శ్రీశైలం ప్రాజెక్టు : సున్నిపెంట గ్రామంలో జ్వర పీడితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఆసుపత్రులలో ఎక్కడ చూసినా జ్వరం బారిన పడిన రోగులే కనిపిస్తున్నారు. మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో దాదాపుగా ప్రతి ఇంటిలో ఒకరు బాధపడుతున్నారు. ఫ్రభుత్వాసుపత్రులే కాకుండా ప్రైవేటు ఆసుపత్రులు కూడా కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ వైద్యశాలలో, మలేరియా కార్యాలయంలో మలేరియా రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. టైఫాయిడ్ నిర్థారణ కోసం జ్వర పీడితులు ప్రైవేటు ల్యాబోరేటరీలను ఆశ్రయించక తప్పడం లేదు. జిల్లా మలేరియా అధికారి ఆదేశాల మేరకు సున్నిపెంటలో రెండవ విడత డీడీటీ స్ప్రేయింగ్‌ను చేస్తున్నారు.
మలేరియా అధికారిణి ఇ హుసేనమ్మ పర్యవేక్షణలో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి జ్వరపీడితుల రక్తనమూనాలను సేకరించి పరీక్షలు చేస్తున్నారు. నిరుపేదలు టైఫాయిడ్ టెస్ట్‌ల కోసం ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయించలేక ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా సభ్యులు ఎన్ ఎస్ వకీల్ ఈ మేరకు టైఫాయిడ్ టెస్ట్‌లను కూడా ఉచితంగా ప్రభుత్వ వైద్యశాలలో చేయాలని, కాలనీలో వ్యాధులను నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలనీ అంతటా హెల్త్ ఇన్స్పెక్టర్ టి నాగరాజు, మలేరియా సర్వేలైన్ ఇన్‌స్పెక్టర్లు పి వీరన్న, నరసింహరావు, హెల్త్ అసిస్టెంట్లు బాలనరసయ్య రాములు నాయక్ తదితరులు ఇంటింటికీ వెళ్లి రక్త నమూనాలు సేకరిస్తున్నారు.
వణికిస్తున్న జ్వరాలు
Published Fri, Aug 21 2015 7:09 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement