
విష జ్వరాలతో 50 మందికి అస్వస్థత
శ్రీకాకుళం (కంచిలి) : శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం మఖరాంపురం గ్రామంలో శుక్రవారం 50 మంది అస్వస్థతకు గురయ్యారు. గత వారం రోజులుగా గ్రామంలో సుమారు 50 మంది విషజ్వరాలతో బాధపడుతున్నారు. విషయం తెలిసిన ప్రభుత్వ వైద్యాధికారులు శుక్రవారం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రోగులకు చికిత్సనందించి మందులు పంపిణీ చేస్తున్నారు.