సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకనిర్మాత రాజ్‌కుమార్ కోహ్లి(93) ఇక లేరు. ముంబైలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. నేడు(నవంబర్ 24న) ఉదయం 8 గంటలకు స్నానం చేయడానికి బాత్రూమ్‌లోకి వెళ్లిన ఆయన ఎంతకూ బయటకు రాలేదు. దీంతో ఆయన కుమారుడు అర్మాన్ కోహ్లి తలుపు బద్ధలు కొట్టి లోనికి వెళ్లగా ఆయన నిర్జీవంగా కిందపడి ఉన్నారు. దర్శకుడి మరణంపై చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నేడు సాయంత్రం రాజ్‌కుమార్ కోహ్లి అంత్యక్రియలు జరగనున్నాయి.
ఈయన జానీ దుష్మణ్, రాజ్ తిలక్, విరోధి, నాగిన్, పతీ పత్నీ ఔర్ తవైఫ్ సహా తదితర చిత్రాలను డైరెక్ట్ చేశారు. అలాగే పంజాబ్, హిందీ భాషల్లో ఎన్నో సినిమాలు నిర్మించారు. బాలీవుడ్ స్టార్స్ అయిన సన్నీడియోల్, సునీల్ దత్, మిథున్ చక్రవర్తి, అనిల్ కపూర్ వంటి పలువురు హీరోలతో సినిమాలు చేశారు.
చదవండి: చివరి కెప్టెన్సీ టాస్క్.. ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్.. కెప్టెన్ ఎవరంటే?
Comments
Please login to add a commentAdd a comment