
ఈ రోజు శ్రావణమాసం(ఉత్తరాదివారికి)లోని తొలి సోమవారం. నేడు మహాశివునికి ప్రీతిపాత్రమైన రోజుగా భావిస్తారు. అందుకే కేదార్‌నాథ్‌కు భక్తులు పోటెత్తుతున్నారు. ఈరోజు మహేశ్వరుణ్ణి దర్శించుకుని పూజలు చేయాలని భక్తులు అభిలషిస్తున్నారు.
ఈరోజు ఉత్తరాఖండ్‌లోని కేదారేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు నిన్నరాత్రి నుంచే భక్తులు బారులు తీరారు. ధామ్ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ, భక్తులు మహాశివుని దర్శనం కోసం క్యూలో వేచివుంటున్నారు. ఉత్తరాదిన శ్రావణమాసం జూలై 22 నుండి ప్రారంభమై, ఆగస్టు 19 వరకూ ఉంటుంది. ఈసారి శ్రావణ మాసంలో ఐదు సోమవారాలు ఉన్నాయి. ఈ రోజుల్లో భక్తులు మహాశివుణ్ణి పూజిస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment