బిగ్‌బాస్‌ ద్వారా ఆదిత్య ఎంత సంపాదించాడంటే? | Bigg Boss Telugu 8: Aditya Om Remuneration Details | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Telugu: ఆదిత్య రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా? వాళ్ల కంటే ఎక్కువే!

Published Fri, Oct 4 2024 4:48 PM | Last Updated on Fri, Oct 4 2024 6:04 PM

Bigg Boss Telugu 8: Aditya Om Remuneration Details

బిగ్‌బాస్‌ ఎనిమిదవ సీజన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ అన్‌లిమిటెడ్‌ అన్నారు కానీ హౌస్‌మేట్ల గిల్లికజ్జాలు, సోదిముచ్చట్లు చూస్తుంటే ప్రేక్షకులకు కూడా అసహనం, చిరాకు అన్‌లిమిటెడ్‌గానే వస్తోంది. నెల రోజుల్లోనే మొహం మొత్తేస్తే కష్టమని భావించిన బిగ్‌బాస్‌ టీమ్‌ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలను దింపుతోంది. ఎనిమిది మందిని హౌస్‌లోకి ఒకేసారి పంపించనుంది.

ఆదిత్య ఓం అవుట్‌
ఇందుకోసం పెద్దగా కంటెంట్‌ ఇవ్వని కంటెస్టెంట్లను డబుల్‌ ఎలిమినేషన్‌ ద్వారా బయటకు పంపించేయాలని ప్లాన్‌ చేశారు. అనుకున్నట్లుగానే సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతున్న మంచి మనిషి ఆదిత్య ఓంను వారం మధ్యలోనే ఎలిమినేట్‌ చేసేశారు. ఈయన నాలుగున్నర వారాలపాటు హౌస్‌లో ఉన్నాడు.

ఎంత సంపాదించాడంటే?
హీరోగా జనాలకు సుపరిచితుడైన ఆదిత్యను ఈ షోకి తీసుకువచ్చేందుకు భారీగానే ఆఫర్‌ చేశారట! వారానికి రూ.3 లక్షల పారితోషికం ఇచ్చారట! ఈ లెక్కన నాలుగున్నర వారాలకుగానూ దాదాపు రూ.14 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎలిమినేట్‌ అయిన బేబక్క, బాషా, అభయ్‌ నవీన్‌, సోనియా ఆకుల కంటే కూడా ఆదిత్యే ఎక్కువ రెమ్యునరేషన్‌ అందుకున్నట్లు భోగట్టా!

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement