సినిమాల కోసం రాజీనామా చేసిన IAS.. గతంలో ఈ కలెక్టర్‌ చరిత్ర ఇదే | Abhishek Singh Resignation His IAS Job For Movies | Sakshi
Sakshi News home page

Abhishek Singh IAS: సినిమాల కోసం రాజీనామా చేసిన IAS.. గతంలో ఈ కలెక్టర్‌ చరిత్ర ఇదే

Published Thu, Oct 5 2023 8:01 AM | Last Updated on Thu, Oct 5 2023 9:28 AM

Abhishek Singh Resignation His IAS Job For Movies - Sakshi

ఉత్తర్‌ప్రదేశ్‌ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అభిషేక్‌ సింగ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాలపై మక్కువతో ఐఏఎస్‌ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులు కూడా ధ్రువీకరించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అయిన ఢిల్లీ క్రైమ్‌ సీజన్‌- 2లో ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ పాత్రలో ఆయన మెప్పించిన విషయం తెలిసిందే. గ్లామర్‌లో సినీతారలకు ఏ మాత్రం తగ్గడు. ఓటీటీలలో మంచి నటుడిగా పేరు తెచ్చుకుంటూ, ర్యాంప్‌ల మీద మోడల్‌గా దర్పం ఒలకబోస్తూ, కలెక్టర్‌ స్థాయి అధికారిగా ఢిల్లీ సచివాలయంలో కీలక హోదాలో కొనసాగారు.


(IASగా సస్పెండ్‌ కావటానికి కారణమైన ఫోటో ఇదే)

2011 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిగా భాద్యతలు తీసుకున్నాక సర్వీసులో ఉండగా పలు వివాదాలను ఆయన ఎదుర్కొన్నారు. 2015లో యూపీ నుంచి డిప్యుటేషనుపై దిల్లీకి వెళ్లారు. గతేడాది గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడిగా అభిషేక్‌ వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తానే ఎన్నికల పరిశీలకుడినని చెబుతూ ఒక ఫోటో తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేశారు. ఇదీ ప్రభుత్వ నిబంధనలకు విరుద్దం. దీంతో అతన్ని ఎన్నికల విధుల నుంచి ఈసీ తప్పించి సస్పెండ్‌ చేసింది. తాజాగా ఆయన తన ఐఏఎస్‌ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం సంచలనం అయింది. అభిషేక్‌ సతీమణి శక్తి నాగ్‌పాల్‌ కూడా ఐఏఎస్‌ అధికారి కావడం విశేషం. యమునా నగర్‌ ఇసుక అక్రమ రవాణా కుంభకోణం వ్యవహారంలో ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నది.


(అభిషేక్‌ సతీమణి శక్తి నాగ్‌పాల్‌ IAS)

కొవిడ్‌ మహమ్మారి సమయంలో అభిషేక్‌  పరిపూర్ణ సమాజ సేవకుడిగా మారారు. ఆ సమయంలో రక్తదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆక్సిజన్‌ కోసం ఇబ్బందులు పడుతున్నవారి అవసరాలు తీర్చారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలోనూ తనవంతు పాత్ర పోషించారు. సొంత గ్రామాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న శరణార్థుల ఇబ్బందులు తీర్చారు ఇలా ఎన్నో మంచిపనులు ఆయన చేశారు.

ఈ సినిమాతో గుర్తింపు
అభిషేక్‌ సింగ్‌ తొలిసారిగా నటించిన ఈ  షాట్‌ ఫిలిం పేరు ‘చార్ పండ్రా’. ఈ సినిమా ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్‌ దిగ్గజం టీ సిరీస్‌ రూపొందించింది. ఈ పాటలో అభిషేక్‌ రొమాంటిక్‌ సైడ్‌ని అద్భుత్వంఘౠ ప్రదర్శించాడు. అంతేగాక ప్రేమలో దెబ్బతిన్న ప్రేమికుడిగా హృదయ విదారకరమైన భావాలను వ్యక్తపరిచి నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడని చెప్పుకొవచ్చు. అందుకు కారణం ఈ సాంగ్‌ తన నిజ జీవితంలోని సంఘటనలను బేస్‌ చేసుకుని తీసినట్లు ఆయన చెప్పారు. ఐఏఎస్‌ అధికారి అయినప్పటికీ నటుడిగా అద్భుత ప్రదర్శనను కనబరిచిన అభిషేక్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ పాట విడుదలైన నాలుగు రోజులకే యూట్యూబ్‌ ట్రెండింగ్‌ మారింది. ఇప్పటి వరకు ఆ పాటకు 560 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. అభిషేక్‌కు ఇన్‌స్టాగ్రాంలో 50 లక్షల మంది ఫాలోవర్లు ఉండటం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement