
చిత్తూరు అర్బన్: 55 రోజులు.. 760కి పైగా కిలో మీటర్ల దూరం. అతడే ఓ సైన్యంలా నడిచి వస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభిమానుల కోసం వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి పాకాల శివార్లలో చంద్రగిరి ఎమ్మెల్యే, రాష్ట్ర వైఎస్సార్‌సీపీ సేవాదళ్ అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని పార్టీ నాయకులు, ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు.
పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వందల సంఖ్యలో నడుచుకుంటూ వస్తున్నారు. వీరికి కనీస వైద్య పరీక్షలు నిర్వహించడానికి చెవిరెడ్డి భాస్కరరెడ్డితో పాటు ఆయన స్నేహితుడు డాక్టర్ బి హేమకుమార్‌రెడ్డి సంకల్పించి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పాదయాత్రలో పాల్గొన్న వారికి శని, ఆదివారాలు రక్త పరీక్షలు, మధుమేహం, ఇతర పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, డాక్టర్ శివాజీరెడ్డితో పాటు ఇతర వైద్యులు హరిబాబు, గంగిరెడ్డి, శ్రీనివాసరావు, మధుసూదన్‌రెడ్డి, రమేష్, వరప్రసాద్, సుబ్రమణ్యంరెడ్డి, వెంకటేష్, గణేష్‌రెడ్డి, కళ్యాణ్ చక్రవర్తి తదితరులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment