సాక్షి, హైదరాబాద్: సీజనల్ వ్యాధుల నివారణ లక్ష్యంగా పు రపాలక శాఖ ఆధ్వర్యంలో శ్రీ కారం చుట్టిన ‘ప్రతి ఆదివారం– పది గంటలకి –పది నిమిషాలు’ కార్యక్రమంలో రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులందరూ పాల్గొనడంతో పాటు ప్రజలు పాల్గొనేలా ప్రోత్సహించాలని ఆ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. వర్షాకాలంలో ప్రబలే డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులను నివారిద్దామని కోరారు. రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులందరికీ మంత్రి కేటీఆర్ ఆదివారం లేఖ రాశారు. సీజనల్ వ్యాధుల నివారణకు కట్టుదిట్టమైన ప్రణాళికతో సిద్ధంగా ఉన్నామని ఈ లేఖలో తెలిపారు. కరోనాపై చేస్తున్న స మష్టి పోరాటం వల్ల ప్రజారో గ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై అందరిలో అవగాహన పెరిగిందన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు విజృంభించ కుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే అదేశించారని, పట్టణ ప్రగతిలో భాగంగా భారీ ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టామన్నారు.
దోమల నివారణకు జాగ్రత్తలు పాటిస్తే ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చన్నారు. ఇందుకోసం వారానికి కనీసం 10 నిమిషాలను మన కోసం, మన పరిసరాల పరిశుభ్రత కోసం కేటాయించాలని నిర్ణయించామన్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు ఆరోగ్య శాఖ సహకారంతో పురపాలక శాఖ ఒక క్యాలెండర్ రూపంలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందన్నారు. ఇందులో భాగంగా కీటక నివారిణిల వినియోగం, దోమల నిర్మూలనకు మలాథియాన్ స్ప్రే, ఆయిల్ బాల్స్, ఫాగింగ్ చేయాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని వారానికోసారి స్ప్రే చేస్తున్నామన్నారు. మురికి కాల్వల పూడిక తీత, లోతట్టు ప్రాంతాల్లో నిలిచి న నీటిని ఎత్తిపోయడం, రోజూ చెత్త తరలింపును పకడ్బందీగా నిర్వహించాలని పురపాలికల ను ఆదేశించామన్నారు.
ఆదివారం శుభ్రత కోసం..
మన ప్రజలను, పట్టణాలను కా పాడుకునే కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములు చేసేందుకు గత వారం ‘ప్రతి ఆదివారం –పది గంటలకు–పదినిమిషాలు’ కార్యక్రమాన్ని ప్రారంభించామని,. రానున్న పదివారాల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నా రు. శాసన సభ్యులు ముందుగా ఈ కార్యక్రమాన్ని తమ ఇళ్ల నుంచే ప్రారంభించాలని, తర్వాత తమ పరిధిలోని పట్టణాల్లో విస్తృతంగా తిరుగుతూ ఆరోగ్యంపై ప్రజల్లో చైతన్యం కల్పించాలన్నారు.
డాక్యుమెంట్ రైటర్స్ రూ.4లక్షల విరాళం
ముఖ్యమంత్రి సహాయనిధికి తెలంగాణ డాక్యుమెంట్ రైటర్స్ సంక్షేమ సంఘం రూ. 4 లక్షల విరాళాన్ని అందించింది. ఆదివారం రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డితో కలిసి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివనాగేశ్వర్‌రావు, ప్రధాన కార్యదర్శి మురళి కృష్ణమాచారి తదితరులు ప్రగతి భవన్‌లో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు చెక్కును అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment