తెర్నెకల్‌లో ప్రబలిన అతిసార
తెర్నెకల్(దేవనకొండ) : మండలంలోని తెర్నెకల్ గ్రామంలో శుక్రవారం అతిసార వ్యాధి ప్రబలడంతో 50 మంది అస్వస్థతకు గురయ్యారు. గ్రామానికి చెందిన పెద్దయ్య, కంసలి లక్ష్మి, కళావతి, వెంకటేశ్వరమ్మ, వీరేష్, చాకలి బడేసాబ్‌తో పాటు మరో 44 మందికి వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరందరూ స్థానిక ఆర్‌ఎంపీ వద్దనే చికిత్సలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ వైద్యసిబ్బంది గ్రామంలో ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేసి అతిసార వ్యాధిని నియంత్రించాలని గ్రామస్తులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.