బుల్లితెర నటికి చికెన్‌ గున్యా | TV Actress Mahhi Vij Diagnosed with Chikungunya | Sakshi
Sakshi News home page

తండ్రి కోసం అన్నీ తానై.. ఇంతలోనే నటికి చికెన్‌ గున్యా

Published Fri, Oct 4 2024 8:20 PM | Last Updated on Fri, Oct 4 2024 9:03 PM

TV Actress Mahhi Vij Diagnosed with Chikungunya

బుల్లితెర నటి మహి వీజ్‌ అనారోగ్యం పాలైంది. గత కొద్ది రోజులుగా తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న ఆమెకు చికెన్‌ గున్యా సోకింది. ప్రస్తుతం ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఈమేరకు హాస్పిటల్‌ బెడ్‌పై ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది.

లైఫ్‌లోనే కఠినమైన రోజులు..
కాగా కొద్ది రోజుల క్రితం నటి.. తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదని పేర్కొంది. ఈమేరకు ఓ వీడియోను తన అభిమానులతో పంచుకుంది. ఈ పది రోజులు నా జీవితంలోనే ఎంతో కఠినతరమైనవి. నాకన్నీ చేసిపెట్టే నాన్న ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. వీలైనంతవరకు నేను తనతోనే ఉంటున్నాను. అతడు తిరిగి మామూలుగా నడిచేందుకు ఎంకరేజ్‌ చేస్తున్నాను. 

తెలుగులో హీరోయిన్‌గా..
పేరెంట్స్‌కు పిల్లలను చూస్తేనే సగం జబ్బు నయమైపోతుంది. నా తండ్రి కోసం నెలల తరబడి ఆయన వెన్నంటే ఉంటున్నందుకు గర్వంగా ఉంది. నీ వెంట నేనున్నాను నాన్నా.. లవ్యూ అని రాసుకొచ్చింది. మహి వీజ్‌.. తెలుగులో తపన అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. బాలికా వధు, లాగి తుజ్‌సే సీరియల్స్‌ ద్వారా గుర్తింపు పొందింది. 2011లో జై భానుషాలిని పెళ్లాడింది. వీరికి తారా అనే కూతురు పుట్టింది. అలాగే రాజ్‌వీర్‌ అనే బాబును పెంచుకుంటున్నారు.

 

 

చదవండి: ఆదిత్య రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా? వాళ్ల కంటే ఎక్కువే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement