Official: Allu Arjun And Sandeep Reddy Vanga Team Up For Pan India Movie - Sakshi
Sakshi News home page

Allu Arjun:ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాణ సంస్థలో బన్నీ నెక్ట్స్‌ మూవీ, ఆ సెన్సేషన్‌ డైరెక్టర్‌తో..

Published Fri, Mar 3 2023 1:18 PM | Last Updated on Sat, Mar 4 2023 9:01 AM

Official: Allu Arjun And Sandeep reddy Vanga Team Up For Pan India Movie - Sakshi

‘పుష్ప’ మూవీ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. దీంతో ప్రస్తుతం ఆయనకు దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగింది. ప్రస్తుతం బన్నీ పుష్ప 2తో బిజీగా ఉన్నాడు. ఇక పాన్‌ ఇండియా స్టార్‌గా ఎంతో క్రేజ్‌ను సొంతం చేసుకున్న బన్ని నెక్ట్స్‌ సినిమా ఏంటనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో అల్లు ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్‌ అందించే అప్‌డేట్‌ ఒకటి బయటకు వచ్చింది. తన నెక్ట్స్‌ మూవీకి ఓ క్రేజీ డైరెక్టర్‌తో జతకట్టబోతున్నాడు బన్నీ. తాజాగా దీనికి సంబంధించని అధికారిక ప్రకటన వెలువడింది.

చదవండి: సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ హీరో కన్నుమూత

‘అర్జున్‌రెడ్డి’ కొత్త ట్రెండ్‌ సెట్‌ చేసిన సెన్సేషనల్‌ డైరెక్టర్‌ దీప్‌రెడ్డి వంగాతో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు ఈ స్టైలిష్‌ స్టార్‌. అర్జున్‌ రెడ్డి అనంతరం అల్లు అర్జున్‌- సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్‌లో సినిమా కోసం ఫ్యాన్స్‌ అంత ఎంతో ఆసక్తికగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అనగానే అభిమానులంత సంబరాలు చేసుకుంటున్నారు. బన్నీ హీరోగా సందీప్‌ రెడ్డి తెరకెక్కించే ఈ సినిమాను బాలీవుడ్‌ ప్రొడక్షన్‌ హౌజ్‌ టీ సిరీస్‌ ప్రొడక్షన్స్, భద్రకాళి పిక్చర్స్ పతాకాలపై భూషణ్‌ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

చదవండి: కాబోయే భార్య ఫొటో షేర్‌ చేసిన మంచు మనోజ్‌

భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు సమాచారం. కాగా సందీప్‌ రెడ్డి ప్రస్తుతం రణ్‌బీర్‌ కపూర్‌తో యనిమల్‌ మూవీని తెరకెక్కిస్తుండగా.. బన్నీ ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ఈ సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ అయ్యే అవకాశం ఉంది. అందే క్రమంలో యానిమల్‌ షూటింగ్‌ శరవేగంగా కంప్లీట్‌ చేసి బన్నీ మూవీని సెట్స్‌పై తీసుకువచ్చేందుకు సందీప్‌ వంగ ప్లాన్‌ చేస్తున్నాడని సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement