
డెహ్రాడూన్: మే 15 నుంచి ప్రముఖ విష్ణ ఆలయం బద్రినాధ్ పుణ్యక్షేత్రం తెరుచుకోనుంది. మే15 ఉదయం 4:30 గంటలకు బద్రీనాధ్ ఆలయ ద్వారాలు తెరవడం జరుగుతుందని ఉత్తరఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ గత నెలలోనే ప్రకటించారు. ఆరు నెలల తరువాత మంచు కరిగి ఆలయం కనిపించడంతో మళ్లీ ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. అయితే ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకుడితో కలిపి కేవలం 27 మందిని మాత్రమే అనుమతించనున్నారు. (కరోనా క్యాబ్లు వచ్చేశాయ్!)
కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో భక్తులను ఎవరిని ఆలయంలోకి అనుమతించడం లేదని చమోలీ సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ అనిల్ ఛన్యాల్ తెలిపారు. ‘గాడు గాథ’ సంప్రదాయం ప్రకారం స్వామి వారికి నువ్వుల నూనెతో చేసే కైంకర్యాలను కూడా గత వారం నిర్వహించారు. ఆరు నెలల విరామం తరువాత కేథరినాధ్, బద్రినాధ్ ఆలయాలు తెరుచుకోబడ్డాయి. మంచు కారణంగా ఈ ఆలయాలు ఆరు నెలల పాటు ప్రతి యేడాది మూసివేయబడతాయనే విషయం తెలిసిందే. (కరోనా సాకుతో ఇంత అన్యాయమా?)