ఏటూరునాగారం/కమలాపురం, న్యూస్‌లైన్ : ఏజెన్సీ ప్రాంతాలు జ్వరాలతో వణికిపోతున్నారుు. సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండడంతో ఏటూరునాగారం మండల పరిధిలోని గొత్తికోయల గూడేలు, కమలాపురం శివారు గ్రామాలు మంచం పట్టారుు. చింతలపాడులో పోడెం జోగి, మూడేళ్ల చిన్నారి సునీతతోపాటు గుర్రాలబావి గొత్తికోయగూడెంలో పలువురు జ్వరంతో విలవిల్లాడుతున్నారు. గుర్రాలబావిలో ఇటీవల ఓ చిన్నారి పాముకాటుకు గురై మృతి చెందిన విషయం తెలిసిందే. సకాలంలో వైద్యం అందక ఆమె మృత్యువాత పడింది. అరుునా ఏటూరునాగారం గిరిజన సమగ్రాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పరిధిలోని వైద్య, ఆరోగ్య శాఖ పట్టించుకున్న దాఖలాలు కనబడడం లేదు.
ఇందుకు గుర్రాలబావిలో జ్వరంతో బాధపడుతున్న మండకం సోమి మాటలే నిదర్శనంగా నిలుస్తున్నారుు. ‘మూడు రోజులుగా జ్వరంతో అల్లాడుతున్నా... నర్సు గానీ... ఏ ఒక్కరూ గానీ ఇటు వచ్చిన పాపాన పోలేదు. రోడ్డు మార్గం సరిగ్గా లేకపోవడంతో డొల్లాలే దిక్కవుతున్నారుు. దీంతో ఆస్పత్రికి వెళ్లాలనిపించడం లేదు.’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఏటూరునాగారం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న చింతలపాడు... చెల్పాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోకి వస్తుంది. గుర్రాలబావి సైతం చెల్పాక పీహెచ్‌సీ పరిధిలోనే ఉంది. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నప్పటికీ... ప్రజలను అప్రమత్తం చేయాల్సిన వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండడంతో గిరిజనులకు సకాలంలో వైద్యం అందకుండా పోతోందని వారి ఆవేదనను బట్టి ఇట్టే గ్రహించవచ్చు.
మంచం పట్టిన ఏజెన్సీ
Published Sat, Aug 10 2013 4:51 AM | Last Updated on Sat, Sep 15 2018 8:23 PM
Advertisement