుల క్రితం ప్రభుత్వాసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడా సరైన వైద్యం అందక సత్తమ్మ శనివారం చనిపోయింది. భర్త వెంకటేష్ దుబాయ్ వెళ్లగా, కుట్టుపని చేసుకుంటూ పిల్లలను పోషించుకునేది. తల్లి మృతితో అరవింద్, వంశీ దిక్కులేనివారయ్యారు.
ఆసుపత్రిలోనే రంజాన్
ఎన్టీపీసీకి చెందిన ఎండీ.సుమోరా(12)కు వారం రోజుల క్రితం జ్వరంరాగా గోదావరిఖని ప్రభుతాస్పత్రిలో చూపించారు. డెంగీ, మలేరియా వల్ల రక్తకణాలు 40వేలకు పడిపోయినట్లు వైద్యులు చెప్పారు. దీంతో సుమోరానుగురువారం కరీంనగర్ ఆస్పత్రిలో చేర్పించారు. రంజాన్ పండగ హాస్పిటల్లోనే గడిచిందని,ఇప్పటికే పది వేలు ఖర్చయ్యాయని ఆమె తండ్రి అబ్దుల్‌కరీం తెలిపారు.
కరీంనగర్ హెల్త్, న్యూస్‌లైన్: ఇటీవల జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. వరదలు ముంచెత్తాయి. ఎడతెగని ముసురు వల్ల పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. దీనికితోడు కలుషిత నీరు, వాతావరణంలో వస్తున్న మార్పుల ప్రభావంతో వ్యాధులు ప్రబలుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. వ్యాధులు ఇంకా తీవ్రమయ్యే అవకాశాలున్నాయని, వెంటనే పారిశుధ్య నిర్వహణపై దృష్టి సారిస్తే తప్ప పరిస్థితి అదుపులోకి రాదని పేర్కొంటున్నారు. అయితే వర్షాకాలం ప్రారంభంలోనే పారిశుధ్యం, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన జిల్లా యంత్రాంగం పట్టించుకోలేదు. దోమల వల్ల వచ్చే వ్యాధులు, అంటురోగాల గురించి విసృతంగా ప్రచారం చేయాల్సి ఉండగా ప్రకటనలకే పరిమితమయ్యారు.
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రతి మంగళవారం డ్రైడేగా పాటించాలనే ఆదేశాలను క్షేత్రస్థాయిలో బేఖాతరు చేస్తున్నారు. అధికారులంతా ఎన్నికల హడావుడిలో పడి ప్రజారోగ్యాన్ని విస్మరించారనే విమర్శలున్నాయి. జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య బాధ్యతలు చేపట్టి రెండు నెలలవుతున్నా ఇంతవరకు నగరంలోని ప్రభుత్వాసుపత్రిని సందర్శించలేదు.
దీంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలందించడంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సామాజిక, ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసేవలు కరువయ్యాయి. వైద్య సిబ్బంది కొరత, ఉన్నవారు స్థానికంగా నివాసం ఉండకపోవడం, గైర్హాజరు కావడం, మందుల సరఫరా లేకపోవడం వల్ల ప్రభుత్వాసుపత్రుల్లో రోగుల పరిస్థి తి దయనీయంగా మారింది. పలువురు రోగులు స్థాని కంగా ఉన్న ఆర్‌ఎంపీలు, పీఎంపీల వద్ద చికిత్స పొందు తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.
గ్రామీణ ప్రాం తాల నుంచి రోజుకు వందల సంఖ్యలో రోగులు నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రికి వస్తున్న పేద రోగులను సరిగా పట్టించుకోకుండా మెరుగైన వైద్యసేవల కోసమంటూ వరంగల్ ఎం జీఎంకు, ఇతర ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. రక్త, మూత్ర పరీక్షలు, స్కానింగ్‌ల పేరిట ఆసుపత్రుల్లో అందినంత దోచుకుంటున్నారు. చిన్నపాటి జ్వరంతో వెళ్లినా డాక్టర్ ఫీజు రూ.150, వైద్య పరీక్షలకు రూ.500, మందులు రూ.500.. మొత్తం రూ.1500 వరకు గుంజుతున్నారని రోగులు పేర్కొంటున్నారు. అప్పటికీ నయం కాకుంటే ఇన్‌పేషంట్లుగా చేర్చుకుంటున్నారు. రక్తకణాలు తగ్గాయంటూ వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో దోపిడీని నియంత్రించినా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అసలే పట్టించుకోవడం లేదు.
రూ.40వేలు ఖర్చయినా నయం కాలేదు..
మాది వీణవంక మండలం బేతిగల్. నేను నా భార్య కూలి పనులకు పోతం. నాకు పదిహేను రోజుల కిందట జ్వరమొచ్చింది. ఆర్‌ఎంపీ దగ్గర మందులు వాడినా తగ్గలే. జమ్మికుంటల ఓ ప్రైవేట్ దావఖానకు పోయిన. డాక్టర్లు అన్ని ప రీక్షలు టైఫాయిడ్ వచ్చిందన్నరు. మూ డ్రోలు బెడ్‌పైన ఉంచుకున్నరు.
పదిహే ను వేలు ఖర్చయింది. అక్కడ తగ్గలేదని ఇంకో హాస్పిటల్‌ల చేరిన. మలేరియా, టైఫాయిడ్ వచ్చిందని చెప్పిండ్రు. అక్కడ నాలుగు రోజులున్న. పదహారు వేలు ఒడిసినయి. అప్పటికీ జ్వరం తగ్గకుంటే వరంగల్‌ల ప్రయివేట్ హాస్పిటల్లో చూపించుకున్న. అక్కడ ఆరువేలు ఖర్చయింది. ఇప్పటికే అక్కడా ఇక్కడా అప్పులు చేసిన. ఇక అప్పు కూడా పుట్ట క ఇంటికచ్చిన. ఆరోగ్య కేంద్రం డాక్టర్లు, ఏఎన్‌ఎంలు మా దిక్కు వచ్చుడే లేదు. ఏం చేసుడో.. ఎట్ల బాగైతనో..
- న్యూస్‌లైన్, వీణవంక
ప్రాణాలు హరీ
Published Mon, Aug 12 2013 6:06 AM | Last Updated on Sat, Sep 15 2018 8:23 PM
Advertisement
Advertisement