
ఇషాంత్‌కు చికున్‌గున్యా
తొలి టెస్టుకు దూరం
కాన్పూర్: భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ ప్రస్తుతం చికున్‌గున్యాతో బాధపడుతున్నాడు. దీంతో తను రేపటి (గురువారం) నుంచి న్యూజిలాండ్‌తో జరిగే తొలి టెస్టుకు దూరం కానున్నాడు. అరుుతే ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్టు చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే తెలిపారు. ‘ఇషాంత్ చికున్‌గున్యా కారణంగా తొలి టెస్టు ఆడడం లేదు. అతడి స్థానంలో మరో ఆటగాడిని కూడా మేం కోరలేదు. మిగతా 14 మంది ఆటగాళ్ల నుంచే తుది జట్టును ఎన్నుకుంటాం’ అని కుంబ్లే వివరించారు. ఒకవేళ జట్టు ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగితే షమీ, భువనేశ్వర్ ఆడే అవకాశం ఉంది.