హైదరాబాద్ : ఆసుపత్రుల యాజమాన్యాలు జైళ్లలో వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని చంచల్‌గూడ పురుషుల జైలు సూపరింటెండెంట్ బచ్చు సైదయ్య అన్నారు.
నగరానికి చెందిన ఓ డెంటల్ ఆస్పత్రి యాజమాన్యం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సైదయ్య ప్రారంభించారు. ఈ శిబిరంలో 165 మంది ఖైదీలు దంత సమస్యలపై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఖైదీలను భారీ సంఖ్యలో ఆసుపత్రులకు తరలించడంతో ఇబ్బందులు తలెత్తేవన్నారు. ఈ వైద్య శిబిరాలతో ఆ సమస్య కొంత వరకు తీరిందన్నారు.
చంచల్‌గూడ జైల్లో వైద్య శిబిరం
Published Sun, Nov 27 2016 6:51 PM | Last Updated on Sat, Jul 28 2018 6:26 PM
Advertisement
Advertisement