ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అయింది. ఈ సినిమాకు ముందు సౌతిండియాకే పరిచయమైన ఐకాన్ స్టార్ పుష్ప తర్వాత నార్త్ ఆడియెన్స్‌కు కూడా బాగా దగ్గరయ్యాడు. పుష్పరాజ్ పాత్రలో తన యాక్టింగ్ యాటిట్యూడ్‌తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌చేశాడు. బీటౌన్‌లో ఈ చిత్రం వందకోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ దక్కించుకున్న బన్నీ ఇప్పుడు పుష్ప-2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి లేదా సమ్మర్ సీజన్‌లో రిలీజ్ చేయనున్నారనే టాక్ వినిపిస్తుంది.
ఈ మూవీ తర్వాత బన్నీ నెక్ట్స్ మూవీ ఎవరితో చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో రకరకాల వార్తలు వినిపించాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మూవీకి కమిట్ అయ్యాడని,అలాగే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా వుంటుందని, ఇప్పటికే ఎనౌన్స్ చేసిన కొరటాల ప్రాజెక్ట్ తిరిగి స్టార్ట్ చేస్తాడని,ఇక దిల్ రాజు బ్యానర్ లో ఐకాన్ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. ఈ డైలమాకి ఎండ్ కార్డ్ వేశాడు ఐకాన్ స్టార్ అర్జున్ రెడ్డి.ఎవరూ ఊహించని విధంగా సందీప్ రెడ్డి వంగాతో తన నెక్స్ట్ సినిమా ఫిక్స్ చేశాడు.
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ మూవీని సందీప్ రెడ్డి వంగా సొదరుడు ప్రణయ్ రెడ్డి నిర్మించనున్నారు. దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా రణ్‌బీర్ కపూర్‌తో యానిమల్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ మూవీ కమిట్ అయ్యాడు సందీప్ వంగా. ఈ రెండు సినిమాలు చేసిన తర్వాత బన్నీతో సినిమా వుంటుందని తెలుస్తోంది. మరి అల్లు అర్జున్ కోసం సందీప్‌రెడ్డి ఎలాంటి కథ సిద్ధం చేయనున్నాడన్నది ఆసక్తిగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment