Badrinath shrine
-
Char Dham Yatra: ‘ఛార్‌ధామ్’కు మంచు తిప్పలు
గోపేశ్వర్: ఛార్‌ధామ్ యాత్ర మొదలుకానున్న నేపథ్యంలో విచ్చేసే లక్షలాది మంది భక్తులు, సందర్శకుల సౌకర్యార్థం చేపట్టిన మౌలికసదుపాయాలు తదితర సన్నాహక కార్యక్రమాలకు మంచు అడ్డుపడుతోంది. గురువారం భద్రీనాథ్, కేదార్నాథ్ పర్వతప్రాంతాల్లో విపరీతంగా మంచు కురిసింది. లోయ ప్రాంతాలను వర్షం ముంచెత్తింది. ఈ ఆలయాలు కొలువుతీరిన ఛమోలీ, రుద్రప్రయాగ్ జిల్లాల్లో మంచు, వర్షం, అతిశీతల గాలులు ఉష్ణోగ్రతలను తగ్గించేస్తున్నాయని అధికారులు తెలిపారు. మరో నాలుగు రోజుల్లో భక్తులను కేదార్నాథ్ ఆలయ దర్శనానికి అనుమతించనున్న ఈ తరుణంలో గుడికి వెళ్లే ట్రెక్ మార్గంలో మంచు పడుతోంది. అక్షయ తృతీయను పురస్కరించు కుని ఈనెల 22వ తేదీన గంగోత్రి, యము నోత్రి ఆలయాలు తెరుచు కోను న్నాయి. కేదార్నాథ్ ఆల యాన్ని 25వ తేదీన, భద్రీనాథ్ ఆలయాన్ని ఈనెల 27వ తేదీన భక్తుల సందర్శనార్థం తెరుస్తారు. లక్షలాది మంది ఛార్‌ధామ్ యాత్రకు తరలివస్తున్న ఈ సమయంలో మంచు ముంచుకురావడంపై స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. -
తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం.. కానీ
డెహ్రాడూన్ : పవిత్ర పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయం తెరుచుకుంది. నేడు ( శుక్రవారం) ఉదయం 4:30 నిమిషాలకు వేద మంత్రాలతో ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. అనంతరం ఆలయాన్ని పూలతో సుందరంగా అలంకరించి అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాన పూజారితో సహా మొత్తం 28 మంది మాత్రమే ఆలయం తలుపులు తెరుచుకున్నప్పుడు బద్రీనాథుని సన్నిధిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే కరోనా కారణంగా దేవాలయాలన్నీ మూతపడిన విషయం తెలిసిందే. (చైనా నుంచే వ్యాప్తి: భయపెడుతున్న స్వైన్ ఫీవర్) కాగా ప్రస్తుతం పవిత్రక్షేత్రంలోకి భక్తులను అనుమంచడం లేదు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఆదేశాల మేరకు భక్తులను ఎవరిని ఆలయంలోకి అనుమతించడం లేదని చమోలీ సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ అనిల్ ఛన్యాల్ తెలిపారు. శీతాకాల విరామం తరువాత ఏప్రిల్ 29న మొదట ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. అయితే కరోనా కారణంగా ఏ యాత్రికుడిని ఆలయంలోకి అనుమంతించలేదు. యత్రికులు లేకుండానే పంచముఖి డోలీ యాత్ర నిర్వహించారు. గత సంవత్సరం ఆలయం తెరిచిన మొదటి రోజు 10 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కాని లాక్డౌన్ కారణంగా ఈ సంవత్సరం భక్తుల ప్రవేశానికి అనుమతి ఇవ్వలేదు. ఆ పుణ్యక్షేత్రాల దర్శన భాగ్యం లేనట్టేనా! -
ఆ పుణ్యక్షేత్రాల దర్శన భాగ్యం లేనట్టేనా!
డెహ్రాడూన్: మే 15 నుంచి ప్రముఖ విష్ణ ఆలయం బద్రినాధ్ పుణ్యక్షేత్రం తెరుచుకోనుంది. మే15 ఉదయం 4:30 గంటలకు బద్రీనాధ్ ఆలయ ద్వారాలు తెరవడం జరుగుతుందని ఉత్తరఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ గత నెలలోనే ప్రకటించారు. ఆరు నెలల తరువాత మంచు కరిగి ఆలయం కనిపించడంతో మళ్లీ ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. అయితే ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకుడితో కలిపి కేవలం 27 మందిని మాత్రమే అనుమతించనున్నారు. (కరోనా క్యాబ్‌లు వచ్చేశాయ్!) కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో భక్తులను ఎవరిని ఆలయంలోకి అనుమతించడం లేదని చమోలీ సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ అనిల్ ఛన్యాల్ తెలిపారు. ‘గాడు గాథ’ సంప్రదాయం ప్రకారం స్వామి వారికి నువ్వుల నూనెతో చేసే కైంకర్యాలను కూడా గత వారం నిర్వహించారు. ఆరు నెలల విరామం తరువాత కేథరినాధ్, బద్రినాధ్ ఆలయాలు తెరుచుకోబడ్డాయి. మంచు కారణంగా ఈ ఆలయాలు ఆరు నెలల పాటు ప్రతి యేడాది మూసివేయబడతాయనే విషయం తెలిసిందే. (కరోనా సాకుతో ఇంత అన్యాయమా?) -
చార్ ధాం యాత్ర : శ్రీకాకుళం వాసులు సురక్షితం
సాక్షి, ఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో మంచు తుపానులో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లా వాసులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. శ్రీకాకుళం, విశాఖ జిల్లాలకు చెందిన 66 మంది చార్ధామ్ యాత్రికులు మంగళవారం బద్రీనాథ్‌లో చిక్కుకుపోయారు. ఉదయం 7 గంటలకు బద్రీనాథ్ చేరుకోగా, ఎడతెరిపిలేని మంచు వర్షం కురిసిందని, దీంతో కొండ పైనే చిక్కుకుపోయామని యాత్రికుల బృందం తెలిపింది. చిమ్మచీకటిలో తాము మగ్గిపోయామని బాధిత యాత్రికులు తెలిపారు. తాము ప్రయాణించే బస్సు సైతం మంచులో కూరుకుపోయిందని పేర్కొన్నారు. మొత్తం 104 మంది యాత్రికులు ఏప్రిల్ 26న ఛార్‌ధామ్ యాత్రకు బయలుదేరి వెళ్లారు. చిక్కుకున్న జడ్పీ బృందం ఉత్తరాఖండ్ వెళ్లిన మరో 39 మందితో కూడిన జడ్పీటీసీలు, అధికారుల బృందం కూడా ఉత్తరాఖండ్‌లో చిక్కుకుపోయింది. శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి నేతృత్వంలో వీరంతా ఉపాధి హామీ పనుల పరిశీలన నిమిత్తం వెళ్లారు. మంచు వర్షం కారణంగా వీరంతా సీతాపురంలో చిక్కకుపోయారు. వీరంతా ఈ నెల 3న బయల్దేరి వెళ్లారు. మంచు తుపాను వర్షం నుంచి బయటపడి, సీతాపురంలో సురక్షితంగా ఉన్నామని ధనలక్ష్మి పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ భవన్ అడిషనల్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ ఎప్పటికప్పుడు సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించారు. -
బద్రీనాథా.. ఎంత కష్టమయ్యా..
ప్రొద్దుటూరు : చార్ధామ్ యాత్రకు వెళ్లిన ప్రొద్దుటూరు వాసులు భారీ వర్షాల కారణంగా బద్రినాథ్ పుణ్యక్షేత్రం సమీపంలో ఆగిపోయారు. వీరికి మూడు రోజుల పాటు సరిగా అన్నపానీయాలు కూడా లభించకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పైగా వీరిని తీసుకొచ్చేందుకు హెలికాప్టర్ పంపుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా ఇంత వరకు రాలేదని యాత్రికులు వాపోయారు. వివరాలిలా ఉన్నాయి. ప్రొద్దుటూరు పట్టణం మైదుకూరు రోడ్డులో ఉన్న శ్రీకాశిరెడ్డినాయన లారీ ట్రాన్స్‌పోర్టు యజమాని పోలక శివానందరెడ్డి (సున్నపుబట్టి వీధి)తోపాటు లారీ యజమానులైన అతని మిత్రులు ఉండేల మురళీమోహన్‌రెడ్డి (రామేశ్వరం), ఉండేల మునికుమార్‌రెడ్డి (రామేశ్వరం), కుడుముల గంగిరెడ్డి (మోడంపల్లి), ఆవుల నాగేశ్వరరెడ్డి (బాలాజీనగర్), దోసకాయల ప్రసాద్ (భగత్‌సింగ్ కాలనీ), శెట్టికుమార్ (బాలాజీనగర్), హనుమంతరెడ్డి (వైఎంఆర్ కాలనీ)లు చార్ధామ్ యాత్రకు ఈనెల 21న రాత్రి ఇన్నోవా వాహనంలో బయల్దేరి వెళ్లారు. వీరిలో శెట్టికుమార్ డ్రైవర్ కాగా హనుమంతరెడ్డి మాత్రం ట్రాన్స్‌పోర్టులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ముందుగా వారి అంచనా ప్రకారం ఈనెల 27వ తేదీ రాత్రికి ప్రొద్దుటూరుకు చేరాల్సి ఉంది. కొండ చరియలు విరిగిపడి.. కాగా ప్రొద్దుటూరు నుంచి వెళ్లిన వీరు గత బుధవారం బద్రినాథ్‌కు వెళుతుండగా మార్గమధ్యంలో భారీ వర్షాలు పడి కొండచరియలు విరిగి వీరి ఇన్నో వా వాహనంపై పడి అద్దం పగిలినట్లు వారు తెలిపారు. వర్షాల కారణంగా నదులు ప్రవహించడంతో రోడ్లు తెగిపో యి రాకపోకలు స్తంభించిపోయాయి. బద్రినాథ్ సమీపంలో 15 కిలోమీటర్ల దూరంలో వీరి ప్రయాణం ఆగిపోయింది. బుధవారం నుంచి శనివారం ఉదయం వరకు వీరు అక్కడే ఆగిపోయారు. విద్యుత్ సరఫరాలేకపోవడంతోపాటు అన్నపానీయాలు కూడా దొరక్క ఇబ్బందులు పడ్డారు. పరిస్థితి అ దుపులోకి రావడంతో శనివారం ఉద యం బద్రినాథ్‌కు వెళ్లి తిరుగు ముఖంపట్టారు. వీరి సమాచారాన్ని అందుకున్న రాష్ట్ర ప్రభుత్వం యాత్రికులను రక్షించేం దుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తమ వద్దకు హెలికాప్టర్ పం పుతామని ప్రకటించినా ఇక్కడకు రాలేదని శివానందరెడ్డి సాక్షికి తెలిపారు. రాకపోకలు పునఃప్రారంభమైతే తిరిగి ఇంటికి రాగలమని, తమకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వారు ఫోన్లో వివరించారు. కుటుంబ సభ్యుల ఆందోళన చార్ధామ్ యాత్రకు వెళ్లిన వీరు భారీ వర్షాల కారణం గా మధ్యలో ఇరుక్కోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ వారి పరిస్థితి ఎలా ఉందోనని సెల్ఫోన్ల ద్వారా సమాచారం తెలుసుకుంటున్నారు. కొన్ని మార్లు ఫోన్లు పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరుగుతోంది. నా భర్త సురక్షితంగా ఉన్నానని చెప్పాడు పరిస్థితి తెలియడంతో శని వారం నా భర్తకు ఫోన్ చేశా. ఆయన సురక్షితంగా ఉన్నట్లు తెలిపాడు. త్వరగా ఇంటికి వస్తానని చెప్పాడు. లక్ష్మి, దోసకాయల ప్రసాద్ భార్య మిత్రులకు ఫోన్ చేశాను భారీ వర్షాల కారణంగా చార్ధామ్ యాత్రలో ఆటంకాలు ఏర్పడుతున్నాయని తెలియడంతో నా మిత్రులందరికి ఫోన్ చేశాను. వారు సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. - నాగభూషణ్ రెడ్డి, కాశినాయనట్రాన్స్పోర్టు క్లర్క్