ఆదిపురుష్‌ నిర్మాత సతీమణి ఇంట తీవ్ర విషాదం.. | Actress Divya Khosla Kumar Mother Anitha Passes Away | Sakshi
Sakshi News home page

Divya Khosla Kumar: లవ్‌ టుడే హీరోయిన్‌ ఇంట విషాదం.. మిస్‌ యూ అంటూ పోస్ట్‌

Jul 6 2023 6:46 PM | Updated on Jul 6 2023 7:00 PM

Actress Divya Khosla Kumar Mother Anitha Passes Away - Sakshi

నా మనసు ముక్కలైంది.. నా తల్లి నన్ను వదిలి వెళ్లిపోయింది. కానీ నా హృదయంలో మాత్రం పదిలంగా ఎప్పటికీ ఉండిపోతుంది. నీ ఆశీర్వాదాలను, నువ్వు నేర్పిన

ఆదిపురుష్‌ నిర్మాత భూషణ్‌ కుమార్‌ సతీమణి, నటి దివ్య ఖోస్లా కుమార్‌ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దివ్య తల్లి అనిత ఖోస్లా కన్నుమూసింది. ఈ విషయాన్ని నటి సోషల్‌ మీడియాలో వెల్లడిస్తూ భావోద్వేగానికి లోనైంది. 'అమ్మా.. నా మనసు ముక్కలైంది.. నా తల్లి నన్ను వదిలి వెళ్లిపోయింది. కానీ నా హృదయంలో మాత్రం పదిలంగా ఎప్పటికీ ఉండిపోతుంది.

నీ ఆశీర్వాదాలను, నువ్వు నేర్పిన విలువలను నాతో పాటే ఉంచుకుంటాను. నీకు కూతురిగా పుట్టినందుకు గర్విస్తున్నాను. లవ్‌ యూ మమ్మా.. ఇట్లు అనితా ఖోస్లా కూతురు' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన తల్లితో కలిసి ఉన్న ఫోటోలను షేర్‌ చేసింది. ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. పలువురు సెలబ్రిటీలు నటి తల్లి మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు.

కాగా దివ్య ఖోస్లా కుమార్‌.. లవ్‌ టుడే(2004) అనే తెలుగు సినిమాతో వెండితెరకు హీరోయిన్‌గా పరిచచయమైంది. ఆ తర్వాత అబ్‌ తుమారే హవాలే వాటా సాథియో సినిమాతో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. 2005 ఫిబ్రవరి 13న టీ సిరీస్‌ అధినేత భూషణ్‌ కుమార్‌ను పెళ్లాడింది. వీరికి 2011లో ఓ బాబు జన్మించాడు. పెళ్లి తర్వాత సినిమాలు వదిలేసిన దివ్య 2016లో సనమ్‌ రే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. దర్శకనిర్మాతగానూ పలు సినిమాలు చేసింది.

చదవండి: చాలామందిని ప్రేమించా కానీ వర్కవుట్‌ కాలే.. లస్ట్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌
అల్లు అరవింద్‌ బిగ్‌ ప్లాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement