
సందేశాత్మక లఘు చిత్రాలు, మ్యూజిక్ వీడియోస్‌తో ఆకట్టుకున్న దర్శకుడు డాక్టర్ ఆనంద్ చిన్నారులు, దివ్యాంగులు, అనాథ పిల్లల కోసం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. జనయిత్రి ఫౌండేషన్ మరియు బంజారా మహిళా యన్.జీ వొ సంయుక్తంగా డాక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని బోడుప్పల్ ,పీర్జాది గూడా ప్రాంతంలో వున్న దివ్యాంగులు, అనాథ పిల్లల కోసం ఒక ఉచిత వైద్య శిబిరాన్ని ఈ రోజు నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. ‘డాక్టర్ కావ్య (గైనకాలజిస్ట్), డాక్టర్ మధు( ఫిజీషియన్), డాక్టర్ అర్జున్ (డెంటిస్ట్) కలిసి, దాదాపు 200 మంది చిన్న పిల్లలకు వైద్య పరీక్షలతో పాటు, రక్త పరీక్షలను కూడా నిర్వహించినట్లుగా తెలిపారు. ముఖ్యంగా ఆటిజం, బాధిర్యం, మానసిక ఎదుగుదల లోపం, అంధత్వం, మస్తిష్క పక్షవాతం లాంటి సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు, వారి తల్లి తండ్రులకు సహాయ సహకారాలను అందిచామ’ని తెలిపారు.
ఇలాంటి కార్య క్రమాల ద్వారా ఎంతో మంది చిన్నారులకు లబ్ది చేకూరుతుందని, మరెన్నో కార్యక్రమాలను దేశ మంతటా నిర్విస్తున్నట్లు డాక్టర్ ఆనంద్ తెలియ చేసారు. బీహార్ చిన్న పిల్లల కోసం, ఒడిషా ఫాని తుఫాను బాధితుల కోసం పలు వైద్య శిబిరాలను నిర్వహించిన ఆనంద్‌ను ఇటీవల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment