ప్రముఖ నిర్మాతకి బ్రేకప్ చెప్పిన భార్య.. విడాకుల తీసుకోబోతున్నారా? | Producer Bhushan Kumar Divorce Rumours With Wife Divya Khosla Kumar | Sakshi
Sakshi News home page

Divya Khosla Kumar: విడాకులపై రూమర్స్.. షాకింగ్ పోస్ట్ పెట్టిన బ్యూటీ

Published Sat, Feb 24 2024 9:58 PM | Last Updated on Sun, Feb 25 2024 12:50 PM

Producer Bhushan Kumar Divorce Rumours With Wife Divya Khosla Kumar - Sakshi

'ఆదిపురుష్'తో పాటు బాలీవుడ్‌లో బడా సినిమాలు తీస్తూ బిజీగా ఉన్న నిర్మాత భూషణ్ కుమార్. ఇప్పుడు ఈయన ఇంట్లోనే కలహాలు జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానమే గట్టిగా వినిపిస్తుంది. ఈయనకు భార్య దివ్య కోస్లా కుమార్ బ్రేకప్ చెప్పేసిందని టాక్ గట్టిగా వినిపిస్తుంది. తాజాగా జరుగుతున్న కొన్ని సంఘటనలు దీనికి బలం చేకూర్చుతున్నాయి. ఇంతకీ అసలేం జరుగుతోంది?

బాలీవుడ్ నిర్మాణ సంస్థల్లో టీ-సిరీస్ కాస్త ప్రత్యేకం. సినిమాల నిర్మాణం, ఆల్బమ్ సాంగ్స్, పాటలు ఇలా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని రంగాల్లోనూ ఈ సంస్థ రాణిస్తోంది. దీని మొత్తాన్ని భూషణ్ కుమార్ చూసుకుంటున్నారు. ఈయన 2005లోనే నటి దివ్య కోస్లాని పెళ్లి చేసుకున్నారు. వీళ్ల సంతానానికి గుర్తుగా 2011లో కొడుకు పుట్టాడు. అయితే ఓవైపు కుటుంబాన్ని చూసుకుంటూనే దివ్య.. నటి, నిర్మాత, దర్శకురాలిగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఈమె భర్తకి విడాకులు ఇచ్చేసిందని అంటున్నారు.

(ఇదీ చదవండి: షణ్ముక్ సోదరుడి మరిన్ని ఆగడాలు.. బాధితులు చాలామందే)

ఇన్ స్టాలో ఈమె అకౌంట్ పేరులో మొన్నటివరకు దివ్య కోస్లా కుమార్ అని ఉండేది. రెండు రోజుల క్రితం మాత్రం ఈ పేరులో భర్తకి సంబంధించిన 'కుమార్' పదాన్ని తొలగించింది. దీంతో భూషణ్ కుమార్‌కి దివ్య బ్రేకప్ చెప్పేసిందని విడాకులిచ్చేసిందని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే పేరు తీసేయడంతోపాటు టీ-సిరీస్ ఛానెల్‌ని అన్ ఫాలో చేయడం మరో కారణం.

అయితే దివ్య కోస్లా విడాకుల రూమర్స్‌పై టీ-సిరీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. జ్యోతిషుడు చెప్పడం వల్లే దివ్య తన పేరు నుంచి కుమార్ పదాన్ని తీసేశారనని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ జనాలకు ఇది నమ్మశక్యంగా అనిపించట్లేదు. తాజాగా తల్లి గురించి దివ్య పెట్టిన స్టోరీ చూస్తే విడాకులు నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే ‍'నీ గురించే ఆలోచిస్తున్నా నీకు చాలా విషయాలు చెప్పాలి' అని తల్లి ఫొటోకి క్యాప్షన్ పెట్టింది. దీంతో భూషణ్-దివ్య విడాకులు నిజమేనని అంటున్నారు. నిజమేంటనేది తెలియల్సి ఉంది.

(ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న హీరోయిన్ ప్రియమణి.. రేటు ఎంతో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement