
ఆదిలాబాద్ లో ఆప్టా మెగా వైద్య శిబిరం
అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్టా) అధ్వర్యంలో మహత్మా గాంధీ జయంతి సందర్బంగా ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల గిరిజన గ్రామం రాజురా లో అక్టోబర్ నెల 2వ తేదిన ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనుంది. స్థానిక ప్రభుత్వ హైస్కూల్ లో ఆదివారం ఉదయం 8 గంటల నుండి సాయుంత్రం 4 గంటల వరకు ప్రముఖ వైద్యలు తమ సేవలను అందజేస్తారు. స్థానిక డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ కృష్ణం రాజు, డాక్టర్ రామకృష్ణ లతో సహా.. 20 మంది వైద్యులు.. ఇతర సిబ్బంది కార్యక్రమంలో పాల్గొంటారు. అన్ని రకాల వ్యాధులకు వైద్య సేవలు, మందులు ఉచితంగా ఇవ్వనున్నారు. కార్యక్రమంలో భాగంగా ఉచిత భోజన వసతి ఉంటుందని ఆప్టా అధ్యక్షులు గూడపాటి గోపాల కృష్ణ గూడపాటి తెలిపారు.
ఈ శిబిరానికి కావాల్సిన ఆఫ్టా మెడికల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ చైర్ డాక్టర్ కొత్తపల్లి కుమార్, వైస్ చైర్ డాక్టర్ రగుతూ సూర్య లు పంపిణీ చేయనున్నారు. ఎన్నారై పన్నెల జనార్ధన్ శిబిరానికి అవసరం అయిన సహాయ సహకారాలు అందిస్తున్నారని వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే రేఖాశ్యామ్ నాయక్ పాల్గొనున్నారు.