ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్న ఐఏఎస్‌ ఆఫీసర్‌ పాట | IAS Officer Abhishek Singh Song Breaks The Internet | Sakshi
Sakshi News home page

నాలుగు రోజుల్లోనే 25 మిలియన్‌ వ్యూస్‌

Published Fri, Jul 24 2020 7:20 PM | Last Updated on Sat, Jul 25 2020 3:37 AM

IAS Officer Abhishek Singh Song Breaks The Internet  - Sakshi

ఐఏఎస్ అధికారి అభిషేక్ సింగ్ మొదటి సారిగా నటించిన షాట్‌ ఫిలింలోని ఓ రొమాంటిక్‌ సాంగ్‌ సంగీత ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. ప్రముఖ సింగర్‌ బి ప్రాక్ పాడిన తాజా రొమాంటిక్ సాంగ్‌ ‘దిల్ తోడ్‌ కే’  ప్రపంచవ్యాప్తంగా రికార్డు బద్దలు కొడుతోంది. ఈ పాట విడుదలైన నాలుగు రోజులకే యూట్యూబ్‌ ట్రెండింగ్‌ మారింది. ఇప్పటి వరకు ఆ పాటకు 25 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. ఈ పాటలో ఐఎఎస్ ఆఫీసర్ అభిషేక్ సింగ్‌ నటన చాలా బాగుందని మళ్లీ చూడాలనింపించేంతగా ఆకట్టుకున్నాడంటూ నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.  

ఐఏఎస్‌ అధికారి అయిన అభిషేక్‌ సింగ్‌ తొలిసారిగా నటించిన ఈ  షాట్‌ ఫిలిం పేరు ‘చార్ పండ్రా’. ఈ సినిమా ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్‌ దిగ్గజం టీ సిరీస్‌ రూపొందించింది. ఈ పాటలో అభిషేక్‌ రొమాంటిక్‌ సైడ్‌ని అద్భుత్వం ప్రదర్శించాడు. అంతేగాక ప్రేమలో దెబ్బతిన్న ప్రేమికుడిగా హృదయ విదారకరమైన భావాలను వ్యక్తపరిచి నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడని చెప్పుకొవచ్చు. ఓ ఐఏఎస్‌ అధికారి అయినప్పటికీ నటుడిగా అద్భుత ప్రదర్శనను కనబరిచిన అభిషేక్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. త్వరలో అభిషేక్‌ స్టార్‌ హీరోగా వెండితెరపై కనిపించడం ఖాయమని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  ప్రస్తుతం అభిషేక్‌ ఢిల్లీ క్రైం-2లో నటిస్తున్నాడు. క్రైం నేపథ్యంలో సాగే ఈ వెబ్‌సిరీస్‌ త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement